రంజీ ట్రోఫి ముంబైదే.. ఇది ఎన్నోసారి అంటే..

రంజీట్రోఫి మరోసారి ముంబై గెలుచుకుంది. దీంతో రికార్డు స్ఠాయిలో 42వ సారి టైటిల్ ను నెగ్గినట్లంది. ఫైనల్లో విదర్భ బ్యాట్స్ మెన్ ఉమేష్ యాదవ్ ను కులకర్ణి బౌల్డ్ చేయడంతో..

Update: 2024-03-14 12:09 GMT

రంజీ ట్రోఫిని మరోసారి ముంబాయి జట్టు కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్‌లో విదర్భపై 169 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ముంబై, 42వ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

మొదటి రోజు మధ్యాహ్నం నుంచి అనేక మలుపులు తిరిగిన మ్యాచ్ ను ముంబాయి తన గుప్పిట్లో బంధించింది. ప్రత్యర్థికి అసాధ్యమైన 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ముంబై నాల్గవ రోజే గెలుపు ముంగిట నిలిచింది. అయితే విదర్భ అనుకున్నంత తేలికగా ఏం లొంగలేదు. బ్యాట్ తో తమ ఓపిక మేర క్రీజులో నిలిచేందుకు, పరుగులు సాధించేందుకు విదర్భ ప్రయత్నించింది.
ప్రస్తుతం గెలుపు మార్జిన్ చాలా పెద్దగా కనిపిస్తున్నప్పటికీ విదర్భ బ్యాట్స్ మెన్ అక్షయ్ వాడ్కర్, హర్ష్ దూబే ఉక్కు సంకల్పంతో బ్యాటింగ్ చేయడంతో ఉదయం ముంబై శిబిరంలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. .
చివరగా ఉమేష్ యాదవ్‌ను ధావల్ కులకర్ణి బౌల్డ్ చేయడంతో విదర్భకు ఓటమి ఖరారైంది.ఉమేష్ యాదవ్ లెగ్ స్టంప్ ను ధావల్ గురి తప్పకుండా సంధించి ముంబై శిబిరాన్ని ఆనందంలో ముంచెత్తాడు.
విదర్భ బ్యాట్స్ మెన్ వాడ్కర్ 199 బంతుల్లో 102 పరుగులు చేశాడు, మరో బ్యాట్స్ మెన్ కరుణ్ నాయర్ రెండో ఇన్నింగ్స్‌లో 74 పరుగులు చేశాడు. కాగా విదర్భ రెండు సార్లు రంజీ ట్రోఫిని ముద్దాడింది. రెండో ఇన్నింగ్స్‌లో తనుష్ కోటియన్ 4/95 తో విదర్భ పతనంలో కీలకపాత్ర పోషించాడు.
సంక్షిప్త స్కోర్లు: ముంబై: 224 మరియు 418 విదర్భ: 105 మరియు 368 (అక్షయ్ వాడ్కర్ 102, కరుణ్ నాయర్ 74; తనుష్ కోటియన్ 4/95)

Tags:    

Similar News