వచ్చే ఎన్నికల్లో అధికధరలు, నిరుద్యోగమే ముఖ్యాంశాలు : సర్వే
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏయే సమస్యలు ప్రధానం కానున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ హవా అలాగే ఉందా? ఓటరు ఏవైపు నిలవబోతున్నారు. ఈ ప్రశ్నలపై ఫెడరల్ సర్వే ఇది
By : The Federal
Update: 2024-02-12 15:25 GMT
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏయే సమస్యలు ప్రధానం కానున్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ హవా అలాగే ఉందా? భారతీయ ఓటరు ఏవైపు నిలవబోతున్నారు. ఈ తరహా ప్రశ్నలకు సమాధానమే ఫెడరల్ సర్వే. భారతీయ వెబ్‌సైట్లలో పేరున్న ఫెడరల్ గ్రూపు తన అనుబంధ సంస్థ పుతియా తలైమురై ఓ విస్తృత నెట్ వర్క్ కలిగిన ఆఫ్ట్ రీసెర్చ్ గ్రూపుతో కలిసి దేశవ్యాప్తంగా ఓటరు నాడి పసిగట్టేందుకు ప్రయత్నం చేసింది. అందులో వెలువడిన అంశాలను ఫెడరల్ గ్రూప్ ఈవేళ్టి నుంచి ఫిబ్రవరి 12 నుంచి అందిస్తోంది. మా యూటూబ్ చానల్ ద్వారా చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. నిపుణులతో మా గ్రూపు చేసే చర్చల్ని తిలకించండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
మా ఫెడరల్ సర్వే వివరాలు ఇలా ఉన్నాయి...
ప్రధాన సమస్యలు ఏమిటంటే- వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన సమస్యలు రెండు- ఒకటి ధరల పెరుగుదల, రెండు నిరుద్యోగం.
ఇక మోదీ హవా ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. ఐదేళ్ల కిందట ఆర్థిక పరిస్థితి అలాగే ఉన్నట్టు ఫెడరల్-పుతియాతలైమురై సర్వేలో తేలింది.
ఇక, భారతీయ ఓటరు ఏమనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో అతిపెద్ద సమస్య ఏమిటి? నరేంద్ర మోదీ మంచి ప్రధాని అని ఇండియా భావిస్తోందా?
అసలింతకీ ఈసారి భారతీయ ఓటరు ఏవైపు మళ్లనున్నారు?
ఈ ప్రశ్నలకు సమాధానమే ఫెడరల్, దాని అనుబంధ సంస్థ పుతియా తలైమురై ఓ విస్తృతమైన నెట్ వర్క్ ఉన్న పాన్-ఇండియా సంస్థ ఆప్ట్ రీసెర్చ్ గ్రూప్‌తో కలిసి చేసిన ప్రయత్నం. ఈ సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన సమాధానాలు వెల్లడయ్యాయి. ఈరోజు (ఫిబ్రవరి 12) నుంటి మేము వాటిని మీతో పంచుకోబోతున్నాం. మీరు ఫెడరల్ YouTube ఛానెల్‌లో ఆ వివరాలు చూడవచ్చు. నిపుణులతో మా ప్యానెల్ చేసే చర్చనూ వినవచ్చు. చూడవచ్చు.
మా మొదటి ప్రశ్న గత ఐదేళ్లలో దేశంలొ
ఆర్థిక పరిస్థితిలో ఏమైనా మార్పుందా?
గత ఐదేళ్లలో మీ ఆర్థిక స్థితిలో వచ్చిన మార్పును మోదీ పాలన సూచిస్తుందా? ఏది ఉత్తమంగా ఉంది? మా ప్రశ్నకు వచ్చిన సమాధానం ఎలా ఉందంటే... దేశవ్యాప్తంగా 44 శాతం మంది ఆర్థిక పరిస్థితి 2019 నుంచి కాస్త కుడిఎడంగా 2019లో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని చెప్పారు. దాదాపు 35 శాతం మంది మాత్రం కాస్తంత మెరుగుపడిందన్నారు. సుమారు 18 శాతం మంది మాత్రం ఆర్ధిక పరిస్థితి క్షీణించిందన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాలలో సగటు ఓటరు అభిప్రాయం ఒకేలా కనిపిస్తోంది. చిత్రమేమిటంటే సగటు ఓటరు అభిప్రాయం మాత్రం దేశమంతటా ఒకే విధంగా ఉండడం.
మా రెండో ప్రశ్న: కేంద్రప్రభుత్వం చేపట్టిన అతి పెద్ద కార్యక్రమాలు ఏమిటీ?
మీ ఉద్దేశంలో మోదీ ప్రభుత్వం చేపట్టిన మూడు అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమాలు ఏమిటనుకుంటున్నారు?
ప్రజలు చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
1. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI)
2. 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్ సరఫరా
3. జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించడం
ఈ మూడు పథకాలు జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచాయి.
ఆ తర్వాత చెప్పిన అంశాలలో
డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) ద్వారా రైతులకు ఆర్థిక సహాయం
అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను పెంచడం
జాతీయ రహదారుల నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడం వంటివి మోదీ ప్రభుత్వం అమలు చేసిన పెద్ద పథకాల జాబితాలో నిలిచాయి.
తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో ఉచిత రేషన్ పథకమైన ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) ఓటర్లను బాగా ఆకట్టుకుంటోందన్నది మా సర్వేలో తేలింది.
మా మూడో ప్రశ్న.. లబ్ధిదారులు- ఓటర్లకు సంబంధించింది
వకేంద్రప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో మీరేమైనా లబ్ధిదారుగా ఉన్నారా?
ఆశ్చర్యమేమిటంటే.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన వారిలో 63 శాతం మంది తాము ఏ ప్రభుత్వ పథకానికి లబ్ధిదారులం కాదని చెప్పడం. పథకాల లబ్ధిదారుల్లో ఎక్కువ మంది తూర్పు భారతదేశంలో ఉన్నారు. ఈ శాతం 36గా ఉంది.
ఫెడరల్ గ్రూపు సంధించిన నాలుగో ప్రశ్న.. నూతన పార్లమెంటు భవనానికి సంబంధించింది
కొత్త పార్లమెంట్ భవనానికి మీరిచ్చే రేటింగ్ ఎంత? అసలు మీ అంచనా ఏమిటీ?
గతేడాది ప్రారంభమైన కొత్త పార్లమెంట్ భవనానికి మంచి స్పందన వచ్చినట్లు తెలుస్తోంది.
పార్లమెంటు భవనానికి ఉత్తమ రేటింగ్ ఇచ్చిన ఓటర్లు పశ్చిమ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది. సుమారు 23 శాతం మంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత స్థానంలో తూర్పు భారతదేశం నిలిచింది. దాదాపు 21 శాతం మంది పార్లమెంటు భవనాన్ని మెచ్చుకుంటూ రేటింగ్ ఇచ్చారు.
ఎక్సలెంట్, వెరీ గుడ్, గుడ్, సంతృప్తికరమైన ఆప్షన్లు ఇచ్చిన వారూ ఎక్కువే ఉన్నారు. అయితే పార్లమెంటు భవనంపై పెదవి విరిచిన వారూ లేకపోలేదు. ఈ శాతం కూడా 20 శాతానికి పైగా ఉన్నారు.
మా 5వ ప్రశ్న 5 ఎన్నికల సమస్యలపైన...
లోక్‌సభ ఎన్నికల్లో మీ ఓటును నిర్ధారించే అంశాలు ఏవి? ఓటింగ్ ఉద్దేశాన్ని ఏమి నిర్దేశిస్తుంది అని అడిగిన ప్రశ్నకు చాలా మంది ప్రతివాదులు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అన్నారు. ఇలా చెప్పిన వాళ్లు దాదాపు 32 శాతంగా ఉన్నారు.
మోడీ ప్రధానమంత్రిగా కొనసాగాలా వద్దా అనేది కూడా ఒక కీలకమైన అంశంగా కనిపిస్తోంది. 26.5 శాతం మంది ఓటర్లు తాము ఈ విషయాన్ని ఆలోచిస్తున్నామన్నారు.
నిరుద్యోగాన్ని ప్రభావితం చేసే అంశంగా పేర్కొన్న వారిలో అత్యధికులు దేశంలోని తూర్పు ప్రాంతం వారు. 38 శాతం మంది నిరుద్యోగమే ప్రధాన సమస్య అన్నారు. ధరల పెరుగుదల విషయానికి వస్తే, ఇది ఉత్తరాదిలో బాగానే ప్రభావితం చేసే అంశంంగా ఉంది. 33 శాతం మంది దీన్ని కీలకాంశంగా, ఆందోళనకరమైన అంశంగా పేర్కొన్నారు.
మేము ఎలా సర్వే చేశామంటే...
2023 నవంబర్ నుంచి 2024 జనవరి మధ్య 19 రాష్ట్రాల్లో ఈ సర్వే చేశాం. 82 లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన 1,314 లోకేషన్లలో ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించాం. ర్యాండంగా ఈ సర్వేను నిర్వహించాం.
దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 35వేల 905 మంది ఓటర్లను ఈ సర్వే కవర్ చేసింది.
సర్వే కోసం 19 రాష్ట్రాలను నాలుగు జోన్లుగా విభజించాం. అవి..
నార్త్ జోన్: పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ
సౌత్ జోన్: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ
ఈస్ట్ జోన్: ఒడిశా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం
వెస్ట్ జోన్: మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్
అర్హులైన ఓటర్లను ర్యాండమ్‌గా (యాదృచ్ఛికంగా) ఎంపిక చేశాం. నిర్మాణాత్మక ప్రశ్నాపత్రం తయారు చేసి ఎంపిక చేసిన ఇళ్లకు వ్యక్తిగతంగా వెళ్లి ఇంటర్వ్యూలు చేశాం. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, బెంగాలీ భాషల్లో ప్రశ్నపత్రాలు ఇచ్చాం.
ఇంటర్వ్యూలను ఆప్ట్ సంస్థ ఫీల్డ్ సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో నిర్వహించాం. నిపుణులైన బృందం ఈ ఇంటర్వ్యూలను నిర్వహించింది.
82 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. ఒక్కో నియోజకవర్గం నుంచి 4 వందల మంది ఓటర్లను ఇంటర్వ్యూ చేశారు. ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సర్వే ఫలితాలను నిర్ణయించాం.