ఓటమితో ‘ఇండియా’ కూటమి మీద కాంగ్రెస్ కు శ్రద్ధ తగ్గిందా?
మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత కాంగ్రెస్ కోలుకునేందుకు ప్రయత్నం చేస్తాఉంది. అయితే, ‘ఇండియా’ కూటమిని నిర్లక్ష్యం చేస్తున్నదనే విమర్శని ఎదుర్కొంటున్నది
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైంది. ఓటమి క్రుంగ దీయకుండా ఉండేందుకు కాంగ్రెస్ చాలా పనులు చేస్తూ ఉంది. లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక చేసేందుకు అనేక రాష్ట్రాలకు కమిటీలను నియమించింది. రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్ర నిర్వహించి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపబోతున్నారు. అయితే, ఇంత ఆసక్తి ఇండియా కూటమిని బలపర్చేందుకు చూపడం లేదని మిత్రపక్షాలు నిరుత్సాహపడుతున్నాయి.
జోరుగా కమిటీల నియామకం..
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఐదు వేర్వేరు కమిటీలను శుక్రవారం (జనవరి 5) ప్రకటించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఐదు క్లస్టర్‌లుగా విభజించి ఒక చైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులను నియమించింది.
ఎంపీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఓటమిని దృష్టిలో ఉంచుకుని కొత్త వ్యూహాలతో పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొత్త నియామకాలు చేపట్టారు. ఎన్నికలకు సమాయత్తం కావడంపై చర్చలు పార్టీ అగ్రనేతలతో చర్చలు జరుపుతున్నారు.
స్క్రీనింగ్ కమిటీల్లో ముగ్గురికి స్థానం కల్పించారు. పార్టీ ముఖ్య నేతలు రజనీ పాటిల్, భక్త చరణ్ దాస్, హరీష్ చౌదరికి బాధ్యతలు అప్పగించారు. ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ సమయంలో వీరిని రాష్ట్ర ఇన్‌చార్జ్‌ల పదవుల నుంచి ఖర్గే తొలగించి కొత్త పదవులు అప్పగించారు.
జమ్మూ కాశ్మీర్‌కు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిన పాటిల్ ఇప్పుడు గుజరాత్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, డామన్,డయ్యూ మరియు దాద్రా నగర్, హవేలీలకు లోక్‌సభ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీకి అధ్యక్షుడిగా నియమించారు.
బీహార్, మణిపూర్, మిజోరంలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాజీ కేంద్ర మంత్రి దాస్‌ను జమ్మూ కాశ్మీర్, లడఖ్, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించారు.
పంజాబ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ చౌదరిని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి స్క్రీనింగ్ కమిటీకి నేతృత్వం వహిస్తారు.
‘‘కేవలం రెండు వారాల క్రితం వ్యక్తిగత రాష్ట్రాలలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడానికి అనర్హులుగా పేర్కొన్న వారిని ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కోసం నియమించారు’’ అని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ ఒకరు ఫెడరల్‌తో అన్నారు. స్క్రీనింగ్ కమిటీలకు నాయకత్వం వహించేందుకు దాస్, చౌదరి ఎంపిక ఆసక్తి కలిగిస్తోందని పార్టీ సభ్యుడు ఒకరు తెలిపారు.
చైర్మన్‌గా మధుసూదన్ మిస్త్రీ..
ఆంధప్రదేశ్, అండమాన్, నికోబార్, మహారాష్ట్ర, గోవా ఒడిశా క్లస్టర్‌లకు స్క్రీనింగ్ ప్యానెల్ చైర్మన్‌గా మధుసూదన్ మిస్త్రీని పార్టీ ఎంపిక చేసింది.
కాంగ్రెస్‌పై ఆగ్రహం..
అభ్యర్థుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీలను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు ఆలస్యం అవుతోన్న నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టడం కూటమిలో విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే, ఇంత శ్రద్ధ వచ్చే ఎన్నికల్లో బిజెపిని, మోదీని ఓడించాలనే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఇండియా కూటమిటిని పటిష్టపరుచుకోవడం మీద లేదే అంటున్నాయి ఇండియా భాగస్వామ్య పార్టీలు. రాష్ట్రాలలో తొందరగా సీట్ల భాగస్వామ్యం మీద నిర్ణయాలను తీసుకోవాలని ఈ పార్టీ కాంగ్రెస్ ను కోరుతున్నాయి. అయితే, కాంగ్రె స్ పార్టీలో అశించిన చలనం లేదు.
ఈ ధోరణి మీద మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), బీహార్ సీఎం నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గం నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ జాప్యం మిత్రపక్షాల మధ్య బహిరంగ విభేదాలకు కారణమైంది.
‘‘ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్టీ సెప్టెంబర్ తర్వాత అన్ని చర్చలను నిలిపివేసింది. అందుకే సీట్ల సర్దుబాటుపై ఆలస్యం అవుతుంది’’ అని సీనియర్ నేత ఒకరు తెలిపారు.
ఈ విషయం మీద ఒక కమిటీని వేసినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, రెండుగంటలకు పైగా సమావేశమయినా ఈ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకు పోయింది. అది ఇండియా పార్టీలను బాధిస్తూ ఉంది.
రాహుల్ యాత్రపై ఆశలు..
రాహుల్ గాంధీ చేయబోయే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ పార్టీ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇటీవల బిజెపి హిందీ భాష మాట్లాడే రాష్ట్రాల్లో విజయం సాధించినప్పటి నుంచి వారు నిరుత్సాహానికి గురవుతున్నారు. తిరిగి పార్టీ కార్యకర్తలో జోష్ నింపేదిశగా పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.