‘ పాపం ఆయన ఈ వారంలో 67 గంటలే పని చేస్తాడు’
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిపై సామాజిక మాధ్యమంలో జోకులు..
By : The Federal
Update: 2024-12-11 10:01 GMT
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య సుధామూర్తి బెంగళూర్ లోని ఖరీదైన కింగ్ ఫిషర్ అపార్ట్ మెంట్లలో రూ. 50 కోట్లతో ఫ్లాట్ కొనడంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలుతున్నాయి.
ఇంతకుముందు ఇదే అపార్ట్ మెంట్ లో నాలుగు సంవత్సరాల క్రితం నారాయణ మూర్తి రూ. 29 కోట్లకు ఓ ఫ్టాట్ తీసుకున్నారు. ఈ అపార్ట్ మెంట్ కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పూర్వీకులది. 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్థలాన్ని డెవలప్ చేశారు. ఇందులో బయెకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, కర్ణాటక మంత్రివర్గంలోని ఓ మంత్రి కుమారుడు, పలువురు బిజినెస్ ప్రముఖులు ఫ్లాట్లు కొన్నారు.
‘‘ బెంగళూర్ నగరంలో ఇళ్ల రేట్లను పెంచడంలో మీరు ముందున్నారు’’ అని ఓ యూజర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. మరో నెట్ వినియోగదారుడు సరదాగా.. ‘‘ ఆయన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి మూడు గంటలు సమయం వృథా చేశాడు. కాబట్టి ఆయన వారంలో కేవలం 67 గంటలే పని చేయబోతున్నాడు’’ అన్నారు. ఇంతకుముందు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ప్రతిరోజు పది గంటలు పని చేయాలని తన కంపెనీలోని ఉద్యోగులకు పిలుపునిచ్చాడు. అది గుర్తు పెట్టుకుని ఆ యూజర్ ఇలా స్పందించారు.
‘‘ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు పది గంటలు పని చేయాలని సూచించారు. ఇలా చేస్తే నారాయణ మూర్తి మనవడు ఇదే అపార్ట్ మెంట్ లో మరో ఫ్లాట్ కొనుగోలు చేస్తాడు’’ అని మరో వినియోగదారుడు అన్నారు.
‘‘ నారాయణ మూర్తి బెంగళూర్ లోని కింగ్ ఫిషర్ లోని టవర్స్ లో రూ. 50 కోట్లతో లగ్జరీ అపార్ట్ మెంట్ కొన్న వ్యక్తి ఆయన సరళత, కారుణ్య , పెట్టుబడిదారీ విధానాన్ని ప్రబోధిస్తూ, ప్రజలు వారానికి 70 గంటలు పని చేయాలని చెబుతున్నారు’’ అని మరో వినియోగదారుడు కామెంట్ చేశారు.