నేటికీ రావెల సోమయ్య నాటి సోషలిస్టే

ఆ రోజుల్లో రామ్‌మనోహర్‌ లోహియా గుంటూరుకు వచ్నిపుడు వారిని కలిశారు. నాటి నుంచి నేటి వరకు 90 యేళ్లు పైబడ్డా సోషలిస్టు భావజాలానికి అంకితమై పనిచేస్తున్నారు.

Update: 2024-07-24 02:38 GMT
భార్య అరుణతో రావెల సోమయ్య

 -నందిరాజు రాధాకృష్ణ

.

ఈతరం వారికి రావెల సోమయ్య గురించి అంతగా తెలియక పోవచ్చు కాని మా ముందు తరం, మా తరం వారికి రావెల సోమయ్య బాగా తెలుసు. రావెల సోమయ్య పోతపోసిన నిలువెత్తు సోషలిస్టు. రామ్ మనోహర్ లోహియాకు తెలుగు నేలపై అసలు సిసలు వారసుడు. లోహియా సోషలిజం, ఎమ్.ఎన్.రాయ్ హ్యుమానిటీ మూవ్మెంట్ రెండూ రెండు కళ్ళలాంటివి. ఇక హేతువాదం ఎలాగూ వుంది. అది మూడో కన్ను. ఉద్యోగం, వ్యాపారం లేకుండా, అసలు సోషలిస్టు పార్టీయే లేకున్నా జీవితాంతం సోషలిస్టుగానే మిగిలిపోయారు. వయసు రీత్యా ఆయన తొంభైలోకి ప్రవేశించారు... అయితేనేం కుర్రాళ్ళతో పోటీపడే ఉత్సాహం. ఇప్పుడు కూడా కళ్ళద్దాలు లేకుండా చకచకా వార్తాపత్రికల్ని, పుస్తకాల్ని చదివేస్తారు. పాత విషయాల్ని పొల్లు పోకుండా అప్పజెబుతారు. పుస్తక పఠనం, పుస్తకం ముద్రణలు ఆయన ప్రధాన వ్యాపకం.

లోహియాతో పాటు, జార్జిఫెర్నాండెజ్, మధులిమాయే, మధు దండావతే, జయప్రకాష్ నారాయణ, రబీరే, ఎస్ ఎమ్ జోషి తదితర సోషలిస్టు పార్టీ నాయకులు సోమయ్య గారికి సన్నిహితంగా వుండేవారు. స్వాతంత్య్ర వచ్చాక ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలన్న డిమాండ్ తో అఖిల భారత సోషలిస్ట్ పార్టీ పిలుపు మేరకు 1960లో చీరాల, వేటపాలెంలో ప్రముఖ సోషలిస్టు నాయకులు పల్లవోలు సాంబశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన 'భారతీయ సత్యాగ్రహం' లో పాల్గొని అరెస్టయ్యారు. రెండునెలలు వరంగల్ జైల్లో ఉన్నారు.

సోమయ్య గారు గుంటూరు జిల్లా తుళ్లూరు లో 1935 జూలై 24 రైతు కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్య తుళ్ళూరులోనే జరిగింది…. అయితే అక్కడ హైస్కూలు లేకపోవడంతో దగ్గర్లోవున్న తాడికొండ‌ హైస్కూల్లో చదివారు ఆయన ఇంటర్మీడియట్‌ చదివే రోజుల్లో సోషలిస్టు పార్టీ పరిచయమైంది. అప్పుడు స్తకాలకన్నా, పార్టీ సాహిత్యమే ఎక్కువగా చదవడంవల్ల చదువు పట్ల ఆసక్తి పోయింది. 1955లో రామ్‌మనోహర్‌ లోహియా గుంటూరుకు వచ్చారు. అప్పుడు వారిని కలిశారు. డిగ్రీ అయ్యాక చదువు ఆపేసి, ఆనాటి నుంచి నేటి వరకు సోషలిస్టు పార్టీ కార్యక్రమాలకు, ఆభావజాలానికి పూర్తిగా అంకితమయ్యారు.

గొప్ప సోషలిస్టు విప్లవకారుడు డాక్టర్ రామ్మనోహర్ లోహియాకు తెలుగు మాట్లాడే ప్రజలలోనే కాదు, యావత్ భారతదేశంలోని అత్యంత సన్నిహిత సహచరులలో ఆయన ఒకరు. అతను మానవతావాద తత్వవేత్త, ఎల్లెన్ రాయ్‌తో వివిధ సమస్యలపై ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిన అరుదైన మేధావి. ఎల్లెన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపకుడు, తరువాత రాడికల్ హ్యూమనిజం తత్వశాస్త్రాన్ని స్థాపించిన ఎం ఎన్ రాయ్ భార్య. ప్రశంసలు పొందిన మానసిక విశ్లేషకుడు ప్రామాణికమైన ప్రశంసలను అందుకోని ఆలోచనా ప్రవాహం లేదు: స్వాతంత్ర్య పోరాటం నుండి ప్రారంభ సోషలిస్ట్ ఉద్యమం వరకు; కమ్యూనిజం నుండి హేతువాదం వరకు; మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద ఆయనకు ఎంతో ఇష్టం. అరబిందో అంటే గౌరవం.. తెలుగు కవయిత్రి పఠాభి రామిరెడ్డి భార్య, ప్రఖ్యాత మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీమతి స్నేహలతారెడ్డి మరణాన్ని స్మరించుకుంటూ మహిళా సాధికారతపై ప్రత్యేక సంచికను తీసుకొచ్చిన అనూహ్యమైన గొప్ప వ్యక్తి ఆయన.

వాణిజ్య ప్రచురణ సంస్థలు కొన్ని విలువైన సోషలిస్టు సాహిత్యాన్ని ప్రచురించడానికి వెనుకడుగు వేసినప్పుడు, వాటిని ప్రచురించడానికి "లోహియా విజ్ఞాన సమితి"ని స్థాపించడానికి ముందుకు వచ్చారు.. ఆయన మరెవరో కాదు రావెల సోమయ్య! చంపారన్ ఉద్యమ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమయ్య సంపాదకత్వంలో వివిధ వ్యాసాల అనువాదాలను సంకలనం చేసి ప్రచురించడం ఒక అపూర్వ ఘట్టం. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయ భాషా నిలయంలో పుస్తకావిష్కరణ నుంచి పుస్తకావిష్కరణ వరకు అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి.

2002లో పూణేలో మధు దండావతే ఏర్పాటు చేసిన సోషలిస్టు ఫ్రంట్‌లో సోమయ్య తెలుగు రాష్ట్రాలకు కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. సోషలిస్టు సంప్రదాయానికి చెందిన ప్రముఖ నేతల ఫొటోలతో కూడిన ఫ్రంట్ లోగో ఆవిష్కరించారు. సోమయ్య పట్టుదలతో ఆ లోగోలో డా.బి.ఆర్.అంబేద్కర్ ఫోటో చోటు చేసుకుంది. ఈ రచనలన్నింటి కంటే, సోమయ్య తన కుమారుడు రావెల మనోహర్ సహాయంతో, అమెరికా నుండి “www.lohiatoday.com” అనే వెబ్‌సైట్‌ ప్రారంభించి, కుమారుని సహాయంతో నడుపుతున్నారు, గాంధీ రచనలను సేకరించారు. లోహియా, రాయ్ అంబేద్కర్‌తో పాటు అనేక ముఖ్యమైన పుస్తకాలు, మ్యాగజైన్‌లు మొదలైనవాటిని ఔత్సాహిక పాఠకుల ప్రయోజనం కోసం ఉంచారు

గొప్ప సామ్యవాది. ఎమ్ ఎన్  రాయ్‌కి  సోషలిస్టు లోహియా రాయ్ రాడికల్ హ్యూమనిస్ట్ ఆలోచనలను లోహియాకు పరిచయం చేశారు. వారు ఆ రోజుల్లో కేవలం ఇద్దరు వ్యక్తిగత ఆలోచనాపరులు కాదు. వారు నిజానికి, రెండు శక్తి కేంద్రాలు, వారి శక్తికి సామాజిక మార్పు కోసం మీడియాగా పనిచేస్తున్నారు. ఇద్దరు మహానుభావుల మధ్య సైద్ధాంతిక సంభాషణకర్తగా పనిచేయడం అంత తేలికైన పని కాదు. దీన్ని సాధ్యం చేసిన క్రెడిట్ అంతా సోమయ్య గారికి దక్కుతుంది. గోరా, రంగా, రోశయ్య, బద్రివిశాల్ పిత్తి, ఎడ్లపాటి లాంటి మహోన్నతులు వారి అనుంగుమిత్రులు. శ్రేయోభిలాషులు. గుంటూరులో దివంగత డాక్టర్ కాసరనేని సదాశివరావు నిర్వహించిన సాహితీ సదస్సుకు ఆయన వీలున్నప్పుడల్లా హాజరు.

1961 లో సోమయ్యగారి పెళ్ళి పురోహితులు, పెళ్ళి మంత్రాలు లేకుండానే జరిగింది. వధువు మేనమామ కూతురే అయినా, పెళ్ళిమాత్రం సాంప్రదాయేతర పద్ధతిలో జరిగింది వేదిక మీద వధూవరులు దండలు మార్చుకోవడం, ప్రముఖులు ప్రసంగాలతో ముగిసిన ఆదర్శం వివాహం. పెళ్ళికి స్నేహలతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే గో.రా. రెండో అల్లుడు జొన్నలగడ్డ రామలింగయ్య, నన్నపనేని వెంకట్రావు వంటి పెద్దలు చాలామంది హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అమెరికన్ సోషలిస్టు, టూరిస్టు, మాన్ కైండ్ పత్రిక నిర్వహణకర్త కూడా పెళ్ళికి హాజరయ్యారు. వేదిక మీదే ఈ పత్రికకు వెయ్యి రూపాయల్ని విరాళంగా అందజేశారు సోమయ్య. పెళ్ళయ్యాకనే అరుణ ఎమ్.ఏ. ఎకనమిక్స్ చేసి లెక్చరర్ ఉద్యోగం చేశారు తెనాలి వి ఎస్ అర్ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసారు. సోమయ్య - అరుణ సంజీవదేవ్ మధ్య స్నేహబంధం కూడా అలాంటిదే… కళా తపస్వి సంజీవ్ దేవ్ శ్రీమతి అరుణ దంపతుల గొప్పతనాన్ని వారి సహకారాన్ని అంచనా వేయడానికి అతని ఆత్మకథ – “తుమ్మపూడి”లో ఆయన ప్రేమపూర్వక వ్యాఖ్యలను ప్రస్తావించవచ్చు.

"అమె తో నాకు విద్యార్థి దశ 1965 నుంచీ పరిచయం.చదువరి, ఆలోచనా పరురాలు. అంగ్లం, తెలుగు భాషల్లో అనర్గళం. హిందీ లోనూ ప్రావీణ్యం, పరస్పరం సామరస్య సమ్మేళనంతో అరుదైన జంట. ఆ దంపతులిరువురూ 1967 శాసన సభ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచీ సోమయ్య సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసారు. హైదరాబాద్ బేగంపేట వాస్తవ్యులు. అరుణ నాకు 1965 నుంచీ అక్క, ఆయన బావయ్య గారే. మాకుటుంబమన్నా అమిత ప్రేమ, అభిమానం, మా అమ్మ తరువాత ప్రాధాన్యత అరుణక్కకే. నా భార్య అన్నా, పిల్లలన్నా వారిరువురికి అమిత ప్రేమ వాత్సల్యం."

(వ్యాసరచయిత, సీనియర్ జర్నలిస్ట్, 98481 28215)


Tags:    

Similar News