కర్ణాటకలో వరి సాగు అసాధ్యమా?

కర్ణాటకలో వరి సాగు ఎందుకంత కష్టంగా మారింది. చిరుధాన్యాలవైపు రైతులు ఎందుకు చూస్తున్నారు.

Update: 2023-12-31 12:08 GMT

తీవ్ర నీటి ఎద్దడి, రుతుపవనాలు సకాలంలో రాకపోవడం, ఎండిపోయిన కావేరి, వేసవి కారణంగా మలవల్లి, మద్దూర్‌ ‌లాంటి కొన్ని తాలూకాలు, పట్టణాలు కరువుతో అల్లాడిపోతున్నాయి. చాలా మంది రైతులు వరి సాగును వదులుకోవలసి వచ్చింది. దీంతో మండ్య జిల్లాలోని రైతుల్లో నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి.‘‘మా జీవితంలో ఇలాంటి కరువు ఎన్నడూ చూడలేదు’’ ఇక్కడ కొందరు రైతులు పేర్కొన్నారు. తీవ్ర నీటి ఎద్దడి కారణంగా చాలా మంది రైతులు తక్కువ నీటితో పండే రాగులు, మినుములు, సరుగుడు వంటి పంటల సాగుకు మళ్లారు.

సయ్యద్‌ ‌ఘనీ ఖాన్‌..



ఇతను రైస్‌ ‌డైవర్సిటీ సెంటర్‌ను నడుపుతున్నారు. ‘రైస్‌ ‌క్యూరేటర్‌’ ‌గా పిలువబడే ఇతని వద్ద వరికి సంబంధించి 1,300 రకాలు ఉన్నాయి. మాండ్య జిల్లాలోని మలవల్లి తాలూకా సమీపంలోని కిరుగవలులో సయ్యద్‌ ‌ఘని ఖాన్‌ ‌తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సయ్యద్‌ ‌ఘని ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి గత కొన్ని దశాబ్దాలుగా సేకరించిన అనేక వరి రకాలను పెంచి సంరక్షిస్తున్నాడు. ఈ కేంద్రం భారతదేశం, జపాన్‌, ‌మలేషియా లాంటి ఇతర దేశాలలో పరిశోధకులు, క్యూరేటర్లు, శాస్త్రవేత్తలు రైతులను ఘని కేంద్రం ఆకర్షిస్తుంది.

సయ్యద్‌ ‌ఘనీ ఓ రైతు. వరి, మామిడి, మినుములు, అపరాలు, పండ్లు, చిక్కుళ్లు, ఇంకా ఎన్నో రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఘని కుటుంబం 150 ఏళ్లుగా వరి పండిస్తోంది.

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తొలిసారి తనకున్న 15 ఎకరాల్లో వరి సాగు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ పరిస్థితి కేవలం నదీ పరీవాహక ప్రాంతాలల్లోనే కాదు. కర్ణాటకలోని మిగిలిన ప్రాంతాల్లో

90 శాతం కరువు మండలాలే..

రాష్ట్రంలోని 236 తాలూకాల్లో 223 కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ఇందులో తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలు 196. ఇటీవల న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాష్ట్రంలో కరువు సహాయక చర్యలను చేపట్టేందుకు రూ. 18,177.44 కోట్లను కేంద్ర సాయంగా కోరారు.

ఇలాంటి కరువు నేను ఇంతకుముందు చూడలేదు..

‘‘నా జీవితంలో మొదటి సారి నేను వరి నాట్లు వేయకూడదని నిర్ణయించుకున్నాను.’’ అని ఘని ఫెడరల్‌తో చెప్పారు. ‘‘జూలై మాసం వర్షం లేకుండా గడిచిపోయింది. సెప్టెంబర్‌లో వరి కోయాలని అనుకున్నాను. అది కూడా జరగలేదు. ఇలాంటి కరువులను ఇంతకు ముందు చూశామని కొందరు అంటున్నారు. అయితే, నాకు ఇది మొదటిది. ఏ పంట వేయకుండానే వదిలేద్దామనిపించింది.

సయ్యద్‌ ‌ఘని తన తాలూకా మలవల్లిలో చాలా మంది రైతులు ఈ సంవత్సరం వరి సాగు చేయలేకపోయారని చెప్పారు. ‘‘సకాలంలో వర్షాలు కురవడం లేదు. పంట దిగుబడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించాలో తెలియడం లేదు. కొందరు కొందరు వరి నుంచి చిరుధాన్యాలకు రాగి, మినుములు పంటలకు మారారు.’’ నేను కూడా ఇప్పుడు మినుములు పండించాలనుకుంటున్నాడు.

‘‘జిల్లాలోని మలవల్లి, మద్దూరులో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఇతర చోట్ల వరి రైతులు మంచి దిగుబడి సాధించారు. ఈ ఏడాది వరి ధర కూడా పెరిగింది.’’ అని మాండ్య జాయింట్‌ ‌డైరెక్టర్‌ అ‌గ్రికల్చర్‌ అశోక్‌ ‌ది ఫెడరల్‌తో అన్నారు.

‘‘రాష్ట్రంలో కరువు నెలకొంది. ఖరీఫ్‌, ‌రబీ పంటలు రెండూ దెబ్బతిన్నాయి. ‘‘మాండ్యాకు సంబంధించినంతవరకు వరికి నీరు లేదు. జిల్లాలో మరో ప్రధాన పంట చెరకు. ఈ పంటకు కనీసం 30 శాతం మంది రైతులు పూర్తిగా కావేరి నీటిపైనే ఆధారపడుతున్నారు.’’

దిక్కుతోచని స్థితిలో రైతులు..

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలీక రైతులు ఒత్తికి లోనవుతున్నారు. రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన జిల్లాల్లో ఒకటైన మాండ్యలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News