ఎఫ్-35 ఆఫర్, భారత్ కు ట్రిలియన్ డాలర్ల సమస్యగా మారుతుందా?

ఎఫ్ 35 పై అప్పట్లోనే ట్రంప్, మస్క్ విమర్శలు;

Update: 2025-02-17 07:24 GMT

అమెరికాకు చెందిన ఎఫ్-35 అనే అత్యంత ఆధునిక స్టెల్త్ ఫైటర్ ను విక్రయించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఆఫర్ ను భారత్ కు ఇచ్చారు. ఇంతకుముందు ఇజ్రాయెల్, జపాన్ వంటి దేశాలకు మాత్రమే వాటిని విక్రయించారు. ఇప్పుడు వాటిని న్యూఢిల్లీకి ఇవ్వడానికి వాషింగ్టన్ తన సమ్మతిని తెలియజేసింది.

విశ్లేషకులు మాత్రం ఎఫ్-35 కొనుగోలు చేస్తే భారత్ దీర్ఘకాలం పాటు ఆర్థిక భారం మోయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దాని నిర్వహణ ఖర్చులు భారీగా ఉంటుందని, విడి భాగాలలో అమెరికా చెప్పిన ధర ఉంటుందని అంటున్నారు. 2015 లో దీనిని అమెరికా తన దళంలోకి ప్రవేశపెట్టింది. ఇది స్టెల్త్ కు చెందిన ఐదోతరం విమానం. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది.
పెరుగుతున్న ధర
2024 ప్రభుత్వ జవాబుదారీతనం కార్యాలయం(జీఏఓ) నివేదిక ప్రకారం.. జెట్ ఫైటర్ జీవిత కాల నిర్వహణ ఖర్చులు 2023 నాటికి 1.58 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగినట్లు నివేదికలు తెలిపాయి.
పెరుగుతున్న ఖర్చులతో పాటు, ఎఫ్-35 దాని సంక్లిష్టమైన సాప్ట్ వేర్ కారణంగా పనితీరు సమస్యలు, విశ్వసనీయత ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానం ఉన్న అవసరాల కంటే అతిగా రూపొందించడిందని, దీని ఖరీదు మరో సమస్యగా మారిందని వాదిస్తున్నారు.
ట్రంప్, మస్క్ విమర్శలు..
ఎఫ్ -35 పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇలాన్ మస్క్ కూడా విమర్శించారు. 2016 లో ట్రంప్ ఎఫ్-35 కార్యక్రమం ఖర్చు నియంత్రణలో లేదని ఎక్స్ లో విమర్శలు గుప్పించారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాతే ఖర్చులను అదుపు చేస్తామని హమీ ఇచ్చారు.
అదే సమయంలో మస్క్ దీనినిపై కూడా విమర్శలు గుప్పించారు. ‘‘ఖరీదైన, సంక్లిష్టమైన జాక్ ఆఫ్ వాల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్’’ గా అభివర్ణించారు. డ్రోన్ ల యుగంలో మానవ సహిత యుద్ద విమానాల ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ.. ‘‘డ్రోన్ ల యుగంలో మానవ సహిత యుద్ద విమానాలు ఏమైనప్పటికీ వాడుకలో లేవు, ఇవి పైలెట్ లను చంపేస్తాయి’’ అని ట్వీట్ చేశారు.
ఈ 25 టన్నుల స్టెల్త్ యుద్ద విమానం అది పరిష్కరించాల్సిన ఓ సమస్యగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. కాబట్టి భారత్ ఈ యుద్ద విమానం వేరియంట్లను కొనుగోలు చేస్తే అది అది తడిపిమోపేడవుతుందని హెచ్చరిస్తున్నారు.
అనుకున్న టైమ్ కు వస్తాయా?
అమెరికా సంస్థ 2024 నివేదిక ప్రకారం.. ఎఫ్ 35 లోని మూడు వేరియంట్లలో అనుకున్నంత సంఖ్యలో లభ్యత లేదని నివేదిక తెలిపింది. తయారీలో విపరీతమైన జాప్యాలు ఉన్నాయి.
గత ఐదు సంవత్సరాలలో మొత్తం విమానాల లభ్యత తగ్గింది. అందుకే కార్యక్రమంపై ప్రశ్నలు తలెత్తున్నాయి. అలాగే అమెరికా తేజస్ కార్యక్రమానికి సప్లై చేస్తానని చెప్పిన జీఈ- 404 ఇంజన్లను సకాలంలో సప్లై చేయలేకపోతోంది.
దీనివల్ల భారత వైమానిక దళానికి తేజస్ యుద్ధ విమానాలను సప్లై చేయలేకపోతోంది. దీనిపై ఎయిర్ చీఫ్ మార్షల్ అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా.
ఆధునీకరణ అడ్డంకులు
ఎఫ్ -35 లో మెరుగైన రాడార్, ఆయుధ వ్యవస్థలు, సాప్ట్వేర్ లో విమానాన్ని అప్ గ్రేడ్ చేయడానికి రూ. 16. 5 బిలియన్ డాలర్ల కేటాయించారని అన్నారు. అయితే సాప్ట్వేర్ సమస్యల కారణంగా గణనీయంగా ఆలస్యం అయిందని జీఏఓ పేర్కొంది.
అలాగే ఇంజన్ సామర్థ్యం, థర్మల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ లను పెంచడానికి చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. అందువల్ల ఈ ఫ్లైట్ గాలిలో ఎగిరే సమయంలో వేడేక్కెతోందని నిపుణులు సూచించారు.
ఈ ఎఫ్ -35 కార్యక్రమాన్ని ఇంకా మెరుగుపరచడానికి జీఏఓ 43 సిఫార్సులను చేసిందని కానీ అమెరికా రక్షణ శాఖ వాటిలో ఇంకా 30 అంశాలను అమలు చేయలేదని, ఇది మెరుగుదల, ఖర్చుల సమస్యలను అధికం చేసింది. ఇది హైటెక్ సెన్సర్లతో ఉన్నప్పటికీ నిర్వహణ భారీగా అవసరమయ్యేది. నమ్మదగనినది కూడా.
క్రాష్ అయిన సంఘటనలు..
ఎఫ్- 35 కూడా నమ్మదగినది కాదని అనిపిస్తుంది. ఇటీవల అలాస్కాలో ఒక ఎఫ్ -35 పైలెట్ ఇంజిన్ ను సరిగా పనిచేయకపోవడం విమానం కూలిపోతున్నట్లు గమనించి పైలెట్ ఎజెక్ట్ అయ్యాడు.
అలాగే గత ఏడాది మేలో న్యూ మెక్సికో ఒక పైలెట్ అల్బుకెర్కీ విమానాశ్రయం సమీపంలో జరగిన ప్రమాదంలో ఓ పైలెట్ గాయపడ్డారు. అలాగే 2023 సెప్టెంబర్ లో కూడా ఇలాగే మరో పైలెట్ సౌత్ కరోలినా ప్రయాణిస్తుండగా, సాంకేతిక సమస్యల కారణంగా బలవంతంగా ఎజెక్ట్ అయ్యాడు. ఇది కొన్ని నిమిషాలు మానవరహితంగా ప్రయాణించి ఆపై పొలంలో కూలిపోయింది.
నిర్వహణ ఖర్చులు..
దీని ధర తరువాత ముఖ్యమైన సమస్య నిర్వహణ ఖర్చులు. 2018 లో 1.1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2023 వరకూ 1.58 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది భారత్ వంటి దేశాలకు పెనుభారం కాగలదు.
ఇదేమీ తక్కువ ధర కలిగిన విమానం కాకపోవడం మరో భారంగా మారనుందని తేలింది. దీనిని తయారీదారులు ఫెరారీ అంటారు. మద్దతుదారులు ఎఫ్ - 35, లేదా బీ - 21 సాప్ట్ వేర్, ఎలక్ట్రానిక్స్ కారణంగా ఖరీదైనది. పైలెట్ స్వయంగా కాదని, డ్రోన్లు వాటిని భర్తీ చేయలేవని చెబుతున్నారు. డ్రోన్ ల ఎఫ్ - 35 లాగా ఖరీదైన ఎలక్ట్రానిక్స్ ను పొందవలసి ఉంటుంది. ఇది ఖరీదైనది.
చివరిగా ఎఫ్ -35 అత్యాధునిక యుద్ద విమానం అనడంలో సందేహం లేదు. కానీ దాని నిర్వహణ, కార్యాచరణ డిమాండ్లు గణనీయమైన సవాళ్లను కలిగిస్తాయి. ఈ కార్యక్రమం దాని జీవితకాలంలో రెండు ట్రిలియన్ల ఖర్చులను కారణమవుతుందని అంచనాలు ఉన్నాయి. ట్రంప్ ఆఫర్ ను స్వీకరించే ముందు భారత్ బహుశా బాగా ఆలోచించాలి.
Tags:    

Similar News