మమతా బెనర్జీకి గాయం, ఆసుపత్రిలో చికిత్స
ఆమెకు నుదుటి రక్తం కారేంత గాయం కావడం గురించి ఇంకా స్పష్టత లేదు. కాళీ ఘాట్ నివాసం కిందపడ్డారని ఒక కథనం.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె నుదుటిపై బలమైన గాయం తలగడంతో తీవ్రంగా రక్తస్త్రవం అయింది. పార్టీ ట్విట్టర్ విడుదల చేసిన ఫోటోలలో ఆమె నుదుటి మీద గాటు చాల స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గాయనుంచి రక్తం కారుతున్నది. ఆమె ఎస్ ఎస్ కో ఆసుపత్రికి చికిత్సకోసం తరలించారు. ఆమె తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేయాలని పార్టీ ట్వీట్ చేసింది.
Our chairperson @MamataOfficial sustained a major injury. Please keep her in your prayers 🙏🏻 pic.twitter.com/gqLqWm1HwE
— All India Trinamool Congress (@AITCofficial) March 14, 2024
ఈ రోజు ఆమె ఒక అధికార కార్యక్రమానికి కూడా వెళ్లి వచ్చారు. అక్కడి నుంచి వచ్చాక కాళిఘాట్ నివాసంలోనే కిందపడ్డట్టు, దాని వల్ల నుదిటి మధ్యలో గాయం అయినట్లు కుటుంబ వర్గాలు చెప్పాయి.
ఈరోడ్డు ప్రమాదంలో ఆమె గాయపడినట్లు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చేసిన ట్వీట్ వల్ల అర్థమవుతుంది. దీదీ గాయపడటం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Shocked and deeply concerned about the road accident involving Hon'ble Chief Minister of West Bengal @MamataOfficial didi.
— M.K.Stalin (@mkstalin) March 14, 2024
My thoughts are with her during this difficult time, and I'm wishing her a speedy recovery. #MamataBanerjee https://t.co/OKx0eOfgcH