NAXALS | ఆ 'మను'వుల ముందు మీరోడిపోయారు, ఇక బయటకు రండి!

ముక్కలైన కమ్యూనిస్టులు ఒక్కటై ప్రగతిశీల శక్తుల్ని కలుపుకొచ్చినపుడే సమాజ న్యాయం సాధించగలం! అంటున్నారు ప్రముఖ కవి తమ్మినేని అక్కిరాజు..;

Update: 2025-01-22 03:03 GMT

(తమ్మినేని అక్కిరాజు)

..........

చాలు తమ్ముళ్ళూ !

బయటికొచ్చేయండి!
50సంవత్సరాలకాలం
మీ త్యాగాలు వృధా!!

ప్రజలసహకారమేదీ?
ప్రజల్లో మార్పు రాలేదు!
దరిద్రం పోకపోయినా
వాళ్ళకు'దేవుడు'చాలు!

విప్లవమంటే తెలీదు!
దేవుడన్నా తెలీదు!
అయినా దేవుణ్ణి బాగా
మైండ్ లోకి ఎక్కించారు!

పైన 'ఒకడు' ఉన్నాడు
మిమ్మల్ని రక్షిస్తాడు!
ఇదొక్కటే మంత్రం!
'మత'వాదుల తంత్రం!

మంత్ర తంత్రాలతో
ముక్కోటిదేవుళ్ళతో
భ్రమలు మహిమలు
మహాత్మ్యాలతోజనం!

అబద్ధాల 'మను'వులు
బాగా ఎక్కించేశారు!
గణపతి పాలు తాగటం!
హనుమాన్ రక్తకన్నీరు!

చిలకలు పందులు
ప్రదక్షిణలు చేస్తాయి!
కూలినచెట్టు లేవటం!
హాలీవుడు అగ్నిహోత్రం!

అన్నీ దైవమహాత్మ్యాలే
పద్మనాభుడి జ్యోతి నిజం
కాదన్నా -సందర్శనం
ఆపని అమాయక జనం!

సాయిబాబా పిలుస్తాడు!
ప్రమాదంనుండి రక్షిస్తాడు!
నిత్యం భ్రమల్లో జనం!
వీళ్ళనెలామారుస్తావు?

భక్తి ఒక్కటేకాడు-కులం
గొప్పలు వంశవృక్షాలు!
వివక్షలు విద్వేషాలు ఇదీ
మన జనాల దుస్థితి!

ఇదంతా 'మనువు'గాడి
మహాత్మ్యం!అమానుషం!
సిగ్గులేనిధర్మం సనాతనం!
మళ్ళీఇదేప్రయత్నంవాళ్ళది!

దీన్నిమార్చటం ముఖ్యం
బయటికొచ్చేయండి!
మీ త్యాగాలు అమోఘం!
కాని అంతా వృధా!!

తుపాకీ విప్లవం వద్దు
అనేకవిప్లవాలున్నాయి!
రష్యా చైనా అలాఉంచు!
ఇది భారత్ విప్లవం!

ముక్కలైన కమ్యూనిస్టులు
ఒక్కటై ప్రగతిశీల శక్తుల్ని
కలుపుకొచ్చినపుడే సమాజ
న్యాయం సాధించ గలం!

భక్తిపిచ్చి మూఢత్వం రక్తి కట్టించినమనువులనుండి
సమాజాన్ని కాపాడాలంటే
మీరుబైటకు వచ్చేయండి!

సమానత్వసిద్ధాంతంమీది
సంపదలను కార్పొరేట్లకు
అప్పగిస్తున్నది వాళ్ళు!
ఎవరు ప్రజాశత్రువులు?

ఒక్కడుగు వెనక్కెయ్యండి
అందరం కలిసి ఆలోచిద్దాం!
దొంగలరాజ్యం నుంచి
ప్రజల్ని కాపాడటం ఎలాగో!

ఒకప్పుడు చైనా ప్రజలు
మత్తుమందు భాయీలు!
నేడువాళ్ళప్రగతిని చూస్తే
కళ్ళు తిరిగిపోతున్నాయి!

కొత్తగా ఆలోచిద్దాం!
ప్రజలభావాలు మారాలి!
భావవిప్లవం రావాలి!
మనమంతా కలిసి తేవాలి!

అభివృద్ధికి మూలం
ప్రజలకట్టే పన్నులు!
దినదిన గండంగా
పన్నులు పెంచేస్తున్నారు!

ఆ లెక్కలేవీ చెప్పరు!
సర్వం రామనామం!
బాలరాముణ్ణి చూపించి
జనాన్ని పక్కదారి పట్టిస్తారు

అంబానీలు అదానీలు
గుజరాత్ వ్యాపారులు
బ్యాంక్ టోకరాగాళ్లు!
ప్రజలకు తెలిసేదెలా?

రాజ్యాంగాన్నే లేపేసి
మనుస్మృతిని తెచ్చి
చాతుర్వర్ణ వ్యవస్థకు
నీరుపోసి పెంచాలని!!

ఈదుర్మార్గాన్నికొనసాగనిస్తే
ఇన్నాళ్లు పడ్డ శ్రమ వృధా !
మళ్ళీ మధ్య యుగాల్లోకే!
రండి!ప్రజల్లోకి వెళదాం!!

దరిద్రాన్ని నిరుద్యోగాన్ని
విద్యా ఆరోగ్యాసమస్యల్ని
పరిష్కరించకుండామిమ్మల్ని
చంపటం పరిష్కారమా?

రండి తమ్ముళ్ళూ రండి
బయటకు వచ్చేయండి!
వాస్తవాలుప్రజలకుచెప్దాం!
కబ్జాదొంగల పనిపడదాం!

మతోన్మాదం రెచ్చగొట్టి
మతరాజ్యం తెచ్చిపెట్టి
ఏకత్వం చెడగొట్టే వాళ్ళకు
తగిన బుద్ధి చెపుదాం!!
***

Tags:    

Similar News