నరేంద్రునికి నాలుగు రాష్ట్రాల టెన్షన్...

ఆప్ కి బార్ చార్ సౌ నినాదంతో వెల్తున్న నరేంద్ర మోదీకి ఆ నాలుగు రాష్ట్రాలు టెన్షన్ పెడుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు.

Update: 2024-04-12 08:10 GMT


నరేంద్రునికి నాలుగు రాష్ట్రాల టెన్షన్...

( గోపిరెడ్డి సంపత్ కుమార్)

ఆప్ కి బార్ చార్ సౌ నినాదంతో వెల్తున్న నరేంద్ర మోదీకి ఆ నాలుగు రాష్ట్రాలు టెన్షన్ పెడుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు. ఇటీవలి కాలంలో దేశంలో వున్న కాన్ని బడా వ్యాపార సంస్థలు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలపై సర్వేలు నిర్వహించాయి. అందులో ఎన్ డి యే కూటమికి ప్రతికూలత కనిపించింది. దాంతో నరేంద్ర మోదీకి ఎక్కువ స్థానాలున్న నాలుగు రాష్ట్రాలపై టెన్షన్ పట్టుకున్నది. నిత్యం కుటుంబ పార్టీలంటూ విపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోసే మోదీ, ఆ నాలుగు రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలంటూనే.. అవే పార్టీలతో పొత్తు పెట్టుకోవడాన్ని చూస్తే కచ్చితంగా మోదీకి ఆ నాలుగు రాష్రాల టెన్షన్ పట్టుకున్నదని చెప్పవచ్చు.

బిజేపి నేతలు అనుకుంటున్నట్టు 400 సీట్లు సాధించాలంటే నాలుగు రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్‌ (80), మహారాష్ట్ర (48), బీహార్‌ (40), కర్ణాటక (28)) కీలకం. ఈ రాష్ట్రాల్లో 196 స్థానాలున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో

ఈ నాలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ యూపీలో 62, బీహార్‌లో 39, మహారాష్ట్రలో 41, కర్ణాటకలో 25 సీట్లు దక్కించుకున్నది. మొత్తం 167 స్థానాలు ఎన్డీఏ ఖాతాలో పడ్డాయి. ఇవి తిరిగి దక్కించుకుంటేనే కేంద్రంలో అధికారంతో పాటు 400 సీట్ల మార్కుకు అందుకోవడం సాధ్యమౌతుంది. కానీ ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆపార్టీకి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదనేది బడా వ్యాపారస్తులు, ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ సెంటర్ ఫర్ పొలిటికల్ రిసెర్చ్ అండ్ స్ట్రాటజీస్ (సిపిఆర్) నిర్వహించిన సర్వేలో తేటతెల్లమవుతున్నది. ఇదే ఆపార్టీని కలవరపెడుతున్నది. అందుకే ఈ నాలుగు రాష్ట్రాల్లో నరేంద్రమోడీ ఛరిష్మానే నమ్ముకోకుండా ప్రాంతీయపార్టీలను ప్రసన్నం చేసుకుని ఎన్డీఏలో చేర్చుకున్నది.

అయితే ఆ నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలు ఏవిదంగా వున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

*ఉత్తర్ ప్రదేశ్ లో 80 స్థానాలుండగా గత ఎన్నికల్లో బిజేపి 62 స్థానాలు దక్కించుకుంది. ప్రస్తుతం ఆపర్స్థితులు కనిపించడంలేదని ఆసర్వే సారాంశం. బిజేపికి 40, కాంగ్రెస్ 12, సమాజ్ వాది పార్టీ 24, బిఎస్పి 4 వస్తాయని ఆ సర్వే తేల్చి చెప్పింది. ఇక్కడ అఖిలేశ్‌యాదవ్‌ నేతృత్వంలోని ఎస్పీ+కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆపార్టీ అధ్యక్షురాలు మాయావతి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ గత ఫలితాను పునావృతం చేయాలంటే ప్రాంతీయపార్టీలను కలుపుకోకుంటే నష్టమేనని భావించిన బిజేపి ఆర్‌ఎల్‌డీతోపాటు, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీలతో పొత్తు పెట్టుకున్నది.

* మహారాష్ట్రలో 48 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో బిజేపి 41 స్థానాల్లో విజయం సాదించింది. ప్రస్తుతం సర్వే ప్రకారం బిజేపి 12, కాంగ్రెస్ 18, ఉధ్ధవ్ థాక్రే శివసేన 10, ఎన్సీపి 8 స్థానాలు వస్తాయని తేల్చింది. కాగా ఇక్కడ మహా ఘాడీ కూటమిదే పైచేయిగా నిలుస్తుందని భావించిన బిజేపి, మరాఠా ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి 10 శాతం కోటాను అమలు చేయడానికి చట్టం చేసింది. అయితే రాజ్యాంగ సవరణ చేయకుంటే అది న్యాయ సమీక్షకు నిలువదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా

అక్కడ గతంలో 41 సీట్లను గెలుచుకున్న బీజేపీ తిరిగి వాటిని నిలబెట్టుకోవడానికి ఏక్‌నాథ్‌ శిండే, అజిత్‌ పవార్‌లతోనే తన గమ్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదని గ్రహించి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల అశోక్‌చవాన్‌, మళింద్‌ దేవర వంటి నేతలను పార్టీలో చేర్చుకున్నది. ఇక్కడితో ఆగకుండా ఉద్ధవ్‌ నేతృత్వంలో శివసేన ఓట్లను భారీగా చీల్చేందుకు వారి కుటుంబసభ్యుడైన రాజ్‌ఠాక్రేను ముందుపెట్టి అడ్డుకోవాలనుకుంటున్నది. అందుకే రాజ్‌ఠాక్రే హుటాహుటిన హస్తినకు పిలిచి ఎన్డీఏలోకి ఆహ్వానించింది.

* బీహార్‌లో 40 స్థానాలకు గాను గత ఎన్నికల్లో బిజేపి ఏకంగా 39 స్థానాల్లో విజయభావుటాను ఎగుర వేసింది. ప్రస్తుతం బిజేపికి అనుకూలంగా లేదని సర్వేలు చెబుతున్నాయి. బిజేపి 09, కాంగ్రెస్ 06, ఆర్జేడి 18, జేడి(యు) 07 స్థానాలు వస్తాయని సర్వే వెల్లడించింది. తరుచూ కూటములను మార్చే నితీశ్‌, బీజేపీ కలిసి ఒకవైపు- ఆర్జేడీ, కాంగ్రెస్‌ కలిసి తలపడనున్నాయి. అధికారం కోసం తరుచూ కూటములు మారుస్తున్న నితీశ్‌ వల్ల ఎన్డీఏకు నష్టమని అక్కడ 17 చోట్ల బీజేపీ, 16 స్థానాల్లో జేడీయూ, ఎల్జేపీ (రాంవిలాస్‌) 5 , హిందుస్థానీ అవామ్‌ మోర్చా, ఉపేంద్ర కుష్‌యాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మంచ్‌ పార్టీలకు తలో టికెట్‌ బిజేపి కేటాయించింది.

నితీశ్‌కు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో నిలబడిన చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ 6 సీట్లు గెలుచుకున్నది. ఆపార్టీలో చీలిక తెచ్చింది. రాం విలాస్‌ పాశ్వాన్‌ సోదరుడు పశుపతి కుమార్‌ పరాస్‌ రాష్ట్రీయ లోక్‌ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) పేరుతో 2021లో పార్టీని స్థాపించాడు. 5 గురు ఎంపీలు ఎన్డీఏతో జత కట్టారు. పశుపతికి కేంద్రమంత్రి ఇచ్చింది. తాజాగా ఆపార్టీకి ప్రాధాన్యం ఇవ్వకుండా చిరాగ్‌ పార్టీ ఎల్జేపీకి 5 సీట్లు కేటాయించడంతో పశుపతి మంత్రిపదవికి రాజీనామా చేశారు. మోడీ, నితీశ్‌లకు చెక్‌ పెట్టి సత్తా చాటడానికి లాలూ రంగంలోకి దిగి వ్యూహ రచన చేస్తున్నారు. కుటుంబ రాజకీయాల గురించి మోడీ మాటలకు లాలు స్ట్రాంగ్‌ కౌంటర్‌లు ఇస్తున్నారు. ఈసారి అక్కడ ఎన్డీఏకు మహాఘట్‌బంధన్‌ (ఆర్జేడీ+కాంగ్రెస్‌ కూటమి) నుంచి గట్టి పోటీ ఎదురుకానున్నది.

* కర్ణాటకలో 28 పార్లమెంట్ స్థానాలుంటే గత ఎన్నికల్లో బిజేపి 25 సీట్లను దక్కించుకున్నది. ప్రస్తుతం అందుకు బిన్నంగా పరిస్థితులు వున్నాయనేది సర్వేను బట్టి తెలుస్తున్నది. సర్వే ప్రకారం బిజేపి 07, కాంగ్రెస్ 20, జేడిఎస్ 01 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ త్రిముఖ పోరులో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. దీంతో బిజేపి హూటాహుటిన జేడిఎస్ ను తన కూటమిలో చేర్చుకున్నది.

బీజేపీ ఆశిస్తున్న 400 సీట్లు ఈ నాలుగు రాష్ట్రాల్లో వచ్చే సీట్లపై ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది. అలాగే బీజేపీ ఎన్నికల ప్రచారంలో చేస్తున్న కుటుంబ రాజకీయాల విమర్శలకు ఈ నాలుగు రాష్ట్రాల్లో కుటుంబ పార్టీల నేతృత్వంలోని ప్రాంతీయపార్టీలతోనే పొత్తు పెట్టుకున్నది. అంటే మోడీ చెప్పే మాటలకు ఆచరణకు సంబంధం లేదని తెలుస్తోంది.


Tags:    

Similar News