కుర్రాళ్లు దూకుడుగా ఆడాలి: సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్

ఈ ఐపీఎల్ ఎడిషనల్ దూకుడుగా ఆడి ప్రారంభ లాభాలను పొందాలని అనుకుంటున్నామని ఎస్ఆర్ హెచ్ కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నారు.

Update: 2024-03-21 10:48 GMT
సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్

సన్ రైజర్స్ ఆటగాళ్లు ఇక నుంచి దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నాని, దాని వల్ల ప్రారంభలాభాలను పొందవచ్చని కొత్త కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడుతున్నారు. రేపు ఐపీఎల్ సీజన్ ప్రారంభ కానుంది.

గత ఏడాది ఆటగాళ్ల వేలంలో కమిన్స్‌ను సన్‌రైజర్స్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. తరువాత దక్షిణాఫ్రికా ఓపెనర్ మార్ర్కమ్ స్థానంలో కెప్టెన్ గా పగ్గాలు అప్పగించింది.
"కొంచెం ప్రణాళిక వేసుకుని, ఆపై మంచి ఆరంభాన్ని పొందాలనుకుంటున్నాను. T20లు చాలా కష్టం. కోల్‌కతా మంచి జట్టు, కానీ నేను ఈ సీజన్‌లో నిజంగా దూకుడుతో కూడిన ఆరంభాన్ని చూడాలనుకుంటున్నాను" అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ ద్వారా తెలిపారు. టోర్నమెంట్ సమయంలో గరిష్ట ఫలితాలను పొందడానికి ఆటగాళ్లు మరియు కోచింగ్ సిబ్బందితో కలిసి పని చేయాలని పేసర్ చెప్పాడు.
మార్చి 23న ఈడెన్ గార్డెన్స్‌లో హైదరాబాద్ తన తొలి మ్యాచ్ లో కోల్ కతను ఢీ కొడుతుంది. ఇదీ కమిన్స్ మాజీ జట్టు. ఇంతకుముందు సీజన్ వరకూ కమిన్స్ దీనికే ప్రాతినిధ్యం వహించాడు. 

గత సంవత్సరం WTC, యాషెస్, ప్రపంచ కప్ విజయాలకు ఆస్ట్రేలియాకు అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఇప్పుడు సన్ రైజర్స్ జట్టుకూడా ఇదే విజయాలను కోరుకుంటోంది. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన జట్టును నడిపించడానికి సంతోషంగా ఎదురు చూస్తున్నాని కమిన్స్ అంటున్నారు.
"మనకు గొప్ప జట్టు ఉందని నేను భావిస్తున్నాను. భువీ (భువనేశ్వర్ కుమార్) వంటి అనుభవజ్ఞులైన వాళ్లతో పాటు కుర్రాళ్లు కూడా ఉన్నారు. అభిషేక్ (శర్మ), ఉమ్రాన్ మాలిక్ వంటి కుర్రాళ్లతో ఆడడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను. కాబట్టి, రాబోయే సీజన్‌లో అభిమానుల అంచనాలు అందుకుంటామనే అనుకుంటున్నాం" అని కమిన్స్ అన్నారు.
Tags:    

Similar News