లోక్ సభ: తుది ఫలితాలు ప్రకటించిన ఈసీ.. ఎవరెన్ని సీట్లు..

సార్వత్రిక ఎన్నికల 2024 తుది ఫలితాలను బుధవారం ఉదయాన్నికల్లా ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ 240 సీట్లతో దేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించగా, 99 స్థానాలతో..

Update: 2024-06-05 05:26 GMT

సార్వత్రిక ఎన్నికల 2024 ఫలితాలు బుధవారం ఉదయంలో అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఎన్నికల సంఘం అన్ని స్థానాల ఫలితాలను వెల్లడించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దేశంలోని మొత్తం 543 స్థానాలకు గాను 240 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా, కాంగ్రెస్‌ 99 స్థానాలను కైవసం చేసుకుని రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) 294 సీట్లు గెలుచుకోగా, ప్రతిపక్ష ఇండి కూటమికి 231 సీట్లు వచ్చాయి.
ఎన్నికల సంఘం తన చివరి ఫలితాన్ని మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గానిది వెల్లడించింది. ఇక్కడ ఎన్సీపీ చీలిక(శరద్ పవార్ వర్గం) కు చెందిన అభ్యర్థి బజరంగ్ మోహార్ సోన్వానే, బీజేపీకి చెందిన పంకజా ముండేపై 6, 553 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
లోక్‌సభలో 543 మంది సభ్యులు ఉండగా, బీజేపీ సూరత్ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత 542 స్థానాలకు కౌంటింగ్ నిర్వహించారు. ఎన్డీఏ తన పరిపాలనకు దీనిని రెఫరెండంగా  భావించింది. అయితే ఉత్తరాదిలో తనకు పట్టున్న మూడు రాష్ట్రాల్లో బీజేపీ గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే భారీగా సీట్లు నష్టపోయింది. అయినప్పటికీ మిగిలిన రాష్ట్రాలలో సత్తాచాటి మెజారిటీ మార్క్ ను చేరుకుంది.
మోదీ పేరు మీద పోటీ చేసిన అభ్యర్థులు 240 స్థానాల్లో గెలుపొందారు, 272 మెజారిటీ మార్కుకు 30 సీట్ల దూరంలో ఆగిపోయారు. 2019 తో పోల్చుకుంటే 60కి పైగా సీట్లలో కోతపడింది. ఎన్డీఏ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలుచుకుంటే దాని మిత్రపక్షాల మద్ధతు అవసరం.
ఆంధ్రప్రదేశ్‌లో 16, బీహార్‌లో వరుసగా 12 స్థానాలు గెలుచుకున్న కీలక మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీ (టిడిపి), జేడీయూ ఇతర కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో ఎన్‌డిఎ మెజారిటీ మార్కును దాటింది.
ప్రతిపక్ష ఇండి కూటమిలో భాగమైన కాంగ్రెస్, 2019లో గెలిచిన 52 సీట్లతో పోలిస్తే మరో 47కి పైగా సీట్లను తన ఖాతాలో అదనంగా చేర్చుకుంది. దాంతో కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా 99 సీట్లు గెలుచుకుంది, రాజస్థాన్ హర్యానాలో BJP సీట్లను కాంగ్రెస్ తన ఖాతాకి బదిలీ చేసుకుంది. రాహూల్ గాంధీ వయనాడ్, రాయ్ బరేలీలో రెండు చోట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలతో ఇండి కూటమి నైతిక స్థైర్యాన్ని పెంచగా, ప్రతిపక్ష కూటమిలోని మరో కీలక సభ్యుడైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పశ్చిమ బెంగాల్‌లో 29 సీట్లు గెలుచుకుంది. 2019లో టీఎంసీ 22 సీట్లకు గెలుచుకుంది.  బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ నుంచి 18 సీట్లను పొందగా, తాజాగా జరిగిన ఎన్నికల్లో 12 సీట్లకే పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ ఘన విజయం సాధిస్తాయని అంచనా వేసినప్పటికీ అవేవీ నిజం కాలేదు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో నిర్వహించిన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో 64 కోట్ల ఓట్లు ఓట్లు లెక్కించబడ్డాయి.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024: పార్టీల వారీగా సీట్లు
భారతీయ జనతా పార్టీ (బిజెపి) - 240
కాంగ్రెస్ - 99
సమాజ్ వాదీ పార్టీ (SP) - 37
తృణమూల్ కాంగ్రెస్ (TMC) - 29
ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) – 22
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) – 16
జనతాదళ్ (యునైటెడ్) (జెడియు) - 12
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) (SHSUBT) – 9
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - శరద్చంద్ర పవార్ (NCPSP) - 8
శివసేన (SHS) - 7
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJPRV) – 5
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) – 4
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) – 4
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) CPI(M) – 4
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) - 3
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) - 3
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) - 3
జనసేన పార్టీ (JnP) - 2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) – CPI(ML)(L) – 2
జనతాదళ్ (సెక్యులర్) JD(S) – 2
విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) – 2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) - 2
రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) - 2
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) - 2
యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ (UPPL) – 1
అసోం గణ పరిషత్ (AGP) - 1
హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) (HAMS) – 1
కేరళ కాంగ్రెస్ (KEC) - 1
రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP) - 1
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) - 1
వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీ (VOTPP) - 1
జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) – 1
శిరోమణి అకాలీదళ్ (SAD) – 1
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ (RLTP) – 1
భారత్ ఆదివాసీ పార్టీ (BHRTADVSIP) – 1
సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) – 1
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) – 1
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) – ASPKR – 1
అప్నా దళ్ (సోనీలాల్) – ADAL – 1
AJSU పార్టీ (AJSUP) - 1
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) - 1
స్వతంత్రులు - 7
మొత్తం - 543 సీట్లు


Tags:    

Similar News