ఈ నెలలో భారీగా తరలిపోయిన విదేశీపెట్టుబడులు

యూఎస్ లో మార్కెట్ ఆశాజనకంతో పతనమైన నిఫ్టీ, సెన్సెక్స్;

Update: 2025-01-13 06:33 GMT

అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం, విదేశీ నిధుల ప్రవాహం తగ్గిన కారణంగా సోమవారం ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్ లు నష్టపోయాయి. ప్రారంభంలోనే బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ , నిఫ్టీలు సూచీలు నష్టపోయాయి.

బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ కు  81 డాలర్లకు పెరగడం, అలాగే అమెరికాలో ఉద్యోగాల డేటా కూడా ఆశాజనకంగా రావడంతో ఇక్కడి పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఆరంభ ట్రేడింగ్ లోనే బీఎస్ఈ సెన్సెక్స్ 843. 67 పాయింట్లు నష్టపోయి 76,535.24 పాయింట్లకు చేరుకుంది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 258.8 పాయింట్లు క్షీణించి 23,172.70 వద్దకు చేరుకుంది. ట్రేడింగ్ లో ఏషియన్ పెయింట్, జోమాటో, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ నష్ట పోగా,  ఇండస్ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ, హిందూస్థాన్ యూనీలీవర్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియాలోని సియోల్, షాంఘై, హంకాంగ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి.
విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహారణ
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 2,254.68 కోట్ల మేర తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ నెలల మొత్తంగా చూసుకుంటే ఎఫ్ఐఐలు 22,194 కోట్ల రూపాయలను మళ్లించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా తెలియజేస్తోంది.
యూఎస్ లో ఉద్యోగాల సంఖ్య పెరగడం ఆ దేశానికి ఎలాంటి ఉద్దీపన ప్యాకేజ్ అవసరం లేకుండా నిరుద్యోగం 4.1 శాతానికి తగ్గడంతో ఇన్వెస్టర్లు అమెరికా వైపు మొగ్గారు. ఇక్కడ దాదాపుగా 1.65 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని అమెరికా నిర్ణయించగా, ఆ సంఖ్య 2.56 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 81 డాలర్లకు పెరగడం భారత్ కు ఆందోళన కలిగిస్తోంది. అయితే నవంబర్ లో 5.2 శాతంగా ఉన్న ఐఐపీ గణాంకాలు ప్రస్తుతం తగ్గుతుండటం ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి కోలుకుంటున్నట్లు సూచిస్తున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజిస్ట్ వికే విజయ్ కుమార్ చెప్పారు. గత శుక్రవారం విడుదల చేసిన ఐఐపీ గణాంకాల ప్రకారం భారత పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఆరు నెలల గరిష్ట స్థాయికి అంటే 5.2 శాతానికి చేరుకుంది.
Tags:    

Similar News