ఎన్నికల గురించి ఆలోచించలేదు... ఒక తరం గురించి ఆలోచించా...

ప్రజల భవిష్యత్‌ కోసమే ఎన్నికల పొత్తు విశాఖపట్నం సభలో జనసేన నేత పవన్‌ కళ్యాణ్‌

Byline :  The Federal
Update: 2023-12-07 14:54 GMT
PAVAN KALYAN JANASENA PARTY PRESIDENT

2008 నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఓటులేని పిల్లలు ఎక్కువగా మీ వెంట తిరుగుతారంటారు అంటున్నారు. రాబోయే తరంకోసం పనిచేస్తా. ఓట్ల కోసం రాలేదు. మార్పు కోసం వచ్చాను. అధికారం కోసం ఓట్లు అడగను. మార్పు కోసం ఓట్లు అడుగుతానని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. విశాఖపట్నంలో గురువారం రాత్రి జరిగిన జనసేన సభలో ఆయన మాట్లాడారు. ప్రసంగ పూర్తి పాఠం ఆయన మాటల్లోనే..

ఉత్తరాంధ్ర నాకు చాలా ప్రియమైన ప్రాంతం. వంగపండు, నేను 2014లో కలిసి ఎన్నికల ప్రచారం చేశాము. గద్దరు, వంగపండు ప్రజలకు చేరువైన వ్యక్తులు. అందరినీ అభివృద్ధి చేసే నేల ఇది. ఉత్తరాంధ్ర వాళ్లు వలసలు వెళుతున్నారు. నేను ఓట్లకోసమైతే ఇంత కష్టపడాల్సిన పనిలేదు. మత్స్యకారుల బోట్లు కాలిపోతే నా నిధుల నుంచి డబ్బులు ఇచ్చా. తక్కువే కావొచ్చు. ఈ సమాజంలో కష్టమొస్తే నిలబడే మనుసులు ఉన్నారని జనసేన పార్టీ చెబుతుంది. పదవి కోసం పాకులాడలేదు. నా ఆలోచనల్లా భావితరాల భవిష్యత్‌ కోసమే. మీ ప్రేమాభిమానాలతో పార్టీని నడుపుతున్నాను.
నటనలో ఓనమాలు దిద్దించిన విశాఖ
నటనలో ఓనమాలు నేర్పింది ఉత్తరాంధ్ర. మీ రుణం తీర్చుకునేందుకే పార్టీ పెట్టా. పొగడ్తలకు ఉప్పొంగుతారేమో కానీ, ప్రతి దెబ్బకూ నేను ఉప్పొంగి పోతాను. విశాఖలో యాక్టింగ్‌ క్లాసులు తీసుకునే వాడిని. మాట్లాడాలంటే భయం ఉండేది. యాక్టింగ్‌ ఆ భయాన్ని పోగొట్టింది. మా అన్న చిరంజీవి అందుకు అంకురార్పణ.
వలసలు ఆగాలి
ఉత్తరాంధ్ర యువత వలసలు ఆగాలి. తెలంగాణలో 1,200 మంది యువకులు తెలంగాణ కోసం బలిదానం చేశారు. ఆంధ్రలో జీవనోపాధి కోసం పక్కరాష్ట్రాలకు వెళుతున్నారు. ఉత్తరాధ్రలో ఇంతమంది ఎందుకు వలసలు పోతున్నారు. బేగంపేట ఎయిర్‌ పోర్టులో ముగ్గురు సెల్ఫీ దిగటానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే శ్రీకాకుళం అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఎవరికోసం పనిచేస్తున్నారు. ఏమి చేస్తున్నారు.
ప్రజల భవిష్యత్‌ కోసమే టీడీపీతో పొత్తు
వంద రోజుల్లో ఏపీలో ఎన్నికలు. పవన్‌ కళ్యాణ్‌ ప్రజల భవిష్యత్‌ను ఆలోచించి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. చక్కటి మ్యానిపెస్టో ఇస్తాం. వనరులు చూసుకోవాలి.
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించింది నేనే
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ తరలింపును ఎదిరించింది పవన్‌ కళ్యాణ్‌. అమిషాతో స్పష్టంగా చెప్పాను. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను తరలించ వద్దని, అందుకు ఆయన అంగీకరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం విశాఖపట్నంలో మొదలైంది. కేంద్ర పెద్దలకు ఒకటే చెప్పాను. కులాలు వేరు కావొచ్చుకానీ ఉద్యమంలో అందరూ ఒక్కటై సాధిస్తారు. జై ఆంధ్ర అంటే అంత ఉద్వేగం ఉంటుంది. అమిత్‌షా నా మాటను గౌరవించి ప్రైవేటీకరణవైపు పోలేదు.
బీజేపీలో జాయిన్‌ అయితే కోరుకున్న పదవి ఇస్తారు
నేను బీజేపీలో జాయిన్‌ అయితే కోరుకున్న పదవి ఇస్తారు. దశాబ్ధం దాటిన తరువాత కూడా రాజధానికి దారేది. అత్తారింటికి దారేదంటే మూడు గంటల్లో కథ చెప్పొచ్చు. కేంద్రం వాళ్లు రాజధాని అమరావతి అని చెబుతున్నారు. ఉత్తరాంధ్ర దోపిడీకి గురవుతుంటే ఇక్కడి వారు ఏమి చేస్తున్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యను ఎందుకు పట్టించుకోలేదని నన్ను విమర్శించే వారిని అడుగుతున్నాను.
ఆడపిల్లలకు భద్రత కావాలి
బయటకు వెళితే నిర్భయంగా ఇంటికి రావాలి. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని చెబుతుంటే నన్ను ఎగతాలి చేశారు. హోం మంత్రి అమిత్‌షా, ప్రధాన మంత్రి వంటి వారు చెబితేనే నేను చెప్పాను. ఫోలీసులు తీసుకోని కేసుల గురించి నేను మాట్లాడుతున్నా. నేను జనవాణి కార్యక్రమం చేస్తుంటే నా బిడ్డ కనిపించడంలేదని తల్లి కంప్లైంట్‌ ఇస్తే వారంలో ఆ బాలిక ఎక్కడ ఉందో గుర్తించాము.
పోలీసులను ప్రభుత్వ గూండాలుగా వాడవద్దు
పోలీసులను ప్రభుత్వ గూండాలుగా వాడకూడదు. పోలీసు శాఖకు పునర్‌వైభవం జనసేన ద్వారా కల్పిస్తాం. పోలీస్‌ శాఖను సమర్థవంతంగా పనిచేయించడం లేదు. జనసేన, తెలుగుదేశం ప్రభుత్వంలో బలమైన పోలీసు వ్యవస్థను తయారు చేస్తాం. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసులను పెడతాం.
నా సినిమాను ఆపుచేయించే దానికోసం..
నా సినిమాను ఆపు చేయించే దానికోసం చీఫ్‌ సెక్రటరీ నుంచి ఎమ్మార్వోల దాకా కాపలాలు పెట్టించాడు. జగన్‌ ఇటువంటి చిల్లర పనులు చేస్తుంటే ఏమి చేస్తాం.

Delete Edit

ఒక దశాబ్ధం పాటు దెబ్బలు తింటూ వచ్చాను. జనసేన తెలుగుదేశం పార్టీలను గెలిపించండి. మళ్లీ వైసీపీ వైపు చూచారా మీ భవిష్యత్‌ను మీరే పాడు చేసుకుంటారు. పంపించేద్దామా వైసీపీని, బాయ్‌బాయ్‌ చెబుదామా. ఐదేళ్లు ఇసుక తిన్నారు. మైనింగ్‌ చేసుకున్నారు. కాంట్రాక్ట్‌లు చేసుకున్నారు. అందుకు పంపించాలి.
విశాఖ రాజధాని అని అబద్దాలు
మూడున్నర సంవత్సరాలుగా విశాఖ రాజధాని అని అబద్దాలు చెబుతున్నారు. మిలీనియం టవర్స్‌లో 50 శాతం ఖాళీగా ఉన్నాయి. మిలీనియం టవర్స్‌ను ఇప్పుడు ఆక్రమించింది. పరిపాలనా రాజధాని అంట, ఎవరు కోరుకున్నారు. అబివృద్ధి ఎక్కడో చెప్పండి. విశాఖ బ్యూటిఫికేషన్‌ కోసం రూ. 400 కోట్లు కేంద్రం నుంచి నిధులు తెచ్చారు. ఎక్కడ ఖర్చుపెట్టారు. ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదు. మార్పుకోసం మేము చేస్తున్న ప్రయత్నాన్ని ఆశీర్వదించండి.
జాబ్‌ చార్ట్‌ ఏమైంది?
వైసీపీ నాయకులు జాబ్‌ చార్ట్‌ ఇచ్చారు. ఇప్పుడు జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నేను దశాబ్ధకాలంగా ఓడిపోయి నిల్చున్నాను. సమాజం త్యాగాలతో నిర్మితమైంది. రాజకీయాలు పొల్యూట్‌ అయ్యాయని యువత రాజకీయాలవైపు రావడం లేదు. రాజకీయాల్లో యువత పాత్ర ఉండాలి. సినిమాల్లోనే ఉంటే నేను ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను 25ఏళ్ల భవిష్యత్‌ మీకు ఇవ్వాలని రాజకీయాల్లోకి వచ్చా. ఉత్తరాంధ్రలోనే ఉపాధి అవకాశాలు ఉండేలా మనస్పూర్తిగా పనిచేస్తా.
ఓటమి భయాన్ని తెప్పిస్తుంది
ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్లిపోయాడు. ఓడిపోతే భయమేస్తది. ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అయితే భయం వేస్తుంది. 150 మంది సభ్యులతో మొదలైన జనసేన ఆరు లక్షల మందికి చేరుకుంది. అబ్రహాం లింకన్‌ అన్నింటిలోనూ ఓడి అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అయ్యాడు. నిలబడి చూపించటమే నాలక్ష్యం.
ఉత్తరాంధ్ర బీసీలను తెలంగాణలో బీసీలుగా గుర్తించడం లేదు
ఉత్తరాంధ్రకు సంబంధించిన 29 బీసీ కులాలను తెలంగాణలో బీసీలుగా గుర్తించడం లేదు. కేసీఆర్‌ను ఎందుకు ఒక్కసారికూడా వైసీపీ వాళ్లు ప్రశ్నించలేదు. కనీసం ఒక్క అప్పీలు కూడా చెయ్యలేకపోయారు. ఈ సమస్యపై నేను మాట్లాడాను. నావంతు ప్రయత్నం చేస్తున్నాను. అధికారంలో లేని నేను పోరాడుతుంటే ప్రభుత్వం ఎందుకు అడగటం లేదు. దేనినైనా రాజకీయం చేయడానికే తప్ప సమస్యను పరిష్కరిద్దామనే మనసు లేదు. నేను మీకు మాటిస్తున్నా నేను స్టీలు ప్లాంట్‌ కోసం సంపూర్ణమైన సాయం చేస్తా.
వైసీపీ ప్రభుత్వంలో దాడులు పెరిగాయి
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 40 శాతం దాడులు పెరిగాయి. 30వేల మంది ఆడపిల్లలు అదృష్యానికి గురయ్యారు. వీరు వచ్చారా? ఎలా తిరిగి వచ్చారని ఒక ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పండి.
ఎవరికైనా కష్టం వస్తే పవన్‌ కళ్యాణ్‌ గుర్తొస్తారు. గాజువాకలో ఓడిపోయా, ఓటములు ఎదుర్కొంటూ పెరిగాను. మంగళగిరి పార్టీ ఆఫీసులో భవన నిర్మాణ కార్మికులు వచ్చి వైజాగ్‌లో సభ పెట్టమన్నారు. నేను నమ్మలేదు. ఓడిపోయిన వాడి సభకు వస్తారా అనుకున్నా? సభ పెడితే జనం వస్తారా అని మా వాళ్లను అడిగాను. వస్తారన్నారు, కానీ వారి మాటల్లో విశ్వాసం కనిపించలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను నిర్ణయించుకున్న దారిలో నేను నడుస్తా.
విశాఖ ఎయిర్‌పోర్టులో దిగగానే ఇంకా జనం రాలేదు అన్నారు. నాకు ఐదువందల మంది ఉంటే చాలన్నాను. ఓడిన తరువాత సభ పెడితే రెండు లక్షల మంది జనం వచ్చారు. నాకు కన్నీరు రావు. ఆరోజు నా కళ్లు చమర్చినవి. ప్రేమకు లొంగని వారు ఎవరుంటారు. మీ ప్రేమకు దాసుడినయ్యాను.
2014లో డీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చానంటే..
2014లో టీడీపీ, బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చానంటే.. పార్టీని నిలబెట్టుకోలేని తనం వచ్చిందని ఆలోచించా. అయినా పార్టీని ఏ పార్టీలోనూ కలపను. కష్టాల్లో ఉన్న వారికి భుజం కాయాలని బలమైన నిర్ణయం తీసుకున్నాను. కేవలం పోరాటం చేసే వ్యక్తిగా ఉండటం ఇష్టం లేదు. పోరాటం తాలూకు అంతిమ లక్ష్యం అభివృద్ది ఉండాలి. నా బలాన్ని ఆరోజున టీడీపీకి, బీజేపీకి అండగా ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుద్దనుకున్నా. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌కు బంగారు బాట వేయాలి. మనం లిచిన స్థానాల్లో బలమైన మెజారిటీ ఇచ్చి, టీడీపీని గెలిపిస్తే అప్పుడు మనం అధికారంలోకి వస్తాము. మీరు సభల్లో సత్తా ఇవ్వగలిగితే అడుగులు ముందుకు వేస్తాం. వైసీపీ వారికి 32 మంది ఎంపీలు ఉన్నారు. నాకు ఒక్క ఎంపీ ఉన్నా నేను పోరాటం చేసే వాడిని.
సీఎం పదవి అనేది నేను చంద్రబాబు నిర్ణయించుకుంటాం..
సీఎం అనేది నేను చంద్రబాబు కలిసి నిర్ణయించుకుంటాం. అందరితో చర్చించి నిర్ణయం. మీకు అన్నీ చెప్పే చేస్తాను. 2019లో పొత్తు పెట్టుకోలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వెనక నడవడం లేదు. తెలుగుదేశంతో కలిసి నడుస్తున్నాం. మీ ఆత్మగౌరవానికి ఎటువంటి ఇబ్బది రానివ్వను. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నా. నిరుద్యోగులకు వయసు దాటితే ఏమి చేస్తారు. అందుకే నేను నన్ను తగ్గించుకొని మిమ్మల్ని గెలిపిస్తా.
సినిమా పాట పాడుతూ రావోయి మా రాష్ట్రానికి తినడానికి బ్రౌన్‌ షుగర్‌ ఉంది. గంజాయి, సారాయి ఉంది. దీంతో వేల కోట్లు ప్రభుత్వ పెద్దలకు వచ్చాయి.
రాజకీయాల్లో అవినీతి లేదని చెప్పలేము. వ్యవస్థల్లో ఉన్న వాళ్లు అవినీతి చెయ్యలేరని చెప్పలేము.
పంచాయతీలు నిర్వీర్యం
వేల పంచాయతీలు ఉన్నాయి. 15 ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్స్‌ను కేంద్రం ఆపేసింది. మూడేళ్లలో రూ. 3,359 కోట్లు కేంద్రం నిలిపేసింది. ఎందుకు నిలిపిందంటే పంచాయతీలకు నిధులు రాష్ట్రం ఇవ్వలేదు. గ్రామ సచివాలయాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రభుత్వం నిధులు ఆపింది.
సముద్రంపై దాటి తెప్ప తగలేశాడు..
మీ ఓటు అనే బోటు మీద సముద్రం దాటాడు. దాటగానే తెప్ప తగలేశాడు. జగన్‌ డబ్బులు ఇస్తే తీసుకోండి. నేను కాదనను. నేనైతే తీసుకోను. ఆ చాయిస్‌ మీది. డబ్బులు తీసుకొని మొహమోటం వద్దు నేను నిలబడిన చోట వంద కోట్లైనా పెడతడు. ఎంతడబ్బు ఇచ్చినా జగన్‌ సొంత డబ్బు ఇవ్వడం లేదు. కల్తీ సారా అమ్మి సంపాదించిన డబ్బు. జగన్‌ డబ్బులు ఇచ్చాడు కదా ఓటేయాలి అనుకోకూడదు. ఈ సారి మార్పుకు ఓటేయండి. జనసేన ప్రభుత్వంలో బాధ్యత, అధికారం తీసుకుంటాము. అన్ని స్థాయిల్లో అధికారంలో ఉంటాము. మార్పు, సుస్థిరత, బలమైన అభివృద్ధి కోసం ఓటు వేయండి. ఇంటికెళ్లి అన్నీ బేరీజు వేసుకుని జనసేన. తెలుగుదేశానికి ఓటేయండి. నేను బేసిగ్గా సోషలిస్ట్‌ను. సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదు. కొనసాగిస్తాం.
ఉత్తరాంధ్రను వైసీపీ విముక్తి ప్రాంతంగా ప్రకటిద్దాం.
సుందరపు వెంటక సతీష్‌ కుమార్‌ను నేను మొదట రాజకీయాల్లోకి రమ్మని అడిగాను నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్‌ లేదన్నారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఆదరిద్దాం. అంటూ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నారు.
దారిలో ఒకరు మూడేళ్లు చూపించారు.. అంటే మూడు నెలలేనని..
దారిలో వస్తుంటే ఒక యువకుడు బైక్‌పై వెలుతూ మూడేళ్లు చూపించాడు. నేను వంద రోజులు అనుకుంటున్నా. మూడు నెలలేనన్నా అని చూపించాడు.
వారాహి యాత్ర మళ్లీ మొదలు పెడతా
వారాహి యాత్రం మళ్లీ మొదలు పెడతా. ఎప్పుడనేది తర్వాత చెబుతా. తెలుగుదేశంతో పొరపొచ్చాలు లేకుండా ఉండాలి. టీడీపీ జనసేన అలయన్స్‌ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వారు వైసీపీకి అమ్ముపోయినట్లేనని చెప్పా. ఎన్నికల కమిషనే రూ. 40 లక్షలు ఖర్చు పెట్టుకోవచ్చని చెబుతున్నది. జీరో బడ్జెట్‌ అంటే కుదరదు. నాచుట్టూ తిరిగి జేజేలు కొడితే ఆనందించను. ఎన్నిల్లో నిలబడ్డ వారిని గెలిపించండి అప్పుడు ఆనందిద్దాం.
సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విదానాన్ని తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. మీ కష్టాలు వినడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ సంపూర్ణంగా అమలు చేస్తాం.

Delete Edit

Tags:    

Similar News