నష్టాల్లో ట్రేడవుతున్న భారత స్టాక్ మార్కెట్లు
ట్రంప్ టారిఫ్ మోతతో షేక్ అవుతున్న ఆసియా స్టాక్ మార్కెట్లు;
By : The Federal
Update: 2025-04-03 07:44 GMT
ఈ రోజు ప్రారంభంలో సెన్సెక్స్, నిఫ్టీ రెండు భారీగా క్షీణించాయి. అమెరికాలో ట్రంప్ టారిఫ్ ల మోత మోగించడంతో ఆసియా మార్కెట్లతో సహ ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి.
డొనాల్డ్ ట్రంప్ పరిపాలన దేశ వాణిజ్య లోటును తగ్గించి, దేశ తయారీని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నందున విదేశాలపై టారిఫ్ ల యుద్ధం ప్రారంభించారు.
దీనిలో భాగంగా భారత్ పై కూడా 27 శాతంగా సుంకాలు విధించారు. న్యూఢిల్లీ ఇంతకుముందు అమెరికా వస్తువులపై కూడా అధిక శాతం సుంకాలు విధించేదని వాషింగ్టన్ ఆరోపించింది.
ప్రస్తుతం టారిఫ్ ల విధానం వల్ల అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అయితే పెరిగిన టారిఫ్ లను ఎదుర్కొంటున్న మిగిలిన దేశాల కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉందని నిపుణులు అంటున్నారు.
ఈ ప్రభావం ట్రేడింగ్ లో 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 378.6 పాయింట్లు లేదా 0.49 శాతం తగ్గి 76,238.84 వద్ద ముగిసింది. ఈ సెషన్ లో ఇది 809. 89 పాయింట్లు లేదా 1.05 శాతం తగ్గి 75,807.55 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయికి చేరుకుంది. నిప్టీ 80.60 పాయింట్లు క్షీణించి, 23,251. 75 కి చేరుకుంది.
ట్రేడింగ్ లో సెన్సెక్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్పోసిస్, టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, టాటా మెటార్స్, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, జోమాటో కోటక్ మహీంద్రా బ్యాంక్ లు ప్రధానంగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
సన్ ఫార్మాస్యూటికల్స్, ఎన్డీపీసీ, టైటాన్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆసియన్ పెయింట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ మాత్రం లాభాల్లో ముగిశాయి.
ఆసియా మార్కెట్లో, టోక్యో నిక్కి మూడు శాతానికి పైగా పడిపోయింది. హాంకాంగ్ 2 శాతం, సియోల్ కోస్పి శాతం, షాంఘై 0.39 శాతం పడిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించిన దానికంటే కఠినమైన సుంకాలను ప్రకటించిన తరువాత ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ అన్నారు.
అయితే అమెరికా మార్కెట్లు మాత్రం బుధవారం ఒప్పందాలతో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 2.31 శాతం తగ్గి బ్యారెల్ కు 73.22 డాలర్లకు చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్ లో ఎఫ్ఐఐ రూ. 1538 కోట్ల ఈక్విటీలను ఆప్ లోడ్ చేయగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు 2,808 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడం ద్వారా ఎఫ్ఐఐల కంటే ఎక్కువగా ఉన్నారు.