అరుణ తార!

తెలుగులో లాంగ్స్టాన్ హ్యూగ్స్ (Langston Hughes) ఆఫ్రో అమెరికన్ పొయెట్ కవిత. అనువాదం- గీతాంజలి.;

Update: 2025-04-22 04:40 GMT

లెనిన్ ప్రపంచమంతా పర్యటిస్తాడు !

దేశాల మధ్యన సరిహద్దు రేఖలు అతన్ని ఆపలేవు !
సైనిక స్థావరాలు..అడ్డుగోడలు కాదు కదా
ఏవీ..ఏవీ కూడా లోకమంతా తిరుగాడే లెనిన్ న్ని ఆపలేవు.
కనీసం ఇనుప కంచెల ముళ్ళు కూడా అతన్ని గాయ పరచలేవు!
**
అవును లెనిన్..లోకమంతా తిరుగుతాడు!
నలుపు,గోధుమ,తెలుపురంగుల మనుషులు అతనికి స్వాగతం పలుకుతారు.
ఇక భాష అంటారా..ఒక అడ్డంకి కానే కాదు!
వింతైన భాషలో మాట్లాడే నాలుకలు కూడా అతన్ని నమ్ముతాయి!
**
అవును..లెనిన్ లోకమంతా తిరుగుతూనే ఉంటాడు!
ఆకాశంలో అస్తమించే సూర్యుడు ఒక మచ్చలా మిగిలి పోతాడు!
ఇక అప్పుడు.. ఒక అద్భుతం జరుగుతుంది !అంధకారానికీ... ఉషోదయానికీ నడుమ
కోటి కాంతులతో మెరిసిపోయే ఒక అరుణ తార ఉదయిస్తుంది!
అవును... లెనిన్ లోకమంతా తిరుగుతూనే ఉంటాడు.. అప్పుడూ...ఇప్పుడూ..ఎప్పుడూ


((ఏప్రిల్ 22 వ్లాదిమిర్ లెనిన్ పుట్టిన రోజు -156 రవ జయంతి సందర్భంగా ఈ కవిత)

Tags:    

Similar News