మేరు పర్వతం... దివికేగింది చిరంజీవి
రామోజీ రావుకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
ఈనాడు అధినేత రామోజీ రావు మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు.
ఈ తెల్లవారు జామున నాలుగున్నర కు రామోజీరావు ఆసుపత్రిలో మరణించారు.
రామోజీరావు ‘ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ..
దివి కేగింది,అని ఆయన ట్వీట్టర్ (ఎక్స్ )లో వ్యాఖ్యానించారు.
అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయయించింది.
కెసిఆర్ సంతాపం
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత. మాజీ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సంతాపం ప్రకటించారు.
పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు.
శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి మృతి తీరని లోటు. సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం నేడు అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు గారు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు గారు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం. రామోజీరావు గారి కుటుంబానికి, రామోజీ సంస్థల ఉద్యోగులకు నా ప్రగాఢ సంతాపం.
కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి
ఈనాడు గ్రూప్స్ రామోజీరావు గారి మృతిపట్ల మాజీ మంత్రి,సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి గారు సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు అని పేర్కొన్నారు.అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీ రావు గర్వకారణంగా నిలిచారని గుర్తు చేశారు
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ఈనాడు సంస్థల అధినేత , మీడియా లెజెండ్ రామోజీ రావు గారి మరణం పట్ల తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సామాన్య వ్యక్తి స్థాయి నుండి విలువలతో కూడిన జర్నలిస్ట్ గా అంచెలు అంచెలుగా ఎదిగి ,లక్షలాది మందికి ఉపాధిని కల్పించే స్థాయికి ఎదిగిన ఆయన జీవితం చాలా ఆదర్శనియమని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రామోజీరావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని , వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నట్లు సుఖేందర్ రెడ్డి తెలిపారు.