147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదిన హైదరాబాదీ బ్యాట్స్ మన్
హైదరాబాద్ బ్యాట్స్ మన్ చరిత్ర సృష్టించాడు. కేవలం 147 బంతుల్లో 31 ఫోర్లు, 20 సిక్స్ లు బాదీ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇంతకీ ఎవరా బ్యాట్స్ మన్?
హైదరాబాద్ బ్యాట్స్ మన్ తన్మయ్ అగర్వాల్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా ఖ్యాతికెక్కాడు. కేవలం 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్ తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రంజీట్రోఫి ప్లేట్ గ్రూప్ మ్యాచ్ లో అతను ఈ ఘనత సాధించాడు. ఈ లెప్ట్ హ్యండ్ బ్యాట్స్ మన్ ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకూ 31 ఫోర్లు, 20 సిక్స్ లు బాదడం విశేషం.
ఒక రంజీ ట్రోఫిలో అత్యధిక సిక్స్ లు బాదిన ఆటగాడిగా కూడా తన్మయ్ అగర్వాల్ రికార్డ్ సృష్టించాడు. తన్మయ్ ధాటికి హైదరాబాద్ జట్టు కేవలం 47.3 ఓవర్లలో 528/2 సాధించింది. ఈ వార్త ప్రచురించే సమయానికి తన్మయ్ ఇంకా క్రీజులోనే( 160 బంతుల్లో 323 పరుగులతో) ఉన్నాడు.
వేగవంతమైన ట్రిపుల్ సెంచరీనే కాకుండా.. 119 బంతుల్లోనే 200 పరుగులు సాధించి ఫస్ట్ క్లాస్ చరిత్రలోనే వేగంగా డబుల్ సెంచరీ మార్క్ కు చేరుకున్న ఆటగాడిగా కూడా రికార్డ్ క్రియేట్ చేశాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఆరాధించే తన్మయ్.. బ్యాటింగ్ లో కూడా అదే స్థాయిలో ప్రతిభను చాటాడు. కాగా ఈ మ్యాచ్ లో అరుణాచల్ ప్రదేశ్ 172 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ మార్కో మెరైస్ పేరు మీద వేగవంతంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్ మన్ గా రికార్డు ఉండేది. మెరైస్ 191 బంతుల్లో 300 సాధించగా ప్రస్తుతం తన్మయ్ ధాటికి అది కాలగర్భంలో కలిసిపోయింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన క్రికెటర్లు
తన్మయ్ అగర్వాల్ 147 బంతుల్లో- హైదరాబాద్ vs అరుణాచల్ ప్రదేశ్ 2024
మార్కో మెరైస్ 191 బంతుల్లో - బోర్డర్ vs ఈస్టర్ ప్రావిన్స్ 2017
చార్లెస్ మకార్ట్నీ 221 బంతుల్లో - ఆస్ట్రేలియన్స్ vs నాటింగ్ హమ్ షైర్ 1921
ఫ్రాంక్ వూలీ, 230 బంతుల్లో - ఎంసీసీ vs టాస్మానియా 1912
కెన్ రూథర్ ఫోర్డ్ 234 బంతుల్లో- న్యూజిలాండ్ పీపుల్స్ vs డీబీ క్లోజ్ 11, 1986
వివి రిచర్డ్స్ 244 బంతులు- సోమర్ సెట్ vsవార్విక్షైర్ 1985
కుశాల్ పెరీరా 244 బంతులు- కోల్ట్స్ vs సారాసెన్స్ 2012-13
కిత్తురువాన్ వితనాగే 245 బంతులు- తమిళ యూసీ vs ఎస్ ఎల్ ఎయిర్ ఫోర్స్ ఎస్సీ 2014-౧౫
Read the story in English by clicking the link below
Tanmay Agarwal smashes fastest 300 in first-class history during Ranji Trophy game