పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి ఇదే మంచి అవకాశమా?
కేంద్ర ప్రభుత్వం అనుకున్న స్థాయిలో ఎప్పుడు కూడా పెట్టుబడులు ఉపసంహరణ ను చేపట్టలేకపోయింది. గడచిన రెండు బడ్జెట్ లో కేంద్రం భారీ స్థాయిలో బడ్జెట్ లో..
By : The Federal
Update: 2024-07-20 05:50 GMT
కేంద్ర ప్రభుత్వం త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే పూర్తి స్థాయి లక్ష్యాలను ఏర్పరచుకున్నారనే అనుకుందాం. ముఖ్యంగా పెట్టుబడుల ఉపసంహారణ విషయంలో లక్ష్యాలను సాధించడం కష్టంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 2024, అలాగే 2025 ఆర్థిక సంవత్సరాల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను వరుసగా ₹ 30,000 కోట్లు ₹ 50,000 కోట్లగా నిర్ణయించారు. కానీ ఈ ఏడాది ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. 2024 బడ్జెట్ లోనే స్పష్టమైన, పారదర్శక, సమగ్రమైన వ్యూహంతో కూడిన ఓ ప్రక్రియను పున: ప్రారంభించే అవకాశం ఉంది.
గురి తప్పిన లక్ష్యాలు
కొద్ది కాలంగా ప్రభుత్వం బడ్జెట్ లో అనుకున్నంత స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టలేకపోతోంది. కిందటి ఏడాది బడ్జెట్ లో డిస్ ఇన్ వెస్ట్ మెంట్స్ 51 వేల కోట్ల నుంచి 30, 000 వేల కోట్లకు తగ్గించారు.
2022లో ఎయిర్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటీకరణ విజయవంతమైనప్పటికీ, మొత్తం ఉపసంహరణ పనితీరు మాత్రం ప్రభుత్వం అనుకున్నత స్థాయిలో లేదు. మునుపటి లక్ష్యం ₹51,000 కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం కేవలం ₹10,051.73 కోట్ల లక్ష్యాన్ని మాత్రమే సాధించింది. ప్రాథమిక సహకారాలు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ IPOలు (ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లు), OFSలు (విక్రయానికి ఆఫర్‌లు) నుంచి వచ్చాయి.
గతంలో, ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు OFS విధానాన్ని ఉపయోగించింది. అయినప్పటికీ, నియంత్రణ పరిశీలన, ఆస్తుల విభజన, కార్మిక సంఘాల వ్యాజ్యంతో సహా వివిధ అడ్డంకులు ఈ కార్యక్రమాన్ని మందగించేలా చేశాయి. ఇంకా, ప్రభుత్వ-యాజమాన్య సంస్థలకు ఆమోదయోగ్యమైన విలువలను నిర్ణయించడం కష్టంగా మారింది. గ్లోబల్ ఎకనామిక్ అస్థిరత వల్ల విలువలో మార్పు తో తరుచుగా ఈ పథకం కొనసాగించడం కష్టంగా మారింది.
ఉపసంహరణకు అవకాశం
కోర్ ఎడ్జ్ రేటింగ్ ప్రకారం భారత దేశంలో పెట్టుబడుల ఉప సంహారణకు అంచనాలకు ఉన్న మొత్తం విలువ దాదాపు 11.5 లక్షల కోట్లు ఉండవచ్చని తెలిసింది. ఇవి కేవలం 51 శాతం వాటా ఉన్న కంపెనీలను మాత్రమే పరిగణలోకి తీసుకుంది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, NMDC స్టీల్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CONCOR) వంటి కీలక పెట్టుబడుల ఉపసంహరణలు ఉన్నాయి. ఈ ఉపసంహరణలు ఆదాయాన్ని పెంచడానికి, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, యాజమాన్యాన్ని విస్తృతం చేయడానికి, మార్కెట్ క్రమశిక్షణను ప్రోత్సహించడానికి గణనీయంగా దోహదపడతాయి.
ఈ ప్రణాళిక ఎలా ఉండాలి..
టైమ్ లైన్: జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ప్రతి దశకు నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి .
లక్ష్యాలు: ప్రతి ఉపసంహరణ కోసం ఆర్థిక లక్ష్యాలు- వ్యూహాత్మక లక్ష్యాలను క్లియర్ చేయాల్సి ఉంటుంది.
విధానపరమైన సరళీకరణలు: ఏదైన ఆస్థిని ప్రభుత్వం డిస్ ఇన్వెస్ట్ మెంట్ చేయాలని నిర్ణయం తీసుకుంటే నియంత్రణ, ఆమోదాలు, ఆస్థుల విభజన ప్రక్రియతో ఆలస్యాలను నివారించాలి.
పెద్ద సంస్థల ఉపసంహరణలు
FY25 కోసం ₹50,000 కోట్ల లక్ష్యాన్ని సాధించడానికి, ప్రభుత్వం పెద్ద సంస్థల ఉపసంహరణలపై దృష్టి పెట్టాలి. BPCL, SCI, CONCOR వంటి అధిక-విలువ PSEలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ ఉపసంహరణలు ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతంగా అధిగమించాలి.
BPCL: మార్కెట్ పరిస్థితులు, విధానపరమైన సమస్యల కారణంగా ప్రణాళికాబద్ధమైన వ్యూహాత్మక ఉపసంహరణ ప్రక్రియన ప్రవేశపెట్టారు.
SCI- CONCOR: మహమ్మారి, విధానపరమైన అడ్డంకుల కారణంగా ఇక్కడ కూడా డిజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఆలస్యమైంది.
ధర సమస్యలు
విధానపరమైన- ధరల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
రెగ్యులేటరీ వెట్టింగ్: ఫాస్ట్-ట్రాక్ రెగ్యులేటరీ అప్రూవల్ ప్రాసెస్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆలస్యాన్ని తగ్గించవచ్చు.
ఆస్తి విభజన: లావాదేవీలను త్వరగా సులభతరం చేయడానికి కోర్, నాన్-కోర్ ఆస్తుల విభజనను సరళీకృతం చేయాలి.
మదింపు - ధర: కొనుగోలుదారులను ఆకర్షించడానికి న్యాయమైన విలువలను, ధరలను నిర్ణయించడానికి స్వతంత్ర ఆర్థిక సలహాదారులను నియమించాలి.
రాజకీయ సంకల్పం
రాజకీయ ఏకాభిప్రాయాన్ని పెంపొందించాలి. అలాగే పెట్టుబడుల ఉపసంహరణకు ప్రజల మద్దతు చాలా కీలకం. వీటిని ప్రైవేటీకరణ చేయడం వల్ల మెరుగైన యాజమాన్యం, పెట్టుబడుల ఉపసంహరణ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు కూలంకషంగా వివరించాలి. అలాగే కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను సైతం భాగస్వామ్యం చేయాలి.
PSBల పాత్ర
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒక నివేదికలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSBs) ప్రస్తుత మంచి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాటి పెట్టుబడుల ఉపసంహరణను సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకుల ఏకీకరణ బ్యాంకింగ్ రంగాన్ని మరింత క్రమబద్ధీకరించగలదని, సామర్థ్యాన్ని మెరుగుపరచగలదని నివేదిక సూచిస్తుంది .
ఆదాయ లోటును పూడ్చడం..
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాల నుంచి వచ్చే ఆదాయ లోటును ప్రభుత్వం ముందస్తుగా పరిష్కరించాలి. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు: ప్రభుత్వ ఆదాయ అంతరాన్ని తగ్గించడానికి ఆస్తి మానిటైజేషన్, పన్ను పెంచడం వంటి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను అన్వేషించడం ముఖ్యం. పెరిగిన రుణాలు: బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి స్వల్పకాలికంలో పెరిగిన రుణాలు అవసరం కావచ్చు.
ఆర్థిక క్రమశిక్షణ
పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవడంలో నిరంతర వైఫల్యం ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. దీనిని తగ్గించడానికి, ప్రభుత్వం తప్పక కొత్త విధానాలకు మెరుగుపెట్టాలి.
డివిడెండ్లపై ఆధారపడటాన్ని పెంచుకోవాలి: ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల నుంచి డివిడెండ్‌లపై ఆధారపడటం తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది కానీ స్థిరమైన పరిష్కారం కాదు. ఈ సంస్థలు లాభదాయకతను కొనసాగించేలా చూసుకోవడం చాలా కీలకం.
కేంద్రం తన ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి యూనియన్ బడ్జెట్ 2024లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. స్పష్టమైన ఉపసంహరణ ప్రణాళికను ప్రకటించడం ద్వారా, పెద్ద-సంస్థల డివెస్ట్‌మెంట్‌లపై దృష్టి సారించడం, విధానపరమైన, ధరల సమస్యలను పరిష్కరించడం, రాజకీయ సంకల్పాన్ని పెంపొందించడం ద్వారా, ప్రభుత్వం ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయవచ్చు. మరింత సమర్థవంతమైన, పోటీతత్వ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించవచ్చు.
PSBల వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు, దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా ఆర్థిక క్రమశిక్షణను నిర్వహించడం కూడా కీలకం. ఈ బహుముఖ విధానం ఆర్థిక లోటును తగ్గించడమే కాకుండా ఆర్థిక వృద్ధి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.