ఈ రోజు ప్రపంచ ఇడ్లీ దినం, దీని వెనక ఉన్నదెవరు?
మదర్స్ డే, ఫాదర్స్ డే, ఎర్త్ డే లాగా ఇడ్లీకి కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అదే మార్చి 30 వ తేదీ. ప్రపంచ ఇడ్లీ దినం. దీని వెనక ఉన్న సాధారణ మనిషి అసాధారణ కథ ఇది
ప్రతి సంవత్సరం మార్చి 30న ప్రపంచ ఇడ్లీదినం జరుపుతారు. ఇది 2015లో మొదలయింది. దక్షిణ భారత టిఫిన్ లలో ఇడ్లీ దోసెలదే నెంబర్ 1. ఈ రెండింటిలో ఎవరు గొప్పో చెప్పడం కష్టం. బ్రేక్ ఫాస్ట్ కు సంబంధించి చాలా పౌష్టికంలో గాని, రుచిలో గాని, జీర్ణానికి సంబంధించి గాని చాలా మంది ఇడ్లీయ బెస్ట్ అంటారు.అందుకే జబ్బు పడిన వాళ్లు, డైటింగ్ చేస్తున్నవాళ్లు, పాక్షిక ఉపవాసం ఉంటున్న వాళ్లే కోరేది ఇడ్లీయే.
ఎనియవన్ మొదట ఆటోడ్రైవర్. సొంతవూరు కొయంబత్తూరు. ఆటో అదిగట్టుబాటు కాలేదు. తర్వాత బతుకుదెరువుకు ఆయన చెన్నై వలస వచ్చాడు. దాంతో హోటల్ పనికి కుదిరాడు. మొదట్లో ఒక హోల్ సేల్ ఇడ్లీ సెల్లర్ దగ్గిర క్లీనర్ గా పనిచేశాడు. ఆతర్వాత సర్వర్ అయ్యాడు. తర్వాత రెండు ఇడ్లీ పాత్రలతో సొంతంగా ఇడ్లీ వ్యాపారం మొదలుపెట్టాడు. అంతే ఆయన చేతిలో ఇడ్లీ నవనీతం ముద్ద అయింది. ఆయన ఇడ్లీ పండితుడయ్యాడు.
ఆదే నడుస్తున్న చరిత్ర. ఇదీ అదీ అని లేదు. ఏ ఇడ్లీ కావాలన్నా ఆయన తయారు చేసి ప్లేట్ లో శుభ్రంగా అమర్చి అందిస్తాడు. ఆయన దగ్గిర తెల్లటి చందమామ లాంటి ఇడ్లీ లే కాదు, పళ్లతో, కాయలతో చేసిన ఇడ్లీలు లభిస్తాయి. చాకొలేట్ ఇడ్లీలున్నాయి. మికీ మౌస్, కుంగ్ ఫూ పాండా ఇడ్లీలున్నాయి. ఇపుడు ఆయన పిజా ఇడ్లీ బాగా పాపులర్ అయింది. ఆయన సృష్టించిన ఇడ్లీలలో లేత కొబ్బరి గుజ్జు ఇడ్లీ సూపర్ హిట్. ఇడ్లీలతో ఆయన ఎన్ని ఆటలాడతాడో లెక్కేలేదు. చట్నీ కూరిన ఇడ్లీ కూడా చాలా ఫేమస్. చెన్నైలో ఆయన ఇడ్లీ క్యాంటీన్ పేరు మల్లిపూ ఇడ్లీ (Mallipoo Idli). అంటే మల్లెపూలంతా తెల్లగా సుకుమారంగా, మనసును ఆకట్టుకునేలాగా ఉంటాయనేగా అర్థం.
ఇడ్లీ రుచియే కాదు, సైజు, ఆకారాలకు కూడా ఆయన చాలా ప్రాముఖ్యం. ఇస్తాడు. అదే తన వ్యాపార విజయ రహస్యం అని కూడా అంటాడు. ఇంతవరకు ఆయన 38 పిజి హాస్టళ్లకు 3,29,800 ఇడ్లీలు సప్లై చేశాడు. తనది చెన్నైలోనే బెస్ట్ ఇడ్లీ అని చెబుతాడు.