నకిలీ రివ్యూలు, ఫేక్ కలెక్షన్ లతో బాలీవుడ్ తనను తానే చంపుకుంటోందా?
హిందీ సినిమా ఇండస్ట్రీ కొత్తగా తెరతీసిన స్కామ్ లతో ప్రజలు పూర్తిగా సినిమాకు దూరమయ్యారా?;
By : The Federal
Update: 2025-03-20 07:11 GMT
సంకేత్ ఉపాధ్యాయ
పాట్నాలోని నగరంలో ఉన్న మైదానాల్లో అతిపెద్దది గాంధీ మైదానం. ఇది నగరం నడిబొడ్డును ఉంటుంది. సాధారణంగా పెద్ద పెద్ద రాజకీయ సభలు జరిగినప్పుడే ఆ మైదానం జనంతో పూర్తిగా నిండుతుంది.
అది కూడా కష్టంగానే.. కానీ అల్లు అర్జున్ ‘పుష్ఫ2’ సినిమా ప్రమోషన్ అక్కడ నిర్వహిస్తున్నారని తెలియగానే నాకు సందేహం వచ్చింది. కానీ వాటన్నింటిని పటాపంచలు చేస్తూ మైదానం మొత్తం అభిమానులతో నిండిపోయింది. బాలీవుడ్ స్టార్ కు కనిపించని క్రేజ్ ఇక్కడ పుష్ఫరాజ్ కు కనిపించింది. ఈ వ్యాసంలో సౌత్ ఇండియా వర్సెస్ బాలీవుడ్ గురించి చర్చ కాదు.
నిశ్శబ్ధ విప్లవం..
రెండు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత సినిమాలు హిందీలో డబ్ అయి, కేబుల్ టీవీ ద్వారా ఉత్తర భారతంలో ప్రతి ఇంటికి చేరాయి. ఇది చాలాకాలం పాటు నిశ్శబ్ధ విప్లవంగా సాగింది. చైనా వస్తువులు ఒక్కసారిగా ప్రపంచాన్ని ముంచెత్తిన విధంగా కాకుండా ఇవి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాయి.
ఈ నెల ప్రారంభంలో దోహా కేంద్రంగా ప్రసారం అయ్యే అంతర్జాతీయ వార్తా ఛానెల్ అల్ జజీరా, దాని వెబ్ సైట్ లో ఒక నివేదికను ప్రచురించింది. ఇది బాలీవుడ్ లో లోతుగా పాతుకుపోయిన వార్తా సమీక్ష కుంభకోణాలను బయటపెట్టింది.
బాలీవుడ్ లక్ష్యం ఒకటే సినిమాలకు తప్పుడు రివ్యూలు రాయించి, కృత్రిమ హైప్ లు క్రియేట్ చేసి ప్రేక్షకులను తప్పుదారి పట్టించడం, వారిని థియేటర్లకు తరలించడం. ఇందుకోసం చిత్రనిర్మాతలు లేదా నిర్మాణ సంస్థలు భారీ మొత్తంలో విమర్శకులకు చెల్లిస్తాయని ‘అల్ జజీరా’ వెల్లడించింది.
పబ్లిక్ రిలేషన్స్..
అల్ జజీరా ప్రకారం.. న్యూస్ వెబ్ సైట్లు సినిమాపై మంచి రేటింగ్ ఇచ్చి వాటికో రేటింగ్ ఇస్తాయి. జనం దృష్టి మొత్తం అక్కడ ఉండేలా చేస్తాయి. ఇక్కడ సమస్య ఏంటంటే బాలీవుడ్ కేవలం మంచి ప్రచారాన్ని కొనడం కాదు. అది కేవలం మంచి సమీక్షలను కొనడం. సినిమా స్టార్ రేటింగ్ ను పెంచడానికి సమీక్షకులకు డబ్బు చెల్లించడం పూర్తిగా వేరే విషయం.
ఆ కథనం హిందీ సినిమాలో చాలాకాలంగా ఉన్న లోటుపాట్లను నిజానికి కుంభకోణాలకు బయటపెట్టింది. ఈ ఆచారం కొంతమంది విమర్శకుల మాటకు విలువ ఉండేలా పరిమితం చేసింది.
ఫ్రాంకెన్ స్టైయిన్..
బాలీవుడ్ కు సమీక్షలకు సంబంధించిన వ్యాపారం సోషల్ మీడియా యుగం రానంతర వరకూ బాగానే సాగింది. కానీ ప్రజల చేతుల్లోకి సమాచార విప్లవం రాగానే దాని కథ మొత్తం తల్లకిందులైంది.
యూట్యూబర్ లు వారి అభిప్రాయాలను చెప్పి సామాజిక మాధ్యమాల్లోకి వదలడంతో సినిమాలకు సంబంధించిన నిజమైన పాయింట్లు ప్రజల్లోకి నేరుగా వెళ్లాయి.
బాలీవుడ్ ప్రస్తుతం ఒక ఫ్రాంకెన్ స్టైయిన్ రాక్షసుడిని సృష్టించింది. అందులో భాగంగా మొదట నిర్మాణ సంస్థలు తమకు ఇష్టమైన సమీక్షకులకు గుర్తించేవి. వారిని ముంబైకి విమానంలో రప్పించి, ఐఫోన్లు బహుమతులగా ఇచ్చి, లగ్జరీ హెటల్లో బస కల్పించేవి.
కానీ సమస్య ఇక్కడే ప్రారంభం అయింది. ఇక్కడ ప్రతివారం కొత్త సినిమాలు విడుదల కావడంతో అన్ని స్థాయిల్లోనే అవే తరహ సౌకర్యాలను వారు కోరారు. దాంతో వ్యవస్థ నిలకడలేనిదిగా ప్రారంభం అయి, గతి తప్పింది. ఇప్పుడు సమీక్షలు భరించలేనివిగా మారాయి.
బ్లాక్ బుకింగ్ స్కామ్..
బాలీవుడ్ పెంచిపోషించిన ఈ కొత్త రివ్యూయర్లు కొత్త సినిమాలు విడుదల సందర్భంగా డబ్బులు చెల్లించకపోతే వారి సినిమాలకు చెత్త రేటింగ్ లు ఇచ్చి వాటిని డస్ట్ బిన్ లోకి విసిరే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. లేదా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసే సంస్కృతికి తెరతీశారు.
నేను కొంతమంది విశ్లేషకులతో మాట్లాడిన మాటల ప్రకారం.. బాలీవుడ్ వ్యవస్థ కుళ్లిపోవడానికి కారణం పెద్ద సినీ నిర్మాతలే అంటున్నారు. ఇంతకుముందు పత్రికల్లో పెద్ద ఎత్తున సినిమాకు ప్రకటనలు ఇచ్చేవారు. దాని ఆధారంగా ఈ వ్యవస్థ సినిమాకు నెగటివ్ ప్రచారం రాకుండా చూసుకునేవి.
ఒక సందర్భంలో ఒక వార్తా పత్రికకు చెందిన సినిమా సమీక్షకుడు ఒక సినిమా బాగాలేదని చెప్పి, తక్కువ రేటింగ్ ఇచ్చాడు. దాంతో నిర్మాతలు యాడ్ ఏజెన్సీ వాళ్లకు ఫిర్యాదు చేశారంట.
‘‘మీకు అంత పెద్ద మొత్తంలో సినిమా యాడ్స్ ఇస్తే, మీరు నెగటివ్ రేటింగ్ ఇచ్చరేంటీ అని’’. దీనిపై పత్రికా యాజమాన్యం ఈ రివ్యూయర్ ను తీవ్రంగా మందలించింది. మరోక సమీక్ష రాయమని కోరగా, దానికి అతను నిరాకరించడంతో ఆ జర్నలిస్ట్ ను తొలగించారని ట్రేడ్ విశ్లేషకుడు గిరీష్ వాంఖడే చెప్పిన మాట.
బయటకు వచ్చిన రెండో స్కామ్..
ఒక నెల క్రితం ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహ్త తన యూట్యూబ్ ఛానెల్ లో ‘భండా ఫోడ్’(పేలుడు వివరాలు) పేరుతో కొన్ని అంశాలను విడుదల చేశారు. అందులో బాలీవుడ్ చేస్తున్న కొత్త మోసాలను వెలికి తీశాడు. అదే బ్లాక్ బుకింగ్ స్కామ్.
బాలీవుడ్ నిర్మాణ సంస్థలు మొదట సినిమాను నిర్మిస్తాయి. ఆ తరువాత ఆ సినిమా ఘన విజయం సాధించిందనే హైప్ ను సృష్టించడానికి సినిమా హళ్లను సొంతం గా బుక్ చేసుకుంటారు. ఇది రెగ్యూలర్ గా జరుగుతోందని నహ్త ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఖాళీ.. ఖాళీ..
చాలా సినిమాలు థియేటర్లలో విడుదల తరువాత ఓటీటీ సంస్థలు కొనుగోలు చేస్తాయి. ఇంతకుముందు ఓటీటీలు ముందస్తుగానే అడ్వాన్స్ లు ఇచ్చి సినిమాలను బుక్ చేసుకునే వారు. ఇప్పుడు వాళ్లు కూడా ముదిరారు. చెత్త సినిమా అని తేలితే వాటిని ఫ్రీగా ఇచ్చిన తీసుకోమని చెబుతున్నారు.
ఓటీటీలు సినిమాలు కొనడానికి కొన్ని షరతులు విధించారు. వాటిలో ముఖ్యమైనవి సినిమా హాళ్లలో సినిమా బాగా ఆడిందని చూపించాలి. అందుకే బాలీవుడ్ తన సొంత డబ్బుతో హళ్లను బుక్ చేస్తున్నాయి. అలాగయితేనే సినిమాకు ఓటీటీలో మంచి ధర వస్తుంది.
కానీ సినిమా దారుణంగా ఉంటే జనాలు ఉచితంగా సినిమా చూపించిన థియేటర్లకు రావడం లేదు. అయినప్పటికీ బాలీవుడ్ మాత్రం తన ప్రయత్నాలకు ఆపడం లేదు.
ఐసీయూలో ఉన్న బాలీవుడ్..
బాలీవుడ్ పరిస్థితేంటీ? హిందీలో ఒక మంచి సామెత ఉంది. అందేంటంటే..‘‘మారా హువా హాతీ సేవ్ లఖ్ కా( చనిపోయిన ఏనుగు కూడా లక్షల విలువైనదే)’’ అలాగే హిందీ చిత్ర పరిశ్రమ ఐసీయూలో ఉంది. దాని బతికించడానికి పునర్ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అవి సరైన దారిలో కొనసాగడం లేదు. భారీగా పెంచుతున్న లెక్కలు, సమీక్షలు, ప్రజల కళ్లద్దాల వరకే చేరగలవు.
కానీ బాలీవుడ్ కు భిన్నంగా దక్షిణాది చిత్రపరిశ్రమ నిశ్శబ్దంగా తనను తాను తిరిగి మార్చుకోవడం ప్రారంభించింది. మార్కెటింగ్ గిమ్మిక్కులను నమ్మకుండా మంచి కథలను తెరకెక్కించడం, ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్మూ చేయకుండా కథను చెబుతున్నారు.
ఇక్కడ వ్యంగ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఒకటి ఉంది. బాలీవుడ్ తన నష్ట నియంత్రణకు వృథా చేసే శక్తిలో సగం అయినా నిజంగా మంచి సినిమాలు తీయడానికి ఖర్చు చేసినా అది మనుగడ సాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మనమంతా కలిసి చూసే సినిమా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నారు.
(ది ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను వ్యక్తికరించడానికి ప్రయత్నిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు కేవలం రచయితకు సంబంధించినవి. అవి ది ఫెడరల్ అభిప్రాయాలను ప్రతిబింబించవు)