వేసవి కోసం నీళ్లని దాచుకునే చెట్టు, పాపికొండల్లో వింత

ఈ చెట్టు వేసవి కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంది. వేసవి కోసం కాండంలో నీటిని నిల్వచేసుకుంటుందని కొండరెడ్ల తెగ నమ్మకం. దాన్ని అటవీ శాఖ అధికారులు రుజువు చేశారు.

Update: 2024-04-02 09:12 GMT


గోదావరి ప్రాంతంలోని పాపికొండల కొండ శ్రేణిలో నివసించే ఈ చెట్టు కాండంలోనీరు నిల్వ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ఈ చెట్టు విపరీతంగా నీటిని నిల్వ చేసుకుంటుంది. ఈ విషయం ఈ పాపికొండలు ప్రాంతంలో నివసించే కొండరెడ్డి అనే గిరిజన తెగల వారికి మాత్రమే తెలుసు.

ఈ చెట్టును ఇండియన్ లారెల్ చెట్టు అని పిలుస్తారు. ఇంగ్లీష్ సిల్వర్ ఓక్ అంటారు. దీని శాస్త్రీయ నామం టెర్మినలియా టొమెంటోసా (Terminalia Tomentosa ). ఈ చెట్టు బెరడును శనివారం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు కత్తిరించి కొండరెడ్డి విశ్వాసం ఎంతవరకు నిజమో కొనుక్కోవాలనుకున్నారు. రంపచోడవరం డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ జిజి నరెంథరన్ నేతృత్వంలోని బృందం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.

“ తాము ఈ చెట్టు బెరడును జివిరినపుడు చెట్టు కాండం నీటిని ధారగా చిమ్మింది. కొండరెడ్డి తెగ వారి లోకల్ నాలెడ్జి నిజమే, ”అని నరేంథరన్ చెప్పారు.ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశాడు.





“మండు వేసవిలో, భారతీయ లారెల్ చెట్టు ఇలా నీటి నిలువ చేసుకుంటుంది. ఈ నీటికి ఘాటైన వాసనతో పులిసిన రుచి ఉంది. ఇది ఈ మొక్క వాతావరణానుకూల జీవనవిధానాన్ని వ్యక్తం చేస్తుంది.   గొప్ప జీవనవ్యూహం ,” అని శ్రీ నరెంథరన్ అన్నారు.

ఈ జాతి మొక్కల పరిరక్షణ కోసం ఈ అడవిలో అవి పెరుగుతున్న స్థలాన్నిఅధికారులు వెల్లడించలేదు.


Tags:    

Similar News