భారత విదేశాంగ విధానం చైనా వైపు తిరుగుతున్నదా?

వాషింగ్టన్ తీరుతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విసిగిపోయిందా..!

Update: 2024-12-19 07:13 GMT

భారత విదేశాంగ విధానం క్రమంగా మరో రూపుసంతరించుకుంటోంది. ఇన్నాళ్లు యూఎస్ ఆధారిత పాశ్చాత్య కూటమిలో చాలా ఉత్సుకతగా పాల్గొన్న న్యూఢిల్లీ ఇప్పుడు క్రమంగా పొరుగుదేశం చైనాను స్నేహ పూర్వక దృష్టితో చూస్తోంది.

ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేయడం, పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీ లంచం ఇచ్చి ప్రాజెక్ట్ లను దక్కించుకోవడం వంటి ఆరోపణలు భారత్ పై అమెరికా నేరుగా చేయడం, ప్రాసిక్యూషన్ మొదలు పెట్టడంతో న్యూఢిల్లీ తీవ్రంగా ఇబ్బందిపడింది. ఈ రెండు విషయాలు పశ్చిమ దేశాలతో స్నేహం విషయంలో కఠినమైనదిగా మోదీకీ అనుభవ పూర్వకంగా తెలిసొచ్చిందనే చెప్పాలి.
చైనాతో స్నేహపూర్వకంగా..
యూఎస్ తో వస్తున్న చిక్కులను ఎదుర్కోవడానికి భారత్ ఇప్పుడు చైనాతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇటీవల కాలంలో భారత్ - చైనా సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ స్నేహం ఎలా ఉందంటే... యూఎస్, కెనడాతో ఏర్పడిన ఘర్షణతో సమానంగా ఉండేలా కనిపిస్తోంది.
నిజానికి గాల్వాన్ ఘర్షణ జరిగి నాలుగు సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి మొన్నటి వరకూ పాతిక సార్లకు పైగా ఇరు దేశాల సైనిక అధికారుల ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. తరువాత దౌత్య స్థాయిలో కూడా ఇలాగే చర్చలు జరిగాయి. ఈ పరిణామాలతో లఢక్, దెప్సాంగ్, డెమ్ చోక్ వంటి సున్నిత ప్రాంతాలలో ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి తీసుకున్నాయి.
రెండు దేశాల మధ్య స్నేహ బంధాలు ప్రస్తుతం బాగున్నాయని చెప్పడానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. ప్రస్తుత మన భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ బీజింగ్ లో పర్యటిస్తున్నారు. దీర్ఘకాలంలో పెండింగ్ లో ఉన్న సరిహద్దు సమస్యను చర్చించేందుకు వెళ్లిన ప్రత్యేక ప్రతినిధులతో పాటు ఆయన చర్చలో పాల్గొంటారని ప్రభుత్వం వెల్లడించింది. ఐదు సుదీర్ఘ సంవత్సరాల తర్వాత రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధుల సమావేశం విజయవంతంగా జరిగింది.
కెనడాతో వైరం
అంతర్జాతీయ రంగంలో ఎవరూ ఎవరికి స్నేహితుడో చెప్పడం చాలా కష్టం. అదే విధంగా భారత్ కు కూడా ఇదే సూత్రం వర్తింస్తుందనే చెప్పాలి. ఇదే సమయంలో కొన్ని దేశాలు చేస్తున్న ఆరోపణలకు భారత్ ప్రత్యేకంగా స్పందించాల్సి వచ్చింది.
కెనడాలో 2023లో ఖలిస్తానీ కార్యకర్త హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన మొదటి ఉదాహరణను తీసుకోండి. గత ఏడాది సెప్టెంబరులో, ఈ హత్యలో భారతదేశం ప్రమేయం ఉందని ఆరోపించిన తరువాత న్యూఢిల్లీ- అట్టావా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ప్రధాని ఏకంగా పార్లమెంట్ లో భారత్ పై ఆరోపణల చేశారు. వీటిలో కొన్ని ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
తరువాత కొన్ని రోజులకే వాషింగ్టన్ కూడా తెరపైకి వచ్చింది. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న సిఖ్ ఫర్ జస్టిస్ ఉగ్రవాద సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హత్య చేయడానికి భారత ‘ రా’ అధికారి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ మొదలు పెట్టింది.
స్నేహితుడిగా యూఎస్ విఫలమయ్యిందా?
అమెరికాతో స్నేహం కొన్ని ఆరోపణలను దాచేస్తుందని మోదీ ప్రభుత్వం లెక్కలు వేసింది. కానీ ఇందుకు విరుద్దంగా అమెరికా నేతృత్వంలోని ఆంగ్లో సాక్సన్ కూటమి పెట్టుకున్న ఫైవ్ ఐస్ కూటమి భారత్ పై పలు విషయాలను బయట పెట్టడంతో న్యూఢిల్లీ అధికారులు ఉలిక్కిపడ్డారు.
నిజ్జర్ హత్య కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తరువాత ప్రధాని నరేంద్ర మోదీ పేరును సైతం అందులోకి లాగింది కెనడా. ఆయన ఆదేశంతోనే ఇవన్నీ జరిగాయని దాని ఆరోపణ. అయితే న్యూఢిల్లీ వీటికి ఖండించింది.
ఇది సద్దుమణిగిందని అనుకునే లోపు యూఎస్ లోని ఓ డిస్ట్రిక్ కోర్టు భారత టాప్ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదాని పై లంచం ఆరోపణలు చేసింది. దేశంలో పవర్ ప్రాజెక్ట్ లు సాధించడానికి 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చారని దాని అభియోగం. ఆదాని గ్రూపులోని ఏడుగురు అధికారులపై కేసు పెట్టారు. ఇది కూడా మోదీ అసంతృప్తికి ఓ కారణంగా చెప్పవచ్చు.
దేనీకి ఇది నాందీగా చెప్పాలి?
మోదీ కాలంలో భారత్ - యూఎస్ఏ మధ్య సంబంధాలు పెనవేసుకున్నట్లు కనిపించినా అవి న్యూఢిల్లీకి పెద్దగా సాయం చేయలేదనే చెప్పాలి. ఈ తీరుతో విసిగిపోయిన మోదీ ఇక లాభం లేదనుకుని చైనా వైపు చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా, వాషింగ్టన్ - బీజింగ్ మధ్య పోటీ పెరుగుతోంది. దీనిని కట్టడి చేయడానికి వైట్ హౌజ్ ప్రణాళిలు రచించింది.
ఆసియా ప్రాంతంలో చైనీస్ ఆధిపత్యాన్ని సవాలు చేసే పాత్ర కోసం మాత్రమే భారత్ ను అమెరికా ఉపయోగించుకుంటోంది. ఆ వ్యూహంలో భాగంగానే క్వాడ్ అనే ఓ కూటమిని ట్రంప్ కాలంలో ఏర్పాటు చేశారు. అయితే బైడెన్ కాలంలో దీన్ని కాదని ఆకస్ కూటమిని ఏర్పాటు చేసుకుని దాని ప్రాధాన్యతను తగ్గించారు.
ఇదే సమయంలో భారత్ కూడా అమెరికా ఆరోపణలకు ఎదురుదాడులకు దిగింది. అధికార బీజేపీ సోరోస్ గ్యాంగ్ పై అంటూ కాంగ్రెస్ దాని కూటమిపై ఆరోపణలు గుప్పించింది. సోరోస్ గ్యాంగు భారత రాజకీయాల్లో వేలుపెడుతుందని, ఓ కీలు బొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కుట్ర పన్నుతారని, ఆ వ్యూహానికి రాహుల్ గాంధీని ఉపయోగించుకుంటున్నారని లోక్ సభ లో బీజేపీ సీనియర్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
స్నేహితుడి నుంచి శత్రువు వరకు..
నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకత్వంతో అమెరికాలోని డీప్ స్టేట్ సంబంధాలు పెట్టుకుందని కొన్ని నెలల నుంచి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ డీప్ స్టేట్ రెజీమ్ ఛేంజ్ పాలసీని అమలుచేస్తున్నాయని, ప్రజా ఉద్యమాల పేరుతో ప్రజా ప్రభుత్వాలను కూలదోస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం అమెరికా స్నేహితుడి నుంచి విలన్‌గా మారిందని, న్యూఢిల్లీ - వాషింగ్టన్ మధ్య సంబంధాలు కొత్త స్థాయికి చేరుకున్నాయని తాజా సమాచారం. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, అధికార బిజెపి ఇలాంటి ఆరోపణలు చేయడం పట్ల "నిరాశ" వ్యక్తం చేసింది.
చైనాతో అమెరికా పోటీ పడుతున్న నేపథ్యంలో వాషింగ్టన్‌కు న్యూఢిల్లీ అనివార్యమని భారత విదేశాంగ విధాన స్థాపన లెక్కగట్టాయి. అయితే ప్రస్తుత పరిణామాలు ఇది వాస్తవం కాదని తేల్చాయి. వాషింగ్టన్ తో ఏర్పడిన విభేదాలను పరిష్కరించడానికి ఇప్పుడు బీజింగ్ తో స్నేహ హస్తం చాచిందని అర్థమవుతోంది.
భారత్ - చైనా కొత్తగా సంబంధాలు...
ఇన్నాళ్లుగా భారత్ - చైనా మధ్య ఉన్నది కేవలం అవకాశావాద కూటమనే చెప్పాలి. చైనా, భారత్ తో వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్వాడ్ లో చేరుతుంది. అమెరికా భారత్ తో మొండిగా వ్యవహరిస్తే చైనాతో చెలిమి చేస్తుంది. తార్కికంగా ఆలోచిస్తే భారత్ చైనాతో విభేదాలను తగ్గించుకుంటే, క్వాడ్‌పై ఆధారపడటం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ప్రత్యేకించి వాషింగ్టన్ ను సంతృప్తి పరచడానికి దాని ఇష్టానికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ వ్యవహరించాల్సిన అవసరం లేదు.
ప్రస్తుత పరిణామాలతో వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్ పింగ్ వ్యూహాత్మక సంబంధాలు నెరుపుతున్నారు. అయితే చైనాతో భారత స్నేహం ప్రమాదకరంగా మారకపోవచ్చు. ఏదైన అనుకోని ఉపద్రవం ఎదురైతే మాస్కో, న్యూఢిల్లీకి తగిన సాయం చేయవచ్చు.
చైనాతో స్నేహం అమెరికా ఎలా చూస్తుంది..
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా న్యూఢిల్లీ విదేశాంగ విధానాన్ని మార్చడం ప్రమాదాలతో కూడుకున్నది. యుఎస్, దాని పాశ్చాత్య మిత్రదేశాలు న్యూ ఢిల్లీతో వారి సంబంధంలో లోతుగా పాతుకుపోయాయి. ఇది రాజకీయాలకు అతీతంగా విద్యా, వలసలు, సాంకేతిక ఎగుమతి వంటి అంశాలతో ఉంది. కెనడాతో ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఆ దేశం చదువులు, ఇమ్మిగ్రేషన్, ఉపాధి వంటి అంశాలపై ఆంక్షలు విధించింది.
ట్రంప్ సమీకరణాన్ని మారుస్తారా?
న్యూ ఢిల్లీ... వాషింగ్టన్, అట్టావా వంటి పాశ్చాత్య దేశాల వైఖరితో విసిగిపోయింది. చైనాతో స్నేహం చేయడం కూడా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు ఆచరణాత్మక ప్రతిస్పందన. ఇద్దరు పొరుగువారి మధ్య ఇలాంటి మాటాముచ్చట అవసరం.
జనవరి 20 న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఏ పరిణామాన్ని అయినా రాత్రికి రాత్రి మార్చగల సమర్థుడే. ఆయన ఇప్పటికే కెనడాను తమ దేశంలో 51 వ రాష్ట్రంగా మారామని సలహ కూడా ఇచ్చేశారు. మరీ మోదీ ఎలా సంబంధాలు నెరుపుతాడో చూడాలి.
ట్రంప్ ఒక కఠినమైన పెట్టుబడిదారీ. అతను మోదీ ప్రభుత్వానికి ఏదైనా విధంగా సాయం చేస్తే, చేసిన సాయాల కోసం, బీజింగ్‌తో తన సంబంధాలను డౌన్‌గ్రేడ్ చేయమని ట్రంప్ కూడా న్యూఢిల్లీని బలవంతం చేస్తాడు. అది జరిగితే, మోదీ మాండరీన్ బంధం మరోసారి బిగుసుకుపోతుంది.
Tags:    

Similar News