రాత్రి (కవిత)

మూలం :హెన్రీ లూయిస్ అనువాదం : డా. మురళీధర్ అలజంగి;

Update: 2025-07-06 02:48 GMT

I

ఏకాంతానికి, చింతనకు సమయం ఇది:..

కాంతులీనే నీ మనోహర చిరు దరహాసం ఇప్పటికీ, ఎప్పటికీ,

కన్నార్పకుండా చూస్తుంటాను నీ లాలిత్యాన్ని ,

అబ్బా! మనస్సు దోచే నీ వశీకరణ శక్తితో

నేనెంతగా అనుభూతిస్తున్నానో ఓ తీయని రాత్రీ !

నల్లని విస్తార సాగర జాలం పై తేలీ యాడుతున్న

తెల్ల తెల్లని చిరు ఓడ ల చంద మామ:

ఆమె వెన్నెలను హృదిలో సాక్షాత్క రించు కునేది ప్రేమికులు మాత్రమే,

వారి ప్రణయ భేటీ కది రాచ బాట;

స్పూర్తి నిచ్చే ఉద్దీప నా దృశ్య మది వారికి,

ఎక్కడో సుదూరాన పడుతూ జల పాతం చేసే మృదు సవ్వడి లా,

వారి బాసలన్నీ సంగీత స్వరాలై తీయగా జాలు వారుతుంటాయి;

మామూలు మనుషుల్లా గాక, ఒకరి కొకరు స్వప్న జనిత రూపాలై నట్లు

ఆనందా భుధి లో పొంగి పొర్లు తుంటాయి వారి ఎదలు !

II

రాత్రీ, రాత్రీ, ఓ రాత్రీ ! కోమల రూపం నీది,

బిడ్డను గాంచె అనురాగ మాతృ మూర్తీ చిరు దర హాసం లాంటి నీ రూపం!

రెప్ప వాల్చ కుండ చూస్తాను నీ మోముని

ఉత్తమ, ఉన్మత్త ఆలోచనలు ఆకాంక్ష లతో నా ఆత్మ వడిగా ఉప్పొంగే వరకు,

ఎప్పుడు అంతే ;

భూగోళాన్ని వెనక్కు తన్ని నిరాకరిస్తుండే హద్దుల్లేని ఆకాశంపై దృష్టి నిలిపితే

బృహత్ చిత్రం విస్తార మౌతుంది, అది

ఏదైనా ఉజ్వల గోళంలో ఓ నివాస స్తలాన్ని వెతుక్కుంటుదని

గ్రహించే వారు కొందరు,

నా గుండెలో భగ భగ మండుతున్న ఆశాగ్నులు స్వైర భావనలు

వాంఛలు , ఆకాంక్షలు సర్వం

నీ చీకట్లతో సమంగా అంత రించ వ చ్చునేమో గానీ ఓ రాత్రీ !

నా ఆత్మ మాత్రం భూమికి దూరంగా ఎగిరి పోగలదు.

అల్లదిగో అక్కడున్నదే ఆ అందాల తార పై నా సఖి తో అది గడప గలదు

III

ఆహా ! ప్రశాంత రేయిలో జ్ఞాపకాలు తొలి ప్రేమను అది గతమే అయినా గాని ,

ఎంత ప్రియంగా ఉందో గదా !

మదిని దోచే సకల వర్ణ శోభిత పరవశ ప్రేమ అది,

చిరకాలం శాశ్వతంగా నిలుస్తుందని మేమెప్పుడు నమ్మిన ప్రేమ అది!

కాలమా ! పూలపై నీ పాదం మెత్తగా పడిన క్షణాల్ని,

డయానా తన మేలిమి చిరు నగవుతో వాటి మోములను వెలిగించిన క్షణాల్ని,

యువ హృదయాలు ప్రతి గడియను ఆబగా సుఖించిన క్షణాల్ని, గొప్ప సంతోష క్షణాలని ,

ఈ సమయాన, పదే పదే, నేను భావిస్తాను,

ప్రియుడు తన ప్రేయసిని ప్రేమగా పిలిచి నప్పుడు

జ్వాల తాకినంతనే తెల్లగా తళుక్కు మనే రాతి నార రేకులా

లో లోనా కాంక్షాజ్వాల ప్రకాశిస్తుంటే ,ఆమె చుబుకం వివర్ణమై న క్షణా న్న

ఉన్మత్తతతో అతని హృదయం పురివిప్పు కునేది,

ఆమె సుందర ఫా ల భాగంపైన అతని దృష్టి చెదరక నిలిచి ఉండేది,

ప్రేమ దర్శన మౌతుందేమోనని అతని గుండె ఆమె కన్నులను శో ధిం చేది .

IV

రాత్రి మేల్కొ లుపుతూ ఉంటే ఆలోచనలు పులి చూపు అంత చురుకుగా, తరిమే డేగ అంత వడిగా ..

ఒక దాని వెంట ఒకటి ముంచె త్తుతున్నాయి---

గతాన్ని జ్ఞప్తికి తెస్తున్నవి కొన్ని ,

పునీత స్మృతి తారను స్వాగతిస్తూ ముంజీకట్ల జీవితాకాశంపై తారాడు తున్నవి కొన్ని,

నా అభాగ్య హృదయమా, ఒంటరివే అయినా, నీవు

గత కాలపు సుఖ సంతోశాలపై మనస్సు లగ్నం చేయవలసినది చాలానే,

ఈ సంతోషం ఎన్నటికీ గతమే కానీ ఆ స్మృతి తక్కువ ప్రియమైనదేమి కాదు

ముసుగు మాటున మరుగున పడ్డ ముఖాలావణ్యంలా

అదిగో ! అక్కడ ఓ నల్లని మబ్బు రే రాజు మనోహర బింబాన్ని నిలువునా కమ్మేసింది !

హుష్ ! నిశ్శేబ్దం అంతట -కని నాకిలా తోస్తున్నది నా చెవి

సుదూర నుంచి వస్తున్న తియ్యని దేవత స్తుతి మంత్రాన్ని ఏదో అలకయిస్తుందో నని –

పైన ఆకాశంలో పహరా కాస్తున్న చుక్కలు మాత్రమే నిశితంగా గమణిస్తున్నాయి,

హుష్! ఈ స్తుతి మంత్రం చీకటి రేయి పవనపు చిరు స్వర సవ్వడి యని-

ఆహా! నేను మరులు గొన్న ఈ రా త్రి అంత స్నిగ్దంగా ఉంది ఆ స్వరం ..

V

ఈ నీశీధి దుఖం మోసుకొచ్చే సంవేదనా ఆత్మ జ్వాలనానికి ప్రమిద

ఒకప్పటి హృదయపు ప్రియ బావన లు చుట్టూ ముసిరి మెలిపెట్టిన దుఖపు చింతనా వీచికలు. ..

నేడవి, ఈ క్షణాన, కళ తప్పిన వెలిసి పోయిన ఆ దౌర్భాగ్య సీమకు దూరంగా

తమ బంగారు రెక్కలతో ఎగురుతున్నాయి నా బహిరంతర లోకాలన్నిటిపైనను;

వేన వేల కళ్ళల్లో నిరాశకు నకళ్ళు లాంటి దుఖాశృవుల్ని తట్టి లేపుతుంది ఈ రాత్రీ;

వ్యర్థమే ఈ కన్నీళ్లు , ఎందుకంటే గతించి పోయిన ఘటనల జ్ఞాపకానికి

( తన వైన ఉత్కృ ష్ట అనుభవాలు వన్నె తగ్గటం విషాడమే అయినా గానీ)

ఇంకా అతుక్కునే ఉంటుంది వెర్రి గుండె,

చంద్రుడు దిగి పోయా డు , వెంటేకు పోతున్నాయి మనం ప్రేమించిన వన్నీ;

నిశీధి పవనాలు రోదిస్తున్నాయి; మరుల గొన్నవన్ని మసక బారుతుంటే, మనమూ వాటి కోసం అట్లే విలపిస్తాము..

గ్రహస్థితులు కుంగదీస్తుంటే అదృశ్య శక్తులు

చితాభస్మ కలశంపై రాలుతున్న శోకిత కన్నీటి బిందువుల్ని పరిశుద్దం చేస్తాయి.

ఆనందాభుదిలో నిండా తెలియాడుతున్న తలపులు కొన్ని, దుఖసాగరంలో నిండా మునిగి పోతున్నవి కొన్ని ,

నా తలపులు మాత్రం కన్నీటి లోనే పరిసమాప్తమవుతున్నాయి- కన్నీటికి స్వాగతం -అవి దారలై ప్రవహించనీ .

VI

కారే కన్నీటి బిందువుల్లారా, ఎదను బద్దలు కొట్టే నిట్టూర్పుల్లారా,

గుండె నుండి రక్తం కట్టలు తెంచుకుని పారెంతగా

దుఖ దేవత విషపు బాణం మారణ గాయాల్ని చేస్తుంటే...

ఆహా ! మీరేలా నన్నీగాయం నుండి విముక్తి చేయుట లేదు ?

అబ్బబ్బా ! అలా కాదు , కానే కాకూడదు !... ఉదృత మౌతున్నాయి కన్నీళ్లు,

రొప్పుతూనే ఉన్నాయి నిట్టూర్పులు, నేలలోకి ఇంకుతూనే ఉంది రక్తం;

అయిననూ ఊరట లేదు :.. మేం చుట్టూ పరికిస్తూనే ఉంటాం ,

వాళ్ళలో ఒకరి మైన మాలాగే , మాలో ఒకరైన వాళ్ళ కోసం ,..

ఉంగరాలలో పొదిగిన రత్నాల్లా , మేం గుండె లోతుల్లో

గాఢంగా పొదివి కొన్న వాళ్ళ కోసం, నిష్పల నిరీక్షణ గావిస్తూనే ఉంటాము ,

వాళ్ళి ప్పుడెక్కడ? వెళ్ళి పోయారు ఆ ‘ఇరుకు చెర’ దిశగా

లోన కటిక చీకటి , ఇప్పుడే కాదు ఇక ముందు ఏ దీపమూ , ఏ దివ్వే తరిమి కొట్టలేనంతటిదా చీకటి ..

కన్ను గాంచని కారు చీకట్ల ఇరుకు చెరలో గుట్టును ఇప్పి చెప్పేందుకు చిరాత్మనూ దిగి రాలేదు---

వారిదైన ఉజ్వల ఉదయం పొద్దు పొడవాలి, వారు చైతన్య దీప్తులై మేల్కోనేది అప్పుడే, ఆ ఉషస్సు లోనే ..

అది ఎంత అద్భుతం !


Tags:    

Similar News