అతుల్ సుభాష్ కేసు: మాజీ భార్య నికితా సింఘానియాకు బెయిల్

అత్త, బావమరిదికి సైతం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన బెంగళూర్ సిటీ సివిల్ కోర్టు;

Update: 2025-01-05 06:27 GMT

దేశంలో సంచలనం సృష్టించిన బెంగళూర్ టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య కేసులో బెంగళూర్ సిటీ సివిల్ కోర్టు అతని మాజీ భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానికియా, తమ్ముడు అనురాగ్ సింఘానియా కు శనివారం బెయిల్ మంజూరు చేసింది.

గత ఏడాది డిసెంబర్ 9న టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య వారి తరపు బంధువులని 24 పేజీల సూసైడ్ లేఖ, గంట నిడివి గల వీడియో ను అప్లోడ్ చేయడంతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఈ కేసు ఆకర్షించింది.
తనను భార్య న్యాయస్థానం సాక్షిగా వేధించారని, మాటలతో జడ్జి ముందే దుర్భాషలాడిన ఎవరూ పట్టించుకోలేదని అతుల్ తన సూసైడ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో తన మామ చనిపోతే వరకట్న వేధింపులతో చనిపోయినట్లు తనపై కేసు పెట్టారని, తన కొడుకును చూడనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ వేధింపులు భరింపలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు న్యాయం జరగకపోతే తన ఆస్థికలను కోర్టు ముందు ఉన్న మురికి కాల్వల్లో కలపాలని తన సూసైడ్ లెటర్ లో పేర్కొన్నారు. దీనితో అపెక్స్ కోర్టు సెక్షన్ 498 ఏ కేసుల్లో కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయాల్సి వచ్చింది. 
ప్రస్తుతం బెంగళూర్ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది. తన మనవడిని తిరిగి తనకు అప్పగించాలని సుభాష్ తల్లి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసు విషయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో వాదించడంతో ప్రస్తుతం వారికి బెయిల్ లభించింది. 


Tags:    

Similar News