మన ఆరోగ్యం మన ఆహారంలోనేనా..!

ప్రపంచంతో పడుతున్న పోటీలో యువత తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక మోస్తరు డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత వారిలో హెల్త్ కాన్షియస్ బాగా పెరుగుతుంది.

Update: 2024-05-31 14:20 GMT

ప్రపంచంతో పడుతున్న పోటీలో యువత తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక మోస్తరు డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత వారిలో హెల్త్ కాన్షియస్ బాగా పెరుగుతుంది. ఇక అప్పటి నుంచి సన్నబడాలని, పొట్ట తగ్గాలను ఆలోచిస్తూ అడ్డదిడ్డబైన డైట్‌లు చేస్తున్నారు. లక్షల రూపాయలు తమ కొవ్వును కరిగించడానికి ఖర్చు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన ఆరోగ్యం మన ఖర్చు చేసే డబ్బులో ఉందా లేకుంటే మనం తీసుకునే ఆహారంలో ఉందా అన్న అనుమానం కలుగుతుంది. ఈ విషయంలో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం ఏదైనా ఒక్కటే చెప్తుంది. పొట్ట మన మాట వింటే ఆరోగ్యం బాగుంటుందని, పొట్ట మాట మనం వింటే పొట్ట ఒక్కటే బాగుంటుంది అని.

అదే విధంగా ఆయుర్వేదం ఈ అంశాన్ని మరింత క్షుణ్ణంగా వివరిస్తూ మన రోజూ నిద్ర లేచినప్పటి నుంచి తిరిగి నిద్రపోయే వరకు తీసుకునే ప్రతి ఒక్క ఘన, ద్రవ పదార్థాలు మన ఆరోగ్యంపై ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ప్రభావం చూపుతాయి. తాజాగా ఇదే అంశాన్ని కడపలోని ఫేమస్ హోటల్ ‘ఆరోగ్య ఆహార కేంద్రం’ నిర్వాహకులు కల్లూరి రఘురామిరెడ్డి కూడా చెప్తున్నారు. మనం తీసుకునే ఆహారంలోనే మన ఆరోగ్యం దాగి ఉందని ఈ మాట తాను తన స్వీయానుభవంతో చెప్తున్నానని ఆయన వివరించారు. తమ హోటల్‌లో లభించే ప్రతి ఆహార పదార్థం కూడా ప్రజలకు ఆరోగ్యవంతులుగా చేసేవేనని, ఆ విధంగా తాము సాంప్రదాయ బద్దంగా వంటకాలు చేస్తామని ఆయన వివరించారు. మాది హోటల్ కాదని, ఆరోగ్యం కోసం స్థాపించిన సంస్థ అని చెప్పారు. ఈ సంస్థను స్థాపించడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని వివరించారు.

స్వీయానుభమే..

‘‘నాకు నేను అనుభవం. 2009కి ముందు నేను చాలా ఓవర్‌వేట్ ఉండేవాడిని. దాదాపు 132 కిలోల బరువు దానికి తోడు బీపీ, షుగర్ కూడా ఉన్నాయి. ఇప్పుడెలా అనుకుని బరువు తగ్గిస్తే సరిపోతుందని ఆలోచించా. దాంతో ఉపవాసాలు చేయడం మొదలు పెట్టి 43 రోజుల్లో 25 రోజులు బరువు తగ్గా. ఆ తర్వాత కూడా వందకు పైగా రోజులు ఒంటి పూట భోజనం మాత్రమే చేస్తూ డైట్‌ను మెయింటెన్ చేశా. దాంతో దాదాపు 52 కిలోల బరువు తగ్గాను. బరువుతో పాటు నాకున్న బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్‌లోకి వచ్చేశాయి. ఎప్పుడైతే బరువు తగ్గడంతో నాకు ఉన్న రుగ్మతలు తగ్గాయని గమనించానో అప్పుడు నాలో ఒక ఆలోచన రేగింది. ఎందుకిలా అని అనిపించి. రీసెర్చ్ చేయడం ప్రారంభించా’’ అని చెప్పుకొచ్చారు.

 

‘‘ఈ పరిశోధన సమయంలో ఎక్కడా నాకు కావాల్సిన సబ్జెక్ట్ దొరకలేదు. అప్పుడు నేను ఆయుర్వేదంలో చూశాను. అక్కడ నాకు కొంత అర్థమైంది. ఆయుర్వేదంలో మన ఆహార అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతమేరా శాసిస్తాయని చాలా విపులంగా ఉంది. అక్కడ నేను నేర్చుకున్న సబ్జెక్ట్‌ను పదిమందితొ పంచుకుంటే బాగుంటుందని భావించారు. చాలా సెమినార్లు, సమావేశాలు సొంతగా నిర్వహించాను. 2017లో కడపకు వచ్చి ఇక్కడ క్లాసులు చెప్పడం ప్రారంభించా. అప్పుడు తినే ఆహారమే మనకు మూలం అని నేర్చుకున్నాను’’ అని వెల్లడించారు.

ఫుడ్‌తో వచ్చిన వ్యాధులకు ఫుడ్‌తోనే చెక్

‘‘ఈ ప్రయాణంలో ఫుడ్‌తో వచ్చిన వ్యాధులకు ఫుడ్‌తోనే చెక్ చెప్పొచ్చని అర్థం చేసుకున్నాను. ప్రస్తుతం మన ఎలాబడితే అలా తినడం వల్లే ముఖ్యంగా వస్తున్న వ్యాధులు బీపీ, డయాబెటీస్. దాంతో పాటుగా డీ విటమిన్ డెఫిషియన్సీతో అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. వాటన్నింటిని కూడా కరెక్ట్‌గా ఆహారం తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఆ ఆలోచనతోనే 2017లో 207 మంది సభ్యులం కలిసి ఈ సంస్థను ప్రారంభించాం. ఇప్పుడు మా సభ్యులు వేల సంఖ్యలో ఉన్నారు. విదేశాలకు కూడా మా ప్రొడక్స్ పంపుతుంటాం. మేం తయారు చేసే ఆహార పదార్థాలు అన్నీ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టేవే. సాధారణంగా బయట మెడికల్ షాపుల్లో మనకున్న రోగానికి మందులు ఇస్తారు. కానీ మా దగ్గర ఆహారమే ఔషధంలా పనిచేస్తుంది. వచ్చి రోగాన్ని కాదు రోగమే రాకుండా చేసేలా ఆహారాన్ని తయారు చేస్తాం. ఒకానొక్క సమయంలో మన తినే ఆహారంలో 72 రకాల మసాలా దినుసులు ఉండేవి. కానీ ఇప్పుడు అవేమీ ఉండటం లేదు. గరమ్ మసాలా అంటూ వాడు తనకు నచ్చిన మందులు కలిపి తయారు చేస్తున్నాడు. దాన్ని మనం వాడుతున్నాం. దాని వినియోగం మొదలైన తర్వాతే మనకు రోగాలు కూడా ప్రారంభమయ్యాయి’’ అని చెప్పారు.

అన్నీ డిఫరెంటే

‘‘మా దగ్గర ఆహార పదార్థాలే కాకుండా ఛాయ్ కూడా మా దగ్గర చాలా వేరుగా ఉంటుంది. మా దగ్గర టీలు ఎన్ని తాగినా ఆకలి అవుతూనే ఉంటుంది. అన్నీ పదార్థాలు ఆర్గానిక్‌గా ఉంటాయి. కషాలు కూడా ఉంటాయి మా దగ్గర. అనేక జబ్బులకు ఈ కషాలు పనిచేస్తాయి. జ్యూస్‌లు కూడా ఉంటాయి. కోల్డ్ ప్రెస్ పద్దతిలో జ్యూస్‌లు తీస్తాం. సాధారణంగా మిక్సీలో జ్యూస్‌లు పడితే అవి ఆక్సిడైజ్ అవుతాయి. మా దగ్గర అలా కాదు’’ అని చెప్పారు. చివరిగా తాను ఒకటే చెప్తానని, ఆహారం విషయంలో పాత పద్దతులు పాటించడం వల్ల అనేక లాభాలు ఉంటాయని, వాటిని పాటించడం ద్వారా ఆరోగ్యం వస్తుందని చెప్పారు.

అందరిదీ ఇదే మాట..

ఈయనే కాదు చాలా మంది వైద్యులు, నిపుణులు కూడా ఇదే మాట చెప్తున్నారు. మనం ఏం తింటాం.. ఎలా తింటాం అనే దానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు. ఆహారంపై నియంత్ర, క్రమబద్దతను కలిగి ఉంటే అది మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. ఒక్కరోజు ఆలస్యంగా ఆహారం తీసుకుంటే ఎసిడిటీ వస్తుండటం ఇందుకు ఉదాహరణ అని, అదే విధంగా మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాయని అనేక మంది వైద్యులు చెప్తున్నారు.

Tags:    

Similar News