తేజస్ యుద్ధ విమానాల విషయంలో ఐఏఎఫ్, హాల్ పై చేసిన ఆరోపణలు ఏంటీ?
చైనా ఆరోతరం స్టెల్త్ యుద్ద విమానాలు పరీక్షిస్తున్న సమయంలో తేజస్ దగ్గరే ఆగిపోయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్;
By : The Federal
Update: 2025-02-13 13:53 GMT
కె. గిరి ప్రకాశ్
భారత స్వదేశీ తయారీ లైట్ కంబాట్ ఎయిర్ క్రాప్ట్(ఎల్సీఏ) తేజస్ ఎంకే1ఏ ఆర్డర్లను హాల్(హెచ్ఏఎల్) సరైన సమయంలో అందించడం లేదని ఈ మధ్య వైమానికదళం చీఫ్ ఏపీ సింగ్ విమర్శలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్) విపరీతమైన జాప్యం చేస్తుందని వ్యాఖ్యానించడంతో స్వదేశీ ఫైటర్ జెట్ కార్యక్రమంలో కీలకమైన అసమర్థతలను బయటపెట్టినట్లు అయింది.
ఈ జాప్యాలు హెచ్ఏఎల్ విశ్వసనీయతపై ఆందోళనలు పెంచడమే కాకుండా దేశ రక్షణ, సేకరణ, తయారీ ప్రక్రియలలోని వ్యవస్థాగత సమస్యలను కూడా హైలైట్ చేసింది.
చైనా తాను ఆరోతరం స్టెల్త్ ఫైటర్ జెట్ ను అభివృద్ది చేసినట్లు ప్రకటించుకుంది. కానీ మన దేశం మాత్రం విమానాల ఉత్పత్తి, నాణ్యత విషయంలో సమస్యలను ఎదుర్కొంది. ఇవన్నీ వైమానిక దళ పోరాటం సామర్థ్యాన్ని క్షీణింపజేస్తున్నాయి. దాని లోపాలను బహిర్గతం చేసింది.
సంస్థాగత లోపాలు..
ఐఏఎఫ్ చీఫ్ లేవనెత్తిన అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి హాల్ సరైన సమయంలో డెలీవరీలు అందించలేకపోవడం, అసలు దానికి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందా? అనే అనుమానం కూడా పరోక్షంగా లేవదీసినట్లు అయింది.
హల్, ఐఏఎఫ్ కు ఈ సంవత్సరం ప్రారంభంలోనే 11 తేజస్ ఎంకే1ఏ విమానాలు అందిస్తామని హమీ ఇచ్చింది. అయితే తనిఖీల సమయంలో ఒక్కటి కూడా లక్ష్యానికి అనుగుణంగా లేవని ఐఎఎఫ్ అసంతృప్తి వ్యక్తం చేసింది.
హాల్ తన ఉత్పత్తి సామర్థ్యాలను అధికంగా అంచనా వేసిందని, అయినప్పటికీ తన లోపాలను అది అంగీకరించట్లేదని వాదన.
అలాగే తేజస్ కు అవసరమైన ఆయుధాలు, యుద్ద సామర్థ్యాలు లేకపోయినప్పటికీ బెంగళూర్ లోని ఏరో ఇండియా 2025 లో దాన్ని తీసుకొచ్చారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది హాల్ జవాబుదారీతనం, పారదర్శకతపై విశ్వాసాన్ని మరింత క్షీణింపజేసింది.
సరియైన చరిత్ర ఉందా?
బెంగళూర్ కేంద్రంగా ఉన్న హాల్.. తనకు వస్తున్న ఆర్ఢర్లను సకాలంలో అందించిన చరిత్ర లేదు. 2016 లో 40 తేజస్ ఆర్ఢర్లను పొందినప్పటికీ ఇప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయింది. ఇది స్వదేశీ యుద్ద విమానాల తయారీ కార్యక్రమాల దీర్ఘకాలిక స్థిరత్వం గురించి ఆందోళనలను లేవనెత్తుతోంది.
ఈ జాప్యాలు యుద్ద విమానాల తక్షణ లభ్యతపై ప్రభావం చూపడమే కాకుండా భవిష్యత్ రక్షణ ఒప్పందాలలో హల్ విశ్వసనీయను తగ్గిస్తాయి.
భారత వైమానిక దళానికి రాఫెల్ యుద్ద విమానాల ఆర్డర్ ను పొందినప్పుడూ దాని భాగస్వామిగా హల్ ను కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. అయితే అక్కడ వసతులను పరిశీలించిన దస్సాల్ట్ కంపెనీ విముఖత ప్రదర్శించింది.
ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా దాని అసమర్థతను తెలియజేసినట్లు అయింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దాని అసమర్థతకు కొనసాగింపుగా ఉన్నాయి.
హాల్ వాదన ఏంటీ?
దేశంలో అణు పరీక్షలు నిర్వహించిన 1998 తరువాత హాల్ పై అనేక ఆంక్షలు పడ్డాయని, దాని కారణంగా ‘హాల్’ ప్రాథమిక స్థాయి నుంచి నిర్మించాల్సి వచ్చిందని హాల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డీకే సునీల్ తన వాదనను వినిపించారు. మార్చి చివరి నాటికి కనీసం 11 తేజస్ ఎంకే1ఏ విమానాలను ఐఏఎఫ్ కి అందజేస్తామని హమీ ఇచ్చారు.
ఒక మాజీ సైనిక అధికారి ‘ ది ఫెడరల్’ తో మాట్లాడుతూ.. దీనిని సాంకేతిక లోపాలను సరిదిద్దడం కంటే ఎక్కువగా చూడాలని అన్నారు. ‘‘ఇది అంతర్జాతీయ పోటీదారులకు విశ్వాసం కలిగించదు. వీటిని పునరుద్దరించడం చాలా కష్టమైన పని’’ అన్నారు.
హల్ లోని అనేక నిర్మాణాత్మక, కార్యాచరణ లోపాలు దాని ప్రాజెక్ట్ లోని జాప్యాలు, నాణ్యత లేని ఉత్పత్తికి దారి తీశాయని కొంతమంది మాజీ రక్షణ అధికారులు ఫెడరల్ తో అన్నారు.
విక్రేత ఆమోదాలలో జాప్యం, అంగీకారంలో పారదర్శకత లేకపోవడం వల్ల ఉత్పత్తి ప్రక్రియను నెమ్మదిస్తుంది, అలాగే జవాబుదారీతనాన్ని తగ్గిస్తుంది.
విదేశీ సరఫరాదారులపై ఆధారపడటం
కీలకమైన భాగాలకు, ముఖ్యంగా విమాన ఇంజిన్లకు విదేశీ సరఫరాదారులపై హల్ ఆధారపడటం వలన సంస్థ సరఫరా గొలుసుల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఉదాహారణకు అమెరికా తయారీ జీఈ ఎఫ్404 ఇంజిన్లను తేజస్ కు అందించడానికి ఒప్పకుంది. కానీ గత కొంతకాలంగా వీటిని ఆ సంస్థ అందించలేకపోతోంది. ఇది తేజస్ డెలివరీలపై ప్రభావం చూపుతోంది.
ప్రయివేట్ రంగం ప్రాధాన్యం లేకపోవడం..
ప్రయివేట్ పరిశ్రమతో ఎక్కువ భాగస్వామ్యం లేకపోవడం కూడా విమానాల ఉత్పత్తి, సరఫరాలో జాప్యం జరగడానికి కారణంగా చెప్పవచ్చు.
నిర్వహణ.. నిర్మాణ సమస్యలు..
పర్యవేక్షణ కోసం ఐఏఎఫ్ అధికారులను హాల్ నియమించే పద్దతి సమర్థవంతంగా అమలుకాలేదు. ఐఏఎఫ్ ప్రమేమయం, బ్యూరో క్రాటిక్ పర్యవేక్షణ మరొక పొరగా మారకుండా కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచేలా నిర్మాణాత్మక సంస్కరణలు అవసరం.
పని సంస్కృతి.. జవాబుదారీ తనం..
హాల్ ను వేధిస్తున్న మరొక ముఖ్యమైన సంస్థ దాని శ్రామిక శక్తి. చాలా నిదానంగా పనిచేస్తున్నందు వల్ల తరుచుగా డెలీవరీలలో ఆలస్యం జరగుతోంది. అలాగే ఉత్పత్తిలో ఆలస్యం, లోపాలు, సాంకేతిక వైఫల్యాలకు జవాబుదారీ తనం లేకపోవడం కూడా దానిని వేధిస్తున్నాయి.
విమానాల అభివృద్దిలో వైఫల్యాలు..
హాల్ గత ట్రాక్ రికార్డ్ కూడా ఏ మాత్రం ఆశించినంతగా లేవు. అనేక రకాల ప్రాజెక్ట్ లను మధ్యలోనే వదిలేసింది. ఇప్పటికే లోపభూయిష్టమైన మరమ్మతులు, యుద్ద విమానాల ఇంజిన్ డిజైన్ లో నైపుణ్య లోపాలు అనేక సార్లు బయల్పడ్డాయి. ఈ వైఫల్యాలలో కొన్ని ప్రమాదాలు, మరణాలకు దారి తీశాయి.
భారత్- చైనా
తేజస్ ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటంతో వైమానిక దళ పోరాటాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా చైనా వేగంగా తన దళాలలను ఆధునీకరిస్తున్న సమయంలో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. చైనా ఆరో తరం యుద్ద విమాలను విస్తృతంగా పరీక్షిస్తున్న కాలంలో మనం ఇంకా తేజస్ దగ్గరే ఆగిపోయాం.
అలాగే ప్రస్తుతం ఐఏఎఫ్ దగ్గర ఉన్న విమానాల సామర్థ్యం కూడా తగ్గుతూ వస్తోంది. దాని దగ్గర ఉన్న ఎస్ యూ -30 ఎంకేఐ అవసరమైన సామర్థ్యం 70 శాతంతో పోలిస్తే.. అది కేవలం 55 శాతంతో మాత్రమే ఉంది. ఇది దాని యుద్ద సంసిద్దతను మరింత బలహీన పరుస్తోంది.
ఆర్థిక పరిమితులు
దేశ రక్షణ రంగంపై ఆర్థిక భారం హాల్ కు మరో సమస్యను తెచ్చి పెట్టింది. దానికి అవసరమైన నిధులు కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి.
2025-26 రక్షణ బడ్జెట్ 6,81,210 కోట్లుగా ఉంది. ఇందులో 50 శాతం వరకూ సైనికుల జీతాలు, పెన్షన్లకే పోతుంది. దీనివల్ల కొత్త విమానాల ఉత్పత్తి, ఆధునీకరణ పై మూలధన వ్యయాలు సరిపోని పరిస్థితి.
చాలావరకూ రక్షణ కొనుగోళ్లు యూఎస్ డాలర్లలో జరుగుతాయి. గత సంవత్సరం రూపాయి విలువ 4 శాతం క్షీణించడం వలన సేకరణ ఖర్చు పెరిగింది. ఆర్థిక ఒత్తిడులు తీవ్రమయ్యాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే విమానాల ఉత్పత్తికి కీలకమైన భాగాలను పొందడంలో దేశం విపరీతమైన జాప్యాలను ఎదుర్కొంటోంది.
స్వదేశీ యుద్ద జెట్ కార్యక్రమంలో నిరంతర జాప్యాలు, నాణ్యతా సమస్యలు హాల్ విస్తృత రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థలోని లోతైన నిర్మాణాత్మక అసమర్థతలను ప్రతిబింబిస్తున్నాయి. వీటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది.