అనంత్ ప్రీ వెడ్డింగ్ జాం నగర్ లోనే ఎందుకు జరుపుతున్నారు?

దేశంలోనే అత్యంత సంపన్నులైనా ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ ఏడాది జూలై 12 న జరగనుంది. అయితే, అంతకంటే ముందే

Update: 2024-03-03 14:32 GMT
Source: Twitter

వనజ మోర్ల 

దేశంలోనే అత్యంత సంపన్నులైనా ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఈ ఏడాది జూలై 12 న జరగనుంది. అయితే, అంతకంటే ముందే అనంత్, రాధికా మర్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా అత్యంత ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. మార్చి 1 న ప్రారంభమైన ప్రీ వెడ్డింగ్ వేడుకలు నేటితో ముగుస్తున్నాయి. ఈ వేడుకలకు బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్ వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, దేశంలోని పలువురు రాజకీయ నేతలు, వ్యాపార దిగ్గజాలు, సినీ ప్రముఖులు, స్టార్ క్రికెటర్లు హాజరయ్యారు. మూడు రోజుల నుండి నిర్వహిస్తున్న ప్రీ వెడ్డింగ్ వేడుకలకి గుజరాత్ లోని జాంనగర్ వేదిక అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా జాంనగర్ వార్తల్లో నిలిచింది.



అంబానీ ఫ్యామిలీ అనంత్, రాధిక ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు జాంనగర్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అనే ఆసక్తి నెలకొంది. జాంనగర్ లో తన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుపుకోవాలని వరుడు అనంత్ కోరుకున్నారు. ఆయన ఇష్టప్రకారమే అంబానీ ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జాంనగర్ ని తీర్చిదిద్దింది. గతేడాది నవంబర్ లో ప్రధాని మోదీ మన్ కీ బాత్ రేడియో ప్రసంగంలో 'విదేశాలలో వివాహాలను చేసుకునే బడా కుటుంబాల ధోరణి కలవరపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వివాహ వేడుకలకు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు.. మన భారత్‌లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో హుందాగా చేసుకోండని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాదు మేక్‌ ఇన్‌ ఇండియా మాదిరిగా వెడ్‌ ఇన్‌ ఇండియా అనే ఉద్యమం కూడా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ మాటలను ప్రేరణగా తీసుకుని తన ప్రీ వెడ్డింగ్ తన గ్రాండ్ మదర్ పుట్టిన గ్రామం జాంనగర్ లో చేసుకోవాలని అనంత్ భావించారట. తన బాల్యంలో చాలా రోజులు ఇక్కడే గడిపానని, ఇక్కడ తనకి ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు.



అంతేకాదు తన నాన్ ప్రాఫిట్ డ్రీమ్ ప్రాజెక్ట్ వంతారా కూడా జాంనగర్ లోనే 3,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. గాయపడిన, అడవుల నుంచి తప్పించుకుని బయటకి వచ్చిన జంతువులను రెస్క్యూ చేసి వంతారా లో చికిత్స అందించి రక్షణ కల్పిస్తారు. నా చిన్ననాటి నుండి నేను జంతువులను జాగ్రత్తగా చూసుకుంటున్నాను, ఎందుకంటే నోరు లేని జంతువులకు సహాయం చేసే వారికి ప్రతిఫలంగా గొప్ప ఆశీర్వాదం లభిస్తుందని నా తల్లిదండ్రులు నాకు చెప్పారు. శ్రీరాముడు ఒక చిన్న ఉడుతను ప్రేమగా నిమిరితే.. అది తిరిగి ఆయనకి రామసేతు నిర్మించడానికి సహాయం చేసింది. మూగజీవాలను ప్రేమిస్తే తిరిగి మనకి భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతాను" అందుకే వన్యప్రాణులకి సేవ చేయడం తనకి సంతోషాన్ని ఇస్తుందని అనంత్ చెప్పారు.



వంతారా లో స్వయంగా అనంత్ అంబానీ కోటి పైగా మొక్కలు నాటారు. ఇప్పుడు అదంతా ఒక అడవిలా మారిపోయింది. వన్య జీవులు జూ లో బంధించి ఉన్నట్టు కాకుండా సహజ సిద్ధమైన ప్రకృతిలో స్వేచ్ఛగా జీవిస్తున్నట్టు ఫీల్ అవ్వాలనేది ఆయన ఆలోచన. ఆయన ఆలోచనలకు తగ్గట్టే వంతారా ని చెరువులతో, పెద్ద పెద్ద చెట్లతో సహజ సిద్ధమైన అడవిలా సృష్టించారు. ప్రీ వెడ్డింగ్ వేడుకలకు వచ్చిన వారు కూడా వైల్డ్ వాక్ ఈవెంట్ ద్వారా ఈ వైబ్ ని ఫీల్ అవ్వనున్నారు.




కాగా, దాదాపు 1200 మంది అతిథులు హాజరయ్యారు. నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్టిస్టులతో ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల వేడుకల్లో అతిథులకు 21 మంది ఫేమస్ షెఫ్ లు వండిన 2,500 రకాల వంటకాలు వడ్డించారు. థాయ్, మెక్సికన్, జపనీస్, పార్శి వంటకాలు మెనూలో ఉన్నాయి. దాదాపు రూ.1000 వెయ్యి కోట్లు ముందస్తు పెళ్లి వేడుకలకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News