బెట్టింగ్ యాప్ లు ఐపీఎల్ పై ఎలా ప్రభావం చూపుతున్నాయి?
సెలబ్రేటీలు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్ లు;
(అనువాదం.. చెప్యాల ప్రవీణ్)
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఐపీఎల్ వైపే చూస్తోంది. భారత్ లో దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ ఐపీఎల్ మ్యాచ్ లు చూస్తూనే ఉంటారు.
ఈ సందర్భంగా దేశానికి ఒక ఆన్ లైన్ గేమింగ్ భూతం పట్టుకుంది. దీనికి సెలబ్రేటిలే బ్రాండ్ అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు.
ఐపీఎల్ - 2024 లో స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారమైన 51 మ్యాచ్ లను వీక్షించిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో 510 మిలియన్లకు చేరింది. ఇది 2019 నాటి సంఖ్యతో పోలిస్తే 5 శాతం పెరుగుదల, మొత్తం వీక్షించిన వారి పెరుగుదలలో 18 శాతం పెరిగింది.
67 మ్యాచ్ లకు మొత్తం టీవీ వీక్షకుల సంఖ్య 546 మిలియన్లకు చేరుకోగా, జియో సినిమా 620 మిలియన్లకు పైగా వీక్షకులతో స్ట్రీమింగ్ రికార్డ్ సృష్టించింది.
మార్చి 23న జరిగిన ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ 163 మిలియన్ల మంది చూశారు. ప్రారంభ సమయం, పైగా వారాంతంలో టీవీ, డిజిటల్ లో మొత్తం ఐదువేల కోట్ల నిమిషాలు వీక్షించబడ్డాయి.
ఇది టీవీ వీక్షణ, కిక్కిరిసిన నిండిపోయిన స్టేడియంలకు మాత్రమే పరిమితం కాలేదు. మెల్లగా గేమింగ్, బెట్టింగ్ ప్రపంచంలోని జారిపోయింది. గేమింగ్ అంటే సాధారణంగా స్మార్ట్ ఫోన్ వంటి వాటిల్లో వివిధ వ్యక్తులతో కలిసి గేమింగ్ కార్యకలాపాలు వైపు సాగిపోతోంది.
ఫాంటసీ గేమింగ్ అంతరాయం..
ఐపీఎల్ ఆదాయం, ఆర్థికపరంగా పెరుగుతోంది. ప్రస్తుతం నడుస్తున్న 18 ఎడిషన్ సీజన్ కోసం అధికారిక ప్రసార సంస్థ అయిన జియో స్టార్ రూ. 4500 కోట్ల ఆదాయం లక్ష్యం నిర్ధేశించుకుంది. గత సంవత్సరం టీవీ, డిజిటల్, ప్లాట్ ఫారమ్ లలో సంపాదించిన 4 వేల కంటే ఎక్కువ. దీనితో సెలబ్రిటిల ఆసక్తి పెరిగింది.
మార్చి 21న భారత ఆల్ రౌండర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి, బెట్టింగ్ కంపెనీ స్టేక్ ను ఎక్స్ లో ప్రమోట్ చేశారు. తనకున్న రెండు మిలియన్ల ఫాలోవర్లకు ‘‘అల్టిమేట్ క్రికెట్ ఎక్స్ ట్రావాగాంజాకు సాక్షిగా నిలబడండి.
ప్రారంభంలో సిక్స్.. వికెట్? మీరు ఎటువైపు? స్టేక్ ’’ అని రాసుకొచ్చారు. అయితే పోస్ట్ లో ఒక డిస్ క్లెయిమర్ ఉంది. ఇది భారత్ లో ఉన్న వాళ్ల కోసం మాత్రం కాదు అని ఉంది.
అతి పెద్ద విషయం..
శాస్త్రి, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్, భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ సినీ నటుడు ఇమ్రాన్ హష్మీ వంటి వారు చేస్తున్నదేమిటంటే.. అక్రమ బెట్టింగ్ సైట్ లను ప్రొత్సహించడం, గేమింగ్, ఫాంటసీ గేమింగ్ కంపెనీల మధ్యరేఖను అస్ఫష్టంగా విభజిస్తున్నారు.
ఇండియాస్ ఫాంటసీ(హష్మీ ప్రమోట్ చేస్తున్నది)వంటి చాలా అక్రమ బెట్టింగ్, జూదం కంపెనీలు క్యాబ్ లపై ప్రకటనలు చేస్తున్నాయి. మెట్రో కంపార్ట్ మెంట్లలో ఫన్ 88 ప్రమోషన్లలో డేల్ స్టెయిన్ కనిపిస్తున్నాడు. కార్నివాల్ అనే సైట్ లో 1xBAT కోసం శిఖర్ ధావన్ కనిపిస్తారు.
ఇది నిజంగా దేశం వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అక్రమ బెట్టింగ్ సైట్ లకు ఒక ఉత్సవం లాంటిది. భారతీయ క్రికెటర్లు, సినీ తారలను ఉపయోగించి ఫాంటసీ గేమింగ్ ల్యాండ్ స్కేప్ ను దెబ్బతీస్తున్నాయి.
ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది..
ఇవి వినియోగదారుల గందరగోళాన్ని మరింత పెంచుతాయి. చట్టబద్దమైన, చట్టవిరుద్దమైన వాటి మధ్య రేఖలను అస్పష్టం చేస్తాయి. భారతీయ క్యాబ్ లు, మెట్రోలను ప్రకటనలకు విశ్వసనీయమైన మార్గాలుగా పరిగణిస్తారు.
అక్రమ బెట్టింగ్ సైట్ లో ఒక నిర్ధిష్ట ఉత్పత్తిని విక్రయించే ప్రముఖ వ్యక్తి లేదా సెలబ్రిటీ కనిపించిన క్షణం, అభిమానులు ఆకర్షితులవుతారు. వాస్తవానికి ఫన్88 మెట్రో లోపల ప్రకటన బోర్డులో క్యూఆర్ కోడ్ ను కలిగి ఉంటుంది. ఇది తక్షణమే యాక్సెస్ ను అందిస్తుంది.
ఆన్ లైన్ బెట్టింగ్, జూదం సైట్ లను అరికట్టడానికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది. ఇటీవలే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అటువంటి సైట్ లకు వ్యతిరేకంగా 1410 నిరోధిత ఆదేశాలను జారీ చేసిందని తెలిపారు.
ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమను నియంత్రించడానికి ప్రభుత్వ చర్యలు బహుముఖ విధానాన్ని ప్రతిబింబిస్తాయని మంత్రి అన్నారు. చట్టపరమైన చట్రానికి వెలుపల పనిచేసే ప్లాట్ ఫాం లక్ష్యంగా చేసుకుని వెబ్ సైట్ లు, అప్లికేషన్ బ్లాక్ చేయడం వ్యూహంలో కీలకమైన భాగం. అదే పని కేంద్రం చేస్తోంది.
చట్టవిరుద్దమైన గేమింగ్ ప్లాట్ ఫామ్ దేశ వినియోగదారుల ప్రయోజనాలకు గణనీయంగా ముప్పును కలిగిస్తున్నాయి. వేలాది కోట్లను ఇవి దోచుకుని వెళ్తున్నాయి. ఈ కార్యకలాపాలు ఆర్థిక వ్యవస్థ కు అపారమైన నష్టాలను కలుగజేస్తున్నాయి.
స్వతంత్య్ర భారతీయ థింక్ ట్యాంక్, ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక సంవత్సరంలో రూ. 8.2 లక్షల కోట్ల మార్కెట్ లో వార్షిక నష్టాలు రూ. 2 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయని అంచనాలు ఉన్నాయి.
కొసమెరుపు..
అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్, ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈజీఎఫ్ వంటి కీలక గేమింగ్ పరిశ్రమ సంస్థల మధ్య ఇటీవల ఒక అవగాహన ఒప్పందం కుదిరింది.
చట్టబద్దమైన గేమింగ్ కంపెనీలు ఐపీఎల్ ప్రజాదరణకు లబ్ధిదారులు మాత్రమే కాదని, అవి విస్తృత క్రీడా ఆర్థిక వ్యవస్థకు కూడా కీలకమైన దోహదపడతాయని గుర్తించడం చాలా ముఖ్యం.
అనేక క్రికెట్ సిరీస్ లకు, జట్టు స్పాన్సర్ షిప్ లకు ఇవి వెన్నెముకగా ఉన్నాయి. క్రీడా వృద్దికి ఆజ్యం పోసే అవసరమైన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. స్పాన్సర్ షిప్ లకు మించి, వారు కొత్త ప్రతిభకు అవకాశాలను సృష్టిస్తారు.
నైపుణ్యాలకు ప్రదర్శించడానికి, గుర్తింపు పొందేందుకు వేదికలను అందిస్తారు. ముఖ్యంగా ఈ కంపెనీలు క్రికెట్ ను ఉత్సాహంగా అనుసరించే వందల మిలియన్ల మంది భారతీయులతో లోతైన సంబంధాన్ని ఏర్పరుస్తాయి. అభిమానులకు కొత్త అనుభవాన్ని అందిస్తాయి.
జీవన సంబంధం..
ఐపీఎల్ స్వయం సమృద్ది గల గేమ్ గా పరిణామం చెందింది. గేమింగ్ కంపెనీలు వీటిని ప్రేక్షకులకు మరింత దగ్గరకు చేస్తాయి. మొదటి బంతి వేయడానికి కొన్ని గంటల ముందు స్టేడియం వాతావరణాన్ని ఇవి ఉత్సాహంగా మారుస్తాయి.
ఇది గేమింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. 2024 లో భారతదేశ ఆన్ లైన్ గేమర్ బేస్ 488 మిలియన్ల పైగా విస్తరించింది. అన్ని పరికరాల్లో క్యాజువల్, రియల్ మనీ గేమర్ లతో సహ 33 మిలియన్ల కొత్త గేమర్ లు అదనంగా చేరారు.
ఫాంటసీ స్పోర్ట్స్ , రమ్మీ, పోకర్, ఇతర లావాదేవీ ఆధారిత గేమ్ ల వంటి రియల్ మనీ గేమింగ్ ఉప విభాగాలతో 155 మిలియన్లకు పైగా గేమర్ లు నిమగ్నమై, సంవత్సరానికి పది శాతం వృద్దిని నమోదు చేస్తున్నారు.
ఐపీఎల్ విజయం సవాళ్లు, బాధ్యతలు కూడా తెస్తున్నాయి. ఇది కిందిస్థాయిలో అంతర్లీన సమస్యలను బయటకు తీసుకురావడం లేదు. ముఖ్యంగా నిజమైన, మోసపూరిత వేదికల మధ్య తేడాను గుర్తించేందుకు ఉపయోగడపడుతుంది.
నియంత్రణ, పారదర్శత గేమింగ్ కు, క్రికెట్ కు మేలు చేయడమే కాకుండా అనేక ఆర్థిక వృద్దికి తమ వంతు చోదక శక్తిని అందిస్తాయి.