సాహసం చేసే వారిదే జీవితం...

చార్లీ చాప్లిన్ కవిత. తెలుగు అనుసృజన గీతాంజలి (ఏప్రిల్ 16 చార్లీ చాప్లిన్ పుట్టినరోజు సందర్భంగా );

Update: 2025-04-16 03:08 GMT
చార్లీ చాప్లిన్


నా జీవితంలో నేనేం చేసానో తెలుసా మీకు?
నేను దాదాపు మనుషులు క్షమించరాని
పొరపాట్లను క్షమించేశాను!
అసంపూర్ణమైన మనుషులని
తిరిగి ఇష్టమైన వాళ్ళతో
పూరించే ప్రయత్నం చేసాను.
మరిచిపోలేని వాళ్ళని
మరిచి పోయే ప్రయత్నం చేసాను.
మొదటి నుంచీ
నేను చాలా ఆవేశంతో
పనులు చేస్తూ వస్తున్నాను!
క్షమించాలి !
నేను ముందే
కొంత మంది వలన
నిరాశకు గురయ్యి ఉన్నాను.
అయితే నేను కూడా
కొద్దిమందిని నిరాశ పరిచానులెండి !
నన్ను నేను రక్షించుకోవడం కోసం
కొంతమందిని
చాలా ముందే గట్టిగా కౌగలించుకున్నాను!
అలా చేయ లేనప్పుడు మాత్రం
నవ్వకూడని చోట పగలబడి నవ్వాను !
చాలా మందిని శాశ్వత మిత్రులని చేసుకున్నాను!
**
చాప్లిన్
నేను కూడా ప్రేమలో పడ్డాను!
నేను కూడా మరొకరితో ప్రేమించబడ్డాను !
కానీ నన్ను కొద్ది మంది తిరస్కరించారు !
అసలైన విషాదం వినండి !
నేను చాలామందికి ప్రేమ పాత్రున్ని కాగలిగినా
ప్రేమంటే ఏంటో తెలుసుకోలేక పోయాను.
నేను చేసిన వాదాలు
ఎన్నింటినో నిలుపుకోలేక పోయాను.
అయితేనేం?
నేను సంతోషంతో
కేరింతలు కొడుతూ ఉండసాగాను!
మొదటి నుంచీ ప్రేమలోనే బ్రతకసాగాను మరి !
కానీ మీకు తెలియంది ఏంటంటే
చాలా సార్లు సంగీతం వింటూ...
ఫోటోలు చూస్తూ ఏడ్చేవాడిని!
ఒకే ఒక్కరి గొంతు వినడం కోసం
ఫోన్ కాల్ చేసేవాడిని !
అప్పటికే
ఒకరి చిరునవ్వుతో ప్రేమలో పడిపోయాను!
ప్రజలారా !
చాలా సార్లు
నా నొప్పితో కూడిన జ్ఞాపకాలతో
నేను చచ్చిపోతానేమో అనుకున్నాను!
నాకెంతో ప్రత్యేకమైన...
ప్రియమైన మనిషిని
పోగొట్టుకుంటానేమో అని కూడా అనుకున్నాను !
అలాగే కోల్పోయానుకూడా !
అయినా కానీ నేను బతికి పోయాను!
చూడండిటు! ఇంకా నేను జీవించే ఉన్నాను!
***
జీవితంలో మరో దారి లేదిక!
మీరు ఇది మాత్రమే చేయకూడదు సుమా...
జీవించండి!
గుర్తు పెట్టుకోండి!
ఎవరైతే ధైర్య సాహసాలు చూపిస్తారో
జీవితం వారిదే అవుతుంది!
మీరు ధృడ సంకల్పంతో
నిత్యం పోరుకి సిద్ధం కావలసి ఉంటుంది!
జీవితాన్ని స్వంతం చేసుకుని ఆకాంక్షతో బ్రతకాలి!
గర్వంగా .. ఉత్తేజంగా జీవించాలి !
ఎందుకంటే
జీవితం సాహసం చేసే వారికే
స్వంతం అవుతుంది మరి!
అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం...
 జీవితం అంత గొప్పదేమీ కాదు తెలుసుకోండి !


Tags:    

Similar News

పూల గొడుగు