ఎల్‌కే అద్వాణికి భారత రత్న

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత లాల్‌ క్రిష్ణ అడ్వాణికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను భారత రత్నతో సత్కరించనుంది.

Update: 2024-02-03 08:05 GMT

రాజకీయ కురువృద్ధుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత లాల్‌ క్రిష్ణ అడ్వాణికి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నతో సత్కరించింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా వెల్లడిరచారు. దేశాభివృద్ధిలో అడ్వాణి పాత్ర కీలకమని కొనియాడారు.



 

అయన నుంచి చాలా నేర్చుకున్నా.. మోదీ

‘‘అడ్వాణిజీని భారతరత్న పురస్కారంతో గౌరవించనున్నాం. ఆయనతో ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపా. ఈ తరం రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. క్షేత్రస్థాయి నుంచి జీవితాన్ని ప్రారంభించి.. ఉప ప్రధానిగా దేశానికి సేవ చేశారు. పార్లమెంటర్‌లో ఆయన అనుభవం అందరికీ ఆదర్శప్రాయం. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. జాతి ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించే దిశగా అసమాన కృషి చేశారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం రావడం, ఆయన నుంచి నేర్చుకోవడం నా అదృష్టంగా భావిస్తా’’ అని ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు.


అడ్వాణీ గురించి..

1927 నవంబర్‌ 8న పాకిస్థాన్‌లోని కరాచీలో సంపన్న వ్యాపారవేత్త కిషన్‌ చంద్‌ అద్వానీ, జియాని దేవి దంపతులకు అడ్వాణీ జన్మించారు.

భారతదేశ రాజకీయల్లో ‘‘లోహ పురుషుడు’’ గా ప్రసిద్ధి గాంచిన లాల్‌ కృష్ణ ఆడ్వాణీ 15 సం.ల వయస్సులోనే ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో ప్రవేశించారు. దేశ విభజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలల్లో చురుకైన పాత్ర పోషించారు. భారతీయ జనసంఫ్‌ు పార్టీలో చేరి అతి తక్కువ కాలంలోనే ముఖ్య పదవులు చేపట్టారు. 1967లో ఢల్లీి మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1977లో మురార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో మంత్రిపదవి లభించింది. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. అటల్‌ బిహారి వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించాడు. 2009 ఎన్నికలకు ముందే భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా బరిలో నిలిచారు.

మలుపు తిప్పిన ఘటన అయోధ్య రథయాత్ర..

అద్వానీ జీవితంలో దేశ రాజకీయాలను మలుపు తిప్పిన ఘటన అయోధ్య రథయాత్ర. సోమనాథ దేవాలయం నుంచి అయోధ్యకు రథయాత్ర చేసి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి ప్రజల మద్దతు పొందడమే ఆశయంగా పండిత్‌ దీనదయాళ్‌ ఉపాధ్యాయ జయంతి రోజున (1990, సెప్టెంబర్‌ 25) ప్రారంభించిన అయోధ్య రథయాత్ర బీహార్‌ సరిహద్దులో అప్పటి బీహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అద్వాణి రథయాత్రకు పగ్గాలు వేయడంతో ఆగిపోయింది. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్‌ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. కాని రథయాత్ర ఆగిపోయింది. అప్పటికే అద్వానీ విశేష ప్రజాదరణ ఉన్న నేతగా ఎదిగారు. ఆ తర్వాత విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. 1991 లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ స్థానాల సంఖ్యను 120కు పెంచిన ఘనత అద్వాణిదే. 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో జరిగిన కరసేవ సంఘటనలో అద్వాణి అరెస్ట్‌ అయ్యారు.

Tags:    

Similar News