ఆపరేషన్ సింధూర్: తరువాత ఏం జరగబోతోంది?
‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్ శ్రీనివాసన్ విశ్లేషణ;
By : Nisha P Sekar
Update: 2025-05-07 03:43 GMT
పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ పై అర్థరాత్రి క్షిపణులతో దాడి చేసింది. దీనికి ‘ఆపరేషన్ సింధూర్’ అని కోడ్ నేమ్ పెట్టారు. దాడులు జరిగినట్లు పాకిస్తాన్ ధృవీకరించింది. ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించింది.
రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలపై ‘ఫెడరల్’ ఎడిటర్ ఎస్ శ్రీనివాసన్ విశ్లేషించారు. జర్నలిస్ట్ నిషా పి. శేఖర్ సంధించిన పలు ప్రశ్నలకు ఎడిటర్ విశ్లేషత్మక సమాధానాలు ఇచ్చారు.
భారత్ దాడులకు పాక్ స్పందించింది. తాను ఎంచుకున్న సమయంలో, ప్రదేశంలో దాడులు ఉంటాయంది, ప్రతీకారం గురించి భారతీయులు ఆందోళన చెందాలా?
ఎస్. శ్రీనివాసన్: పాకిస్తాన్ నుంచి వచ్చిన సాధారణ ప్రతిస్పందన అది. ఏదైన ఉద్రిక్తత తరువాత ప్రతి దేశం ఇలాంటివి చెబుతూ ఉంటాయి. పాకిస్తాన్ లోని తొమ్మిది లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించినట్లు భారత్ పేర్కొంది.
అందువల్ల పాకిస్తాన్ అలంకారప్రాయంగా నైనా స్పందించాలి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే వారు ఎలాంటి ప్రతిచర్య తీసుకుంటారు. భారత్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది.
ఈ ఆపరేషన్ కు ముందే దేశవ్యాప్తంగా పౌర రక్షణ విన్యాసాలు జరగడం, సరిహద్దులో వైమానిక దళం విన్యాసాలు జరగడాన్ని మనం చూశాము. కాబట్టి స్పష్టంగా ప్రతీకారం తీర్చుకుంటారని అంచనాలు ఉన్నాయి.
ఈ పరిస్థితి 2019 కంటే ప్రమాదకరం. అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ ప్రభుత్వం సయోధ్య వైపే మొగ్గు చూపింది. ఇప్పుడు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ప్రస్తుత అధికార కేంద్రమైన అసిమ్ మునీర్, ఎన్ఎస్ఏ ఆసిమ్ మాలిక్ ను పహల్గామ్ దాడులకు సూత్రధారులని భావిస్తోంది.
ఇది సాధారణ ఉగ్రవాద సంఘటన కాదు. ఉద్దేశపూర్వకంగా జరిగిన దారుణమైన ఘటనని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టే భారత్ వ్యూహాత్మంగా దాడులకు దిగింది.
పహల్గామ్ ఘటన ఒక పెద్ద వ్యూహంలో భాగమని మీరు నమ్ముతున్నారా?
ఇది కేవలం యాధృచ్చికంగా జరిగిన ఉగ్రవాద ఘటన కాదు. 25 మంది భారతీయులు, నేపాలీ పర్యాటకుడు, ఒక పోనివాలతో సహ మొత్తం 26 మంది భారతీయులు మరణించారు. దాడి చేసిన విధానం, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం, తరువాత మాట్లాడిన మాటలు వీటిని ధృవీకరిస్తున్నాయి.
‘ది ఫెడరల్’ తో మాట్లాడిన భారత రక్షణ రంగ నిఫుణులు అనేకమంది వీటిని స్పష్టంగా వివరించారు. ఇది దాడిని మతతత్వంగా మార్చడానికి, రాజకీయంగా నష్టం చేకూర్చడానికి చేసిన ప్రయత్నం. భారత్ కచ్చితంగా స్పందించేలా చేయడమే దాడి లక్ష్యం.
భారత ప్రభుత్వం కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు ముట్టుకోలేదని చెబుతోంది. ఇది దౌత్యపరంగా ఏదయిన తేడా చూపిస్తుందా?
తేడా చూపిస్తుందనే చెప్పాలి. భారత ప్రభుత్వం సైనిక స్థావరాలపై దాడి చేయలేదని చెబుతోంది. అది నిజమైతే ఇది పరిమితమైన లక్ష్యాలపై చేసిన దాడి అని భారత్ వాదించవచ్చు.
కానీ ప్రతిదీ కూడా వాస్తవంగా జరిగిన నష్టం, మరో వైపు పౌర మరణాలపై ఆధారపడి ఉంటుంది. దాడి జరిగిన కొన్ని ప్రాంతాలలో 12 మంది మరణించినట్లు కొన్ని నివేదికలు బయటకు వస్తున్నాయి.
అవి నిజమని తేలితే పాకిస్తాన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇందువల్ల పాకిస్తాన్ వ్యూహాత్మక కారణాల కోసం కాకుండా, సొంత ప్రజలను సంతృప్తి పరిచేందుకు చర్య తీసుకోవాల్సి ఉంటుంది.
2019 బాలాకోట్ దాడికంటే ఈసారి పాల్పడిన దాడుల్లో ఎలా భిన్నమైవని, ప్రభావవంతమైనవి?
ఇది బాలాకోట్ లాంటి వైమానిక దాడి కాదు. ఈసారి భారత్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇది సమీకరణాన్ని పూర్తిగా మార్చింది. ఇది చాలా గట్టి సమాధానం, ప్రమాదకరమైన చర్య. సరిహద్దు ఉగ్రవాదానికి భారత్ స్పందించే విధానంలో ఇది వ్యూహత్మక మార్పు. అయితే ఉగ్రవాదులకు ఎంత నష్టం జరిగిందనేది రక్షణ శాఖ నిర్వహించే మీడియా సమావేశం తరువాతే స్పష్టమవుతుంది.
అంతర్జాతీయంగా ఎలాంటి ప్రతిచర్య వస్తుందని మీరు ఊహిస్తున్నారు?
ఇప్పటి వరకూ అంతర్జాతీయ సమాజం పహల్గామ్ ఉగ్రవాద దాడిని ఖండించింది. ఎవరూ ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వరు. కాబట్టి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచం ప్రతిస్పందన రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఒకటి పాకిస్తాన్ లో సంభవించిన పౌరుల మరణాలు. రెండోది దాడిని యుద్ధ చర్యగా కాకుండా ఉగ్రవాద నిరోధకచర్యగా చెప్పడం.
ప్రపంచం ఇప్పటికే గాజా, ఉక్రెయిన్ సమస్యలతో సతమతం అవుతోంది. ఇప్పుడు మరోసారి రెండు అణుశక్తుల మధ్య యుద్ధం అంటే ప్రపంచం సమ్మతించకపోవచ్చు. కాబట్టి అమెరికాతో పాటు ఈయూ దేశాల నుంచి బలమైన పిలుపులు ఉంటాయని చెప్పవచ్చు.
ఈ దాడులు భారత్ ఇమేజ్ ను అంతర్జాతీయ వేదికలపై ప్రభావితం చేస్తుందా?
భారత్ లక్ష్యాలు ఉగ్రవాద శిబిరాలు మాత్రమే స్పష్టంగా నిర్వచించింది. ఆ కథనాన్ని కొనసాగించగలిగితే ప్రపంచ సానుభూతి న్యూఢిల్లీపైనే ఉంటుంది. కానీ అది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా అది క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
భారత దౌత్యవేత్తలు దీనిని ఎలా ప్రపంచం ముందుకు తీసుకు వెళ్తుందనే దాని పై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మనం ఎన్నో ముందస్తు చర్యలు చూస్తున్నాము. భారత రాయబార కార్యాలయాలు వివరణలు జారీచేయడం మనకు కనిపిస్తోంది. సాయంత్రం వరకూ, రక్షణ మంత్రిత్వ శాఖ విలేకరుల తరువాత పూర్తి వివరాలు మనకు స్పష్టత వస్తుంది.