తెలుగు ‘అమ్మ మాట’ కోసం చిన్న కూతయినా కుయ్యరా?
2 వేల చరిత్ర ఉన్న తెలుగు మీద 200 సంవత్సరాల చరిత్ర కూడా లేని హిందీ పెత్తనమేమిటి?;
నేను కొంతమంది మిత్రులు వరంగల్ నుండి పాలంపేట లో ఉన్న రామప్ప గుడి ని చూద్దాం అని విశాఖ నుంచి వరంగల్ చేరుకున్నాం. అక్కడి నుంచి కారులో బయలుదేరాం. గతంలో చాలాసార్లు, ముఖ్యంగా ఫ్రొఫెసర్ జయశంకర్ గారు వైస్ ఛాన్సలర్ గా ఉన్నపుడు వెళ్ళ . అక్కడ మా మిత్రులు చాలామంది హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటికల్ సైన్స్ డిపార్ట్ మెంట్ ల లో వుండే వారు . అయితే, నేను ఎప్పుడూ వరంగల్ పట్టణం దాటి వెళ్ళలేదు. తెలంగాణలో కరీంనగర్ తదితర ప్రాంతాలు వెళ్ళ. రామప్ప గుడిని సందర్శించే అవకాశం రాలేదు.
ఈ సారి పనిగట్టుకుని రామప్పగుడి కోసం వెళ్తూ ఉండటం నాకే ఆశ్యర్యంగా ఉంది.
తెలంగాణ వెళుతున్న దారిలో ఉన్న చెరువులు పొలాలు చుట్టూ ఉన్న గుట్టలు లాంటి కొండలు మా ఊరు పాతపట్నం గుర్తుకు తెచ్చింది. వాతావరణం నిజంగా ఆహ్లాదకరం గా ఉంది. ఉదయం 10 గ చేరుకున్నాం.
ఇదే పేగు బంధమూ, కనుమల బంధమో తెలియదుగానీ ఆ ప్రాంతం మా ఉత్తరాంధ్ర తూర్పు కనుమలకు దగ్గర అని మరికొంత దూరం వెళితే ఛత్తీస్గఢ్ వస్తుంది.
అవును నిజమేగద కాకతీయుల కాలంలో, తరువాత కళింగ గజపతులు తూర్పు కనుమలు ఏలిన నంద వంశం , నల వంశం ఇక్కడి వారే గద.
రామప్పగుడిలో ప్రొఫెసర్ కెఎస్ చలం
వీరిని జర్మన్ చరిత్ర కారులు జంగిల్ కింగ్స్ అని గ్రంథాలు ప్రచురించారు. వారంతా ఆదివాసి మూలాలు ఉన్న మన బహు జనమే గదాఅని సంబర పడ్డ. మరి వీళ్ళంతా త్రికలింగులు అంటే తెలుగుజాతి వీరులు . వీరికి గుర్తింపు లేకుండా దేవ్, వర్మ, రాజు, స్వామి అని పేర్లుపెట్టి వంశావళిని తయారుచేసి తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆటాడించే క్రూరులు , ద్రోహులు రక రకాల కథలు అల్లి మనలను ఇప్పటికీ అణగ దక్కుతున్నారు కొంతమంది కుటిల జ్ఞానులు. తెలుగు వారిని విడదీసి కొత్త మాట ‘ఆంధ్ర’ చేర్చి ‘తెలుగు జాతి’ అనేది లేకుండా చేశారు గదా అని తల్లడిల్లాను.
ఏమయితే నేమీ మా జాతి జనులు ఆవాసాలు చూస్తూ ముందుకు వెళ్ల. మిత్రులు కొన్ని విషయాలు వివరించారు.
మేడారం దరిదాపులకు వెళుతుంటే మా ‘అమ్మ’ దగ్గరకు వెళుతున్న సంబరం. మా వంశం లో మగాళ్లకు పెద్ద గుర్తింపు వుండదు. ఇక మగ దేవుల్లెక్క డ? అదంతా మధ్యధరా సముద్ర ప్రాంత అబ్రహాం , ఇబ్రహీం , బ్రహ్మ నుండి అఫ్గాన్ తాలిబన్ల తంతు. మాకు ‘అమ్మే’ ముఖ్యం.
జ్ఞానులు మా మాతృస్వామికం అనాగరికం అన్నారు. అనని. నష్టం లేదుగా . మా ‘అమ్మ’లు శాoత స్వరూపులు. చెయ్యి పైకెత్తి దీవిస్తారు. భయపెట్టరు. కత్తులు, త్రిశూలాలు, గదులు ఉండవు . మా భాషలో ఎప్పుడూ కావలసి వస్తే అప్పుడు మాతో మాట్లాడతారు. నిత్యం మాతోనే ఉంటారు. మా అమ్మలకు పోటీగా సప్త, అష్ట మాతృకలు వైదిక దేవుళ్ళ భార్యలు, త్రిమూర్తులు యముడు వగైరాలను తయారు చేసి వదిలాడు . వాళ్ళు ఏప్రాంతాలు తిరిగారో ఆ ప్రాంతాలన్నీ పీఠాలు ఏర్పాటు చేశారు. శక్తి అన్నారు. వారి చేతిలో కత్తుల తో మమ్మల్ని భయపెడితే మా అమ్మె మమ్మల్ని కాపాడారు అని మా నమ్మకం. ఎవరి నమ్మకం వారిది . కాదన్నమా? మాకంటే గొప్ప లౌకిక వాదు లుంటారా?
ఇదంతా మేడారం వెళుతుండగా కలిగిన భావోద్వేగం. మా ఉద్దేశం ఇప్పుడు జాతర లేనప్పుడు మేడారం వెళ్ళటం కాదు. ఇప్పుడు అక్కడ ఏం వుండదు. దోపిడీ దండుకోవడం వుండదు . కావాలనుకున్న రోజున అమ్మలు వస్తారు, వెళతారు. దానికి తంతు ఎందుకు . ఇంతకీ వారెవరు . మ న తెలుగు తల్లులు గదా. ఎప్పటివారు? వారికి యీ రామప్ప గుడికి సంబంధం . రామప్ప గుడి రేచర్ల రుద్రదేవుడు కట్టించాడు. రేచర్ల వంశం వారు ఎక్కువగా దళిత బహుజనులలో ఉన్నారు . ఆయన ఈగుడిని కట్టమని రామప్పకు అప్పగిస్తే అద్భుతమైన సాంకేతికతతో కట్టించారని చరిత్ర కారులు చెబుతారు. వారికి సామాజిక శాస్త్ర దృక్పథం వుంటే యీ విషయాలు చెబుతారు అవి అడ్డు అనుకున్నప్పుడు వేరేల వుంటుంది కథనం.
మిత్రుడు తెలంగాణ చరిత్ర కారుడు అడపా సత్యనారాయణ నేను లాంగ్ డ్యూర్ (longue durée) అనే పద్ధతి వాడాను అంటాడు . అవును నిజమే కొంత మంది రాజకీయ ఆర్ధిక శాస్త్ వేత్తలు మార్క్ , గ్రామ్సీ పద్ధతులను లాటిన్ దేశాలకు అప్లై చేసి వాడిన పరిశోధనలకు కొత్త వెలుగు తెచ్చింది. అది నేను అసంకల్పితంగా వాడి ములాలు వెతుకుతున్న.
ఇంత కి సందర్భం ఏమిటంటే సమ్మక్క సారలమ్మల వంశం కోయి లేక కుయి అంటారు . మా తెలుగు అక్కడిదే . అందుకే అప్పటి రుద్ర దేవుడు మరి తెలుగు వాడేనా అని చూడటానికి పోయా. ఆశ్చర్యం, రామప్ప గుడిలో అద్భుతమైన చక్కటి గుండ్రని అక్షరాలతో వేసిన తెలుగు శాసనం కనిపించింది . ఎంత గొప్ప చరిత్ర తెలుగుది. యీ శాసనం 800 సంవత్సరాల నాటిది . అంతకుమునుపు ఎన్నివoదల బహుశా వేల సంవత్సరాల నాటిదో గదా తెలుగు భాష. బ్రిటిష్ వాడు తెచ్చి ప్రచారం చేసిన 200 సంవత్సరాలు దాటని చరిత్ర ఉన్న హిందీకి భయపడుతున్నారు మన ప్రజలు, పాలకులు, ప్రజాస్వామ్య పెద్దలు?
మన సోదరులు మహారాష్ట్ర వారే నయం గద. హిందీ ని దాని మూలాలకు పరిమితం చేస్తున్నారు. ఎప్పుడైనా మంటతో అమ్మ మాట కోసం చిన్న కూతయినా కుయ్యరా?
అమ్మ మాట కోసం చిన్న కూతయినా కుయ్యరా