ఇం‌డియాలోనూ టూరిజం స్పాట్లు ఉన్నాయి: క్రికెటర్‌ ‌ధోణి

పర్యాటక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ముందు ఇండియా నుంచి మొదలుపెడతా. గతంలో ధోణి అన్న మాటలు ఇప్పడు ఎందుకు వైరలయ్యాయి.

Update: 2024-01-08 12:00 GMT

ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటన నేపథ్యంలో అక్కడి మంత్రులు ఆయన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఆ వ్యాఖ్యలకు నిరసగా భారతీయులు మాల్దీవుల పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ దేశంలో ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ముగ్గురు మంత్రులను(మాల్షా షరీఫ్‌, ‌మరియం, అబ్దుల్లా మజిద్‌) ‌మంత్రివర్గం నుంచి తొలగించారు మాల్దీవుల దేశాధ్యక్షుడు మహ్మద్‌ ‌రెయిజు. ఈ వార్తను ధృవీకరిస్తూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

ఇండియన్‌ ‌సెలబ్రీటిస్‌ ‌కూడా ..

మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై ఇండియన్‌ ‌సెలబ్రీటీస్‌ ‌కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాను అవమానించిన మాల్దీవులకు వెళ్లడం మాని, ఇండియన్‌ ‌టూరిజాన్ని ప్రోత్సహిద్దామని సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ ‌నటుడు సల్మాన్‌ ‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, ‌మాస్టర్‌ ‌బ్లాస్టర్‌ ‌సచిన్‌ ‌టెండూల్కర్‌ ‌ప్రముఖులు మన దేశంలో ఉన్న ఎన్నో పర్యాటక ప్రాంతాలను చూడాలని కోరుతున్నారు.

వైరల్‌ అవుతోన్న థోణి వీడియో..

‘‘నేను ఎక్కువగా ప్రయాణాలు చేస్తాను. క్రికెట్‌ ఆడే సమయంలో ఆ దేశాలకు వెళ్తాను. ఆట అయిపోగానే తిరిగి ఇండియా వచ్చేస్తాను. నా భార్యకు ప్రయాణం అంటే ఇష్టం. టైం దొరికితే కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాము. అది కూడా ఇండియా నుంచే మొదలుపెడతాం. ఇక్కడ మనకు చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని ముందు చూశాకే మిగతా వాటి గురించి ఆలోచిస్తా’’ అని అన్నారు.

Tags:    

Similar News