‘గోమూత్రం’ జబర్దస్త్ మెడిసిన్ అంటున్న ఐఐటి శాస్త్రవేత్త
యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ హైపర్ టెన్సివ్, యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నాయంటున్న మద్రాస్ ఐఐటి ఫ్రొఫెసర్ కామకోటి...;
By : The Federal
Update: 2025-01-26 11:24 GMT
అలక్తా దాస్
ఇటీవల ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి ‘గోమూత్రం’ లో అనేక ఔషధ విలువలు ఉన్నాయని, తాను పరిశోధన చేసిన పత్రాన్ని నేచర్ ఫోర్ట్ ఫోలియోకు చెందిన జర్నల్ లో ప్రచురించారు. ‘గోమూత్రం’ అంటు వ్యాధులు నయం చేస్తుందని, ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయని కామకోటీ తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. తన వాదనలకు మద్దతుగా తన పరిశోధనలో తెలిసిన ఐదు పరిశోధన పత్రాలను ఆయన సమర్పించారు.
అయితే ఈ ఔషధ విలువను సమర్థిస్తూ ఇచ్చిన సాక్ష్యం శాస్త్రీయ విజ్ఞానానికి అవమానకరమైన అస్పష్టమైన సందేశమే అని భావించాల్సి ఉంటుంది. ఇలాంటి సమాచారాల ప్రసారాల కోసం నాయకత్వ స్థానాలను దుర్వినియోగం చేస్తున్నాడనడానికి ఇదే నిదర్శనం.
పరిశోధన పత్రం పరిశీలిస్తే..
‘‘ఆవు మూత్రం( గోమూత్రం) లో పెప్టైడ్ ప్రొఫైలింగ్ ఫిజియాలజీ- డ్రైవెన్ పాత్ వేస్, ఇన్ సిలికో ప్రిడిక్టెడ్ బయోయాక్టివ్ ప్రాపర్టీస్ పరమాణు సంతకాన్ని వెల్లడిస్తుంది’’ అని తన పరిశోధన పత్రంలో ఆయన విశ్లేషించారు. ఇందులో పెప్టైడ్ లను విశ్లేషించే ప్రయత్నం మాత్రం చేశారు.
పెప్టైడ్ లు అమైనో ఆమ్లాల చిన్న గొలుసులు. ఇవి ప్రోటీన్ లను శరీరంలో నిర్మించడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే ప్రోటీన్ ల మాదిరిగానే పెప్టైడ్ లు కూడా గాయాలు మానడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గాయాలు నయం చేయడమే కాకుండా కణాల మధ్య సంకేతాలు పంపడంలో, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాటంలో ముందుంటాయి. మరికొన్ని కీలక విధుల్లో కూడా వీటి ప్రమేయం ఉంది.
కామకోటీ పరిశోధనపత్రంలో ఆవు మూత్రంలోని పెప్టైడ్ లు వాటి పనితీరు ఆధారంగా యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ హైపర్ టెన్సివ్, యాంటీ క్యాన్సర్ లక్షణాల ప్రకారం సేకరించి, విశ్లేషించి, సముహాలుగా వర్గీకరించారు. అలాగే ఆవు మూత్రంలో 551 పెప్టైడ్ లు యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో ఉన్నట్లు గుర్తించారు.
అంచనాల ఆధారంగా.. అంచనాలు వేయడం..
అయితే ఈ పరిశోధనను కేవలం అంచనాల ఆధారంగా అంచనాలు రూపొందించారని చెప్పవచ్చు. దీనికి కారణం ఏంటంటే.. ఇన్ సిలికో విశ్లేషణ ద్వారా వర్గీకరించడం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కంప్యూటర్ లో అప్పటికే ఉన్న సమాచారాన్ని సేకరించడం. ఉదాహరణకు కొత్త వ్యాధికి మందులను నెట్ లో శోధించి మందులు కనిపెట్టడం లాంటిది.
శాస్త్రవేత్తలు మొదట ఏదైన ఊహించి, తరువాత అది నిజామా కాదా అని ప్రయోగాలు చేస్తారు. మొదటి విట్రోలో అంటే బయటి కణాలలో తరువాత కణ అంతర్భాగంలో ఏం జరుగుతుందో అంచనా వేస్తారు. ఆ తరువాత వీటి ఆధారంగా మొత్తం ప్రత్యక్ష విషయాలపై పరీక్షలు నిర్వహిస్తారు. జంతువు లేదా మనిషి పై ప్రయోగాలు చేయడానికి శాస్త్రవేత్తలు వెంటనే వెళ్లలేరు. దీనికి అనేక నిబంధనలు, సవాలక్ష అనుమతులు కావాలి.
ప్రయోగం ఏం చేస్తారో...
కామకోటీ పరిశోధన పత్రంలో ఆవు మూత్రంలో పెప్టైడ్ యాంటీ మైక్రోబయల్ ప్రభావాలను అంచనా వేయడానికి కేవలం ఒకే ఒక ప్రయోగాన్ని మాత్రమే నిర్వహించినట్లు తేలింది. స్టెఫిలోకాకస్ ఆరియస్, ఎస్చేరిచియా కోలి అనే రెండు బ్యాక్టీరియా పై యాంటీ మైక్రోబయల్ ప్రభావాలు మాత్రమే అంచనా వేశారు. ఈ బ్యాక్టీరియా మానవులకు సోకుతుందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల ఇది ప్రజలకు ఆసక్తిగా అనిపించి ఉండవచ్చు. పెప్టైడ్ లు ఈ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేస్తే స్పష్టమైన ప్రయోజనాలు ఉంటాయి.
ఈ ప్రయోగం ఎలా జరిగింది..
ఈ ప్రయోగం ఎలా జరిగింది. డిస్క్ డిప్యూజన్ మెథడ్ అని పిలిచే ఒక డిష్ లాంటి జెల్లీ పదార్థంతో చేస్తారు. ఇది బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి, శాస్త్రవేత్తలు పరీక్షించాలనుకుంటున్న బ్యాక్టీరియాతో వ్యాప్తి చెందడానికి సహాయపడుతుంది.
అప్పుడూ చిన్న పేపర్ డిస్క్ లను పరీక్షించాల్సిన పదార్థంలో నానబెట్టాలి. కాగితపు డిస్క్ లను అగర్ డిష్లో ఉంచాలి. అప్పుడూ డిష్ బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన ఉష్ణోగ్రత వద్ద వదిలివేయాలి. డిస్క్ లోని పదార్థం బ్యాక్టీరియాను నాశనం చేయగలిగితే లేదా పెరగకుండా ఆపగలిగితే డిస్క్ చుట్టూ ఉన్న ప్రాంతంగా స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాక్టీరియా అక్కడ పెరగదు. డిస్క్ చుట్టూ ‘‘ జోన్ ఆఫ్ ఇన్హిబిషన్’’ అని పిలవబడే స్పష్టమైన రింగ్ వంటి జోన్ ను ఏర్పరస్తుంది.
మిగిలిన డిష్, డిస్క్ కు దూరంగా ఉన్న ప్రాంతాల్లో, స్పష్టమైన రింగ్ వంటి జోన్ వెలుపల అక్కడ బ్యాక్టీరియా పెరిగి గ్రైనీగా కనిపిస్తుంది. ఒక పెద్ద స్పష్టమైన జోన్ సాధారణంగా బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకోవడంలో పదార్థం మరింత ప్రభావవంతంగా ఉంటుంది.
ఫలితాలు ఎలా ఉన్నాయి..
ఈ అధ్యయనంలో పరిశోధకులు, డిష్ లోని రెండు బ్యాక్టీరియా కోసం ఆవు మూత్రం పెప్టైడ్ సారాన్ని బీఎస్ఏ( బోవిన్ సీరం అల్బుమిన్, ఆవు రక్తంలోని ప్రోటీన్) పరీక్షించారు. బీఎస్ఏ యాంటీ మైక్రోబయల్ ప్రభావాలను కలిగి ఉండదని తెలిసినందున ప్రయోగంలో ప్రతికూల నియంత్రణగా ఉపయోగించారు. పెప్టైడ్ సారం రెండు సందర్భాల్లోనూ నిరోధం ఏర్పడటానికి కారణమైందని వారు కనుగొన్నారు.
అయితే బీఎస్ఏ అలా చేయలేదు. వారు 1. 22 ప్లస్ ఆర్ మైనస్ 0.11(ఎస్డీ) సెం.మీ సగటు నిరోధక మండలాన్ని కొలుస్తారు. తరువాత ఈ కొలిపై ప్లస్ ఆర్ మైనస్ 0.03 మరియు 1.22 ప్లస్ ఆర్ మైనస్ 0.10 ఎస్డీ సెం.మీ సగటు నిరోధక జోన్ ప్లస్ ఆర్ మైనస్ 0.03 ఉంది.
రెండు సందర్భాల్లో సరిగ్గా ఒకే విధమైన కొలతలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది జీవప్రయోగాలలో పూర్తిగా అసాధారణమైనది. సాధారణంగా నియంత్రిత పరిసరాలలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష సూక్ష్మ జీవులతో కూడిన ప్రయోగాల నుంచి ఆశించిన విధంగా అటువంటి ప్రయోగాలలో ఒకస్థాయి వైవిధ్యాన్ని చూస్తారు.
ఇందులో ఈ కొలి నెగటివ్, పాజిటివ్ బ్యాక్టీరియా రెండు కూడా వేర్వేరు వృద్ధిరేటుతో ఉంటాయి. పాతవి సాధారణ వేగంతో పెరుగుతాయి. అవి వేర్వేరు బాహ్య పొర నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇవి సరిపోయాయని చెప్పడం వాస్తవం కాదు. అసంభవం కూడా.
సానుకూల నియంత్రణ లేదు..
యాంటీ మైక్రోబయాల్ చర్య పరిధిని పోల్చడానికి ప్రయోగంలో సానుకూల నియంత్రణ కనిపించలేదు. తదుపరి ప్రయోగాలు చేయడం కూడా చాలా సులభం కూడా. ఉదాహారణకు కనీస నిరోధక ఏకాగ్రతని కొలవడం, అనగా బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి అవసరమైన పదార్థం అత్యల్ఫ గాఢతను వేయడం చాలా సులభం. పరిశోధకులు దీన్ని కనుగొనడానికి అనుమతి వస్తుంది.
యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ దాని ఉపయోగాన్ని ధృవీకరించడం కోసం ఇలా పని చేయాల్సి ఉంటుంది. ఈ పదార్థం కేవలం బాక్టీరియానే మాత్రమే నిరోధిస్తుందా లేదా అని కనుగొనాల్సి ఉంటుంది.
సందేహాన్ని వివరించడం ఎలా?
గో మూత్రం తాగడం వలన బ్యాక్టీరియా సంక్రమణన నుంచి మానవ శరీరాన్ని రక్షిస్తుందా? దీనికి సమాధానం లేదు. కేవలం ఒక డిస్క్ డిప్యూజన్ ప్రయోగం ఆధారంగా బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ లను నివారణగా ఒక పదార్థం ప్రకటించడం శాస్త్రీయ ప్రమాణాలకు విరుద్దం.. అలాగే అత్యంత ప్రమాదకరం కూడా. కేవలం ఒకే ఒక్క పరీక్ష పెద్ద ప్రమాణంలోని చిన్న భాగాన్ని మాత్రమే బయటకు తెస్తుంది.
ఉదాహారణకు ప్రయోగంలోని ఉపయోగించిన డిష్ లోని బాక్టీరియాను చంపే ఏదైన కణం కూడా మానవ కణాలకు హనీ కలిగించవచ్చు. అలాగే ఆ పదార్థం మానవ శరీరంలో విచ్చిన్నం అవుతుందా? లేదా.. పనిచేయడానికి ఎంతకాలం పడుతుందో లాంటి విషయాలను తెలుసుకోవాలి. ఆవు మూత్రం యాంటీబయాటిక్ క్యూర్ ఏజెంట్ గా ఉపయోగించబడుతుందనే బలమైన వాదనను వినిపించే ముందు ఇలాంటి అనేక ఇతర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
సమస్యలు అనేకం..
గోమూత్రం వాస్తవానికి మరిన్ని కొత్త సమస్యలు కలిగిస్తుందా? కూడా చూడాలి. అలాగే ఇతర శరీర భాగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో పరిశోధించాలి. అనేక రకాలుగా.. అనేక కోణాల్లో పరిశోధించి ఫలితాలను అంచనా వేయాలి.
మానవ శరీరం చాలా క్లిష్లంగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవడం మాములు విషయం కాదు. రోగనిరోధక ప్రతిస్పందన, రక్త ప్రసరణ, జీవక్రియ, కణజాల వాతావరణం వంటి వివిధ శారీరక కారకాలు శరీరంలో పెప్టైడ్ ఎలా ప్రభావంగా పనితీరు చూపిస్తుందో కనుగొనాల్సి ఉంటుంది. ఆవు మూత్రం పెప్టైడ్ సారాన్ని యాంటీబయాటిక్ గా ఉపయోగించవచ్చని కేవలం ఒకే ఒక ప్రయోగంలో నిర్ధారించడం, దాని ఫలితాలను సరిపోల్చడం సరికాదు.
శాస్త్రవేత్తలు అనేక పరిస్థితులను ప్రయోగశాలలో పున: సృష్టి చేయాలి. ఎన్నో నియంత్రణలతో పెప్టైడ్ లను మానవుల కోసం పరిగణించే ముందు జంతువుల నమూనాల మీద ఆధునాతన వ్యవస్థలలో పరిశోధన చేసి అధ్యయనం చేయాలి.
ప్రచారం కోసం సైన్స్..
ఏదైన చిన్న ఔషధాన్ని అభివృద్ధి చేయాలన్నా చాలా సంవత్సరాల పాటు కఠినమైన పరిశోధన, పరీక్షలు అవసరం. ల్యాబ్ లో ప్రయోగాలు మొదలయిన తరువాత వచ్చిన ఫలితాలతో ఆ ఔషధం సురక్షితమైనదని, దాని ప్రభావం కనిపించే విధంగా ఉందని కఠిన నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి జంతువుల నమూనాల మీద తరువాత మానవులపై క్లినికల్ ట్రయల్స్ తో సహ బహుళ దశలను దాటాలి.
అమెరికా ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. డ్రగ్ డిస్కవరీ పైప్ లైన్ సగటున కనీసం 12 సంవత్సరాలు పడుతుంది. ఇలాంటివేవీ లేకుండా ఫలితాలు ప్రకటించడం ప్రజా ఆరోగ్యానికి ప్రమాదకరం. ఒక రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కథనం సరిపోయేలా ఎంపిక చేసిన శాస్త్రీయ పరిశోధనలు లేదా ఒక ప్రయోగం నుంచి ప్రాథమిక ఫలితాలు అతిశయోక్తి చేయడం దురదృష్ఖకరం.
ఐఐటీ మద్రాస్ వంటి ప్రముఖ విద్యాసంస్థకు చెందిన డైరెక్టర్ ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం ఈవిషయంలో మరింత ఆశ్చర్యకరమైనది. నిజానికి ఆందోళన కలిగించే విషయం. ఇది సైన్స్ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా ప్రజల అవగాహానను కూడా తారుమారు చేస్తుంది.
ప్రజల విశ్వాసం..
ఇంకా ఇది సైన్స్, శాస్త్రీయ పద్దతిపై ప్రజల నమ్మకాన్ని తగ్గిస్తుంది. రాజకీయ లబ్ది చేకూర్చడానికే అన్న లక్ష్యంతో సైన్స్ ను ఇటువంటి వాటి కోసం వాడుకుంటున్నారు. దేశ పరిశోధన రంగానికి ఇప్పటికే కొరతగా ఉన్న వనరులను మళ్లించే అవకాశం ఇలాంటి ప్రచారాల ద్వారా జరగుతుంది.
కరోనా కాలంలో విస్తృతంగా వాడిన కరోనిల్ మోసమే అని నిరూపించబడింది. పబ్లిక్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూషన్స్ లో ప్రముఖ స్థానాల్లో ఉన్నవారు అకారణంగా బయట జరుగుతున్న వాటికి బలం చేకూర్చేలా తమ మద్ధతను అందించాలి. దీనికి బదులుగా వారు ఉన్నతమైన శాస్త్రీయ ప్రమాణాలను పాటించాలి.