మహారాష్ట్ర ఫలితాలను మేము అంగీకరించం: ఉద్దవ్ ఠాక్రే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన ఫలితాలపై శివసేన( యూబీటీ) చీఫ్ స్పందించారు. తమ కూటమి ఘోర ఓటమిపై మాట్లాడుతూ.. ఇది మహారాష్ట్ర ప్రజల తీర్పు కాదని..

Update: 2024-11-23 07:22 GMT

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై శివసేన(యూబీటీ) వర్గం అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. ఎన్నికల ప్రచారం లో ఓటర్లు కనపరిచిన భావోద్వేగాలు ఫలితాల్లో కనిపించడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలపై తమకు అనుమానం ఉందని చెప్పారు. ఫలితాలు చూస్తే మహారాష్ట్ర ఓటర్ల ఆదేశం కాదని థాకరే పేర్కొన్నారు. ‘‘ ఎన్నికల ఫలితాలు మాకు తీవ్ర నిరాశ కలిగించాయి. ఇంత తక్కువ సీట్లు రావడం అసాధ్యం’’ అని ఉద్దవ్ అన్నారు.

సంజయ్ రౌత్..
శివసేన( ఉద్దవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల ఫలితాలు మాకు సమ్మతం కాదు. ఫలితాల్లో ఏదో తప్పు ఉంది. “(ముఖ్యమంత్రి ఏక్‌నాథ్) షిండే, ఎమ్మెల్యేలందరూ గెలుస్తారని, (ఎన్‌సీపీ నేత) అజిత్ పవార్‌కు ఇన్ని సీట్లు ఎలా వచ్చాయి’’ ఆయన ప్రశ్నించారు. “మేము దీనిని ప్రజల ఆదేశంగా అంగీకరించము. ఎన్నికల ఫలితాల్లో ఏదో తేడా ఉందన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం దిశగా పయనిస్తోంది. ఇప్పటి దాకా అందుతున్న ఫలితాల ప్రకారం ఎన్డీఏ కూటమి మెజారిటీ 190 స్థానాలకు చేరుకుంది. ఇండి కూటమి కేవలం 79  స్థానాలకే పరిమితమైంది.  ఇక్కడి అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ 141 కాగా ఎన్డీఏ అవసరమైన మార్క్ ను చేరుకుంది.  జార్ఖండ్ లో మాత్రం ఎన్డీఏ కూటమి శృంగభంగం జరిగింది. ఇక్కడ జేఎంఎం నేతృత్వంలోని కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 


Tags:    

Similar News