ఐస్‌క్రీమ్‌లో వేలు..ఎవరిదో తేలిపోయిందా?

ఐస్‌క్రీమ్‌ ఏమిటీ..వేలేమిటి..అనుకుంటున్నారా? ఇటీవల ఓ కస్టమర్ చాలా కూల్‌గా ఐస్‌క్రీమ్ లాగిస్తుండగా..అందులో మనిషి వేలు కనిపించింది. పోలీసుల విచారణలో తేలిందేమిటి?

Update: 2024-06-19 09:08 GMT

కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఓ కస్టమర్‌ ఐస్‌క్రీమ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. తింటుండగా అందులో మనిషి వేలు కనిపించడంతో షాక్ అయ్యాడు. వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వేలిని ముందు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి కేసు విచారణ మొదలుపెట్టారు.

తెగిన వేలు పూనేలోని ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగిదని అంచనాకు వచ్చారు. ఐస్‌క్రీమ్స్‌లను తయారు చేసే యూనిట్‌లో ఓ కార్మికుడి వేలికి గాయమైందని, ఆ వేలు అతనిదే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కార్మికుడి డీఎన్‌ఏ నమూనాను తెగిన వేలి డీఎన్‌ఏ‌తో సరిపోల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

ఈ ఘటన తర్వాత సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఐస్‌క్రీం తయారీదారుడి లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసింది. యాజమాన్యం కూడా తమ ఉత్పత్తిని నిలిపేశామని పేర్కొంది. ఇప్పటికే తయారు చేసి నిల్వ ఉంచిన ఐస్‌క్రీమ్‌లను మార్కెట్‌లోకి వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News