రెపోరేటు తగ్గింపు వ్యూహాత్మక చర్య: ది ఫెడరల్ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్
ఈ ప్రయోజనాలు బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తేనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి;
By : The Federal
Update: 2025-02-07 13:15 GMT
దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం తన తోడ్పాటు ను ప్రకటించింది.
తాజాగా తన పరపతి విధాన సమీక్షలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీనితో రెపోరేటును 6. 25 శాతం కి తగ్గినట్లు అయింది. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత మొదటి సారి ఆర్బీఐ వడ్డీరేటు తగ్గించింది.
ఈ సంవత్సరం జీడీపీ 6.7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్న సమయంలో ఈ పరిణామం జరిగింది.
‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ ఈ విధాన మార్పును, ఆర్థిక వ్యవస్థలో దాని ప్రభావం పై తన అభిప్రాయాలను వెల్లడించారు. రెపో రేటు తగ్గింపు వల్ల.. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెరుగుతుందని, బ్యాకింగ్ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేశారు.
‘‘బ్యాంకులు ఇప్పుడు మెరుగ్గా ఉండాలి. ఎందుకంటే అవసరమైనంత మేర ద్రవ్యం వాటి చేతిల్లోకి వచ్చింది. దీని ఫలితం క్రెడిట్ ప్రభావంపై ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐ విస్తృత ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఉండే వ్యూహాత్మక చర్య’’ అని ఎడిటర్ అన్నారు.
మధ్య తరగతికి పన్నుల ఉపశాంతిని కలుగజేసిన ఆర్థిక మంత్రి, తద్వారా వినియోగాన్ని పెంచడానికి, ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి కంకణం కట్టుకుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈచర్యకు మద్ధతు ఇవ్వడానికి ఆర్బీఐ కూడా తన విధాన పరపతిని సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని శ్రీనివాసన్ నొక్కి చెప్పారు. ‘‘పన్ను కోతలు ఆర్బీఐ రేట్లను తగ్గించాల్సి ఉంటుందని సూచిస్తున్నాయి. ఈ చర్య ఊహించిందే’’ అని ఆయన పేర్కొన్నారు.
జాగ్రత్తగా అడుగులు..
రేటు తగ్గింపు స్పల్పకాలిక ప్రొత్సాహాన్ని అందిస్తున్నప్పటికీ భవిష్యత్ లో రేటు తగ్గింపు విషయంలో ఆర్బీఐ జాగ్రత్తగా అడుగులు వేస్తోందని అనిపిస్తోంది. కేంద్ర బ్యాంకు ప్రస్తుతానికి మధ్యే మార్గాన్ని అనుసరించింది.
తదుపరి ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ పరిస్థితులు, దేశీయ ఆర్ధిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్పారు. ఈ ప్రకటన కొంచెం పరిశీలిస్తే భవిష్యత్ లో రెపోరేటు అనేది నెమ్మదిగా ఉంటుందని తెలుస్తోంది.
‘‘ఆర్బీఐ వైఖరి తటస్థంగా ఉంది. అంటే సమీప భవిష్యత్ లో ఇది భారీగా తగ్గింపు ఉండకపోవచ్చు. దేశీయంగా పరిస్థితి బాగుపడటం, ప్రపంచ ద్రవ్యోల్భణం వంటి బాహ్యఅంశాలు.. రెండు ఆర్బీఐ భవిష్యత్ నిర్ణయాలపై ప్రభావం చూపించడంలో పాత్ర పోషిస్తాయని గవర్నర్ చెప్పకనే చెప్పారు’’ అని శ్రీనివాసన్ వివరించారు.
ప్రస్తుతం ఆర్బీఐ తగ్గించిన రేట్లు.. కొన్ని కీలక రంగాలలో ప్రభావం చూపుతుంది. వాటిలో ఒకటి వినియోగదారుల వ్యయం. ద్రవోల్బణం 4 శాతం ఉంటుందని అంచనా వేస్తూ.. మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి కారణంగా ఆహార ద్రవ్యొల్భణం తగ్గే అవకాశం ఉంది.
అయితే ఇదే సమయంలో వినియోగదారుల ధోరణులు సమానంగా లేవు. గ్రామీణ వినియోగం పెరిగినప్పటికీ, పట్టణ వినియోగం నెగటివ్ లోకి వెళ్లింది. అయితే ప్రస్తుతం పన్ను తగ్గింపు వంటి ప్రయోజనాలు బడ్జెట్ లో ప్రకటించడంతో పట్టణ వినియోగం తగ్గుతుందని ఆయన అంచనా వేశారు.
రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతుందా?
కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్ రంగం తాజా నిర్ణయాలతో ఉపశమనం పొందుతుందని అంచనా వేశారు. గృహాల రేట్ల తగ్గింపు, సరసమైన ధరలకు లభించే అవకాశం ఉంది. రూ. 60 లక్షల కంటే తక్కువ ధర ఉన్నఇళ్లు ఈ మధ్య కాలంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి.
ఇప్పుడు రేట్లు తగ్గింపు అనేది వాటి అమ్మకాలకు ఊతం ఇస్తుంది. అయితే ప్రభుత్వం, ఆర్బీఐ ఇచ్చిన ప్రయోజనాలను బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తాయా? అనే సందేహాన్ని ఎడిటర్ వ్యక్తం చేశారు. మొత్తం 25 బీపీఎస్ కోత వినియోగదారులకు బదిలీ చేయాల్సిన అవసరం లేదు. బ్యాంకులు ప్రయోజనాలను బదిలీ చేస్తే అది గృహ డిమాండ్ లను పునరుద్దరించడంలో సాయపడుతుంది. కానీ మనం వేచి చూడాలని ఆయన అన్నారు.
ఫలితాలు రావడానికి సమయం పట్టచ్చు
రేటు తగ్గింపు ప్రయోజనాలు మార్కెట్లో కనిపించడానికి ఇంకా కొంత సమయం పట్టవచ్చని ఎడిటర్ అన్నారు. రియల్ ఎస్టేట్ వంటి రంగాలలో మధ్య అంతరం రికవరీ వెంటేనే ఉండకపోవచ్చన్నారు. ‘‘ ఈ ప్రభావం రాత్రికి రాత్రే కనిపించదు. బ్యాంకులు ఎలా స్పందిస్తాయో, ఖర్చులను పెంచడానికి అవి త్వరగా ప్రయోజనాలను అందజేస్తాయా అనే దానిపై ఆధారపడి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్త సవాల్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రేట్లు తగ్గించాలనే ఆర్బీఐ నిర్ణయం సరైన దిశలో ఓ మందడుగని అభివర్ణించారు. అయితే బ్యాంకులు దీనిని వినియోగదారులకు బదిలీ చేస్తేనే పట్టణ, గ్రామీణ మార్కెట్లలో వినియోగదారుల డిమాండ్ పెరుగుతుందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుందని అన్నారు.