రాష్ట్రాల్లో పర్యటించనున్న ఈసీ

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. లోక్‌సభ ఎన్నికలే తరువాయి. ఏర్పాట్లపై ఈసీ పర్యటించే రాష్ట్రాలేవి? ఏ తేదీల్లో పర్యటిస్తున్నారు?

Update: 2024-01-05 08:40 GMT

త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల నేఫధ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో వచ్చేవారం పర్యటించనుంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కమిషన్, ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన టీం జనవరి 7 నుంచి 10 వతేదీ మధ్య ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పర్యటిస్తుంది.

ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు దాదాపు అన్ని రాష్ట్రాలను సందర్శించారు. వీరు తమ నివేదికను జనవరి 6న ఎన్నికల కమిషన్ సభ్యుల ముందుంచనున్నారు.

అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ సభ్యులు రాజకీయ పార్టీలు, సీనియర్ పోలీసు అధికారులు, పరిపాలనా అధికారులను కలవడం సాధారణం. అయితే, ఈసీ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పర్యటిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలను టీం సభ్యులు పర్యటించకపోవచ్చని సమాచారం.

2019లో లోక్‌సభ ఎన్నికల తేదీని మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఓట్లను లెక్కించారు. 

Tags:    

Similar News