వైఎస్‌ షర్మిల ఇంట పెళ్లి భాజాలు

వైఎస్‌ షర్మిల ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం ఖరారైంది. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ కడప వెళ్లనున్నారు.

Update: 2024-01-02 04:41 GMT

వైఎస్‌ షర్మిల ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో వివాహం ఖరారైంది. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ కడప వెళ్లనున్నారు. కాబోయే వధూవరులతో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ను సందర్శించి ఆశీస్సులు పొందనున్నారు.

మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప బయల్దేరనున్నారు వైఎస్‌ షర్మిల కుటుంబ సభ్యులు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం కాబోయే వధూవరులతో వైఎస్సార్‌ ఘాట్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కుమారుడి వివాహ వేడుకకు సంబంధించిన తొలి ఆహ్వాన పత్రికను.. ఘాట్ వద్ద ఉంచి దివంగత వైఎస్సార్‌ ఆశీస్సులు తీసుకోనున్నారు.

ఈ నెల 18న రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహ వేడుక నిర్వహించనున్నారు. కుమారుడి వివాహ వేడుక విషయాలను ఇప్పటికే ట్విట్టర్‌ వేదికగా పంచుకున్న షర్మిల.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రార్థనల అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags:    

Similar News