పాఠశాలల్లో వాటర్ బెల్..కేరళ ప్రభుత్వ కొత్త ఆలోచన..

పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు కేరళ ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. పాఠశాలల్లో వాటర్ బెల్ మోగించనున్నారు.

Update: 2024-02-17 07:00 GMT

వేసవి సమీపిస్తోంది. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. రానున్న రోజుల్లో పెరుగుతూ పోతుంది. ప్రతి ఏడాది ఇది మనకు తప్పదు.ఎండాకాలం వచ్చిందంటే జాగ్రత్తలు కూడా తప్పనిసరి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సూచిస్తారు. ఇంట్లో ఉంటో ఎలాగు తాగేస్తాం. బయటకు వెళితే వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాం.

బడికి వెళ్లే విద్యార్థుల విషయంలో కేరళ ప్రభుత్వం కాస్త జాగ్రత్తగా ఉన్నట్టుంది. అక్కడి పాఠశాలలో కొత్తగా "వాటర్-బెల్" విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ఈ విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉదయం 10.30 ఒకసారి, మధ్యాహ్నం 2.30 గంటలకు మరోసారి బెల్ మోగిస్తారు. ఇలా రెండుసార్లు బెల్ మోగించి.. విద్యార్థులకు 5 నిముషాల పాటు విరామం ఇస్తారు. ఈ సమయంలో పిల్లలంతా నీళ్లు తాగేలా ప్రోత్సహిస్తారు. ఫిబ్రవరి 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాలకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉండగా..కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కెఎస్‌డిఎంఎ) శనివారం నాలుగు జిల్లాలు-కన్నూరు, కొట్టాయం, కోజికోడ్, అలప్పుజలో సాధారణ, గరిష్ట ఉష్ణోగ్రతలను సూచిస్తూ హెచ్చరిక జారీ చేసింది.    

Tags:    

Similar News