ఉపాధి హామీ పథకంలో తొలిసారి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?

ఇపుడు వారి బతుకు మారిందా ?

Update: 2025-12-16 06:52 GMT
అనంత పురం జిల్లా బండ్లపల్లి లో 2006, ఫిబ్రవరి 2న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభం. తొలి జాబ్‌ కార్డులను చీమల పెద్దక్క, ఆకులేటి గంగమ్మకు అందుకున్నారు.

ఆ గ్రామం పేరు బండ్లపల్లి .

రాయల సీమలోని అనంత పురం జిల్లాలో నార్పల మండలంలో అత్యంత వెనుక బడిన గ్రామం అది. 2006, ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌,యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ అక్కడ అడుగు పెట్టారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిస్తూ తొలి జాబ్‌ కార్డులను చీమల పెద్దక్క, ఆకులేటి గంగమ్మతో పాటు మరో ఆరుగురికి అందచేశారు. ఆ పథకాన్ని రూపకల్పన చేసిన సీనియర్‌ ఐఎఎస్‌ కొప్పుల రాజు కూడా అక్కడే ఉన్నారు. ఆనాడు తొలి జాబ్‌ కార్డు అందుకున్న ఉపాధి కూలీ చీమల పెద్దక్క మనవరాలు బేబి ఇపుడు హైదరాబాద్‌లో ఎంబిబిఎస్‌ చదువుతోంది.

15.12.2025

పేదలకు గ్యారంటీగా 100 రోజుల పని హక్కును కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మార్చేసింది. ఇక నుంచి దాన్ని ‘వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌-గ్రామీణ్‌’ అని పిలుస్తారు. యూపీఏ హయాంలో ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తీసివేస్తున్నారు. 15.12.25న గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పాత చట్టాన్ని వెనక్కి తీసుకుంటూ ‘ వీబీ-జీరామ్‌జీ 2025 బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్న కొత్త బిల్లు నిబంధనలు ‘వికసిత భారత్‌-2047 విజన్‌’ కు అనుగుణంగా తీర్చిదిద్దామంటున్నారు. 20 ఏళ్ల క్రితం పథకాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితి ఇప్పుడు లేదని, మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని చౌహాన్‌ ప్రకటించిన నేపథ్యంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభమైన అనంత పురం జిల్లాలో తొలి జాబ్‌ కార్డు పొందిన ఇద్దరు మహిళలు ఇపుడు ఏం చేస్తున్నారు ? వారి జీవన చిత్రం ఎలా ఉందనేది ఈ కథనం.

2006, ఫిబ్రవరి 2న తొలి జాబ్‌ కార్డు అందుకొని ఉపాధి హామీ పనుల్లోకి చేరిన ఆకులేటి గంగమ్మ.

అక్కడ అతి తక్కువ వర్షపాతం, తీవ్రమైన కరువు కారణంగా మగవారు కాడిని వదిలేసి బెంగళూరు వైపు వలసలు పోతుంటే, ఆడవారు గుంటూరులో మిర్చిపంట కోతకు వెళ్లేవారు. గడ్డి కూడా మొలకెత్తక పశుపోషణ భారంగా మారి జీవాలఃను కబేళాకు తరలించే పరిస్తితి.

2006, ఫిబ్రవరి 2న తొలి జాబ్‌ కార్డు అందుకొని ఉపాధి హామీ పనుల్లోకి చేరిన చీమల పెద్దక్క

ఆ గ్రామం పేరు బండ్లపల్లి .

రాయల సీమలోని అనంత పురం జిల్లాలో నార్పల మండలంలో అత్యంత వెనుక బడిన గ్రామం అది. 2006, ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌,యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ అక్కడ అడుగు పెట్టారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిస్తూ తొలి జాబ్‌ కార్డులను చీమల పెద్దక్క, ఆకులేటి గంగమ్మతో పాటు మరో ఆరుగురికి అందచేశారు.

దేశవ్మాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని కూలీలకు పని కల్పించాలన్నది

ఈ కార్యక్రమం. పొట్టకూటి కోసం వలస పోతున్న పేదలకు భరోసానిచ్చేలా ఈ పథకాన్ని నాటి యూపీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్యకంగా రూపొందించింది. భారత రాజ్యాంగంలోని ‘అందరికీ పనిహక్కు’ అనే ముఖ్యమైన అంశమే ‘ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మారింది.

బండ్లపల్లి లో ఉపాధి హామీ పనులతో అభివృద్ధి చేసి పంట కుంటలు

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ పథకాన్ని ప్రారంభించిన బండ్లపల్లి ఇపుడు ఎలా ఉంది? జాబ్‌కార్డులు పొందిన ఇద్దరు మహిళల బతుకు మారిందా ?

వలసలు వాపస్‌ 

‘‘ 15 ఏళ్ల క్రితం ఇక్కడ తీవ్రమైన కరవు, నీళ్లు లేక ట్యాంకర్లతో తెచ్చుకునేవారు. పనులు లేక వలసలు పోయేవారు. అందుకే ఈ గ్రామాన్ని ఉపాధి పథకం ప్రారంభించడానికి ఎంచుకున్నారు. ఈ గ్రామజనాభా 2,౫౬౦


ఇప్పటి వరకు 2,169 మందికి వందరోజులó పని కల్పించాం. వీరంతా ఫారంపాండ్స్‌, చెరువుల్లో పూడిక తీత, కొండవాలులో కందకాలు , రాతికట్టలు, వాలుకట్టలు వంటి 912 జలసంరక్షణ పనులు చేశారు. వీటిలో287 పంటకుంటలే ఉన్నాయి. ఫలితంగా 12 మీటర్ల లోతులోనే భూగర్బ జలాలు ఉన్నాయి. బావులు,బోర్లు నిండాయి. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన 783 మందికి జాబ్‌ కార్డులు ఇచ్చాం. వలస పోయిన వారు వెనక్కి వచ్చి సాగు చేసుకుంటున్నారు. పండ్లతోటలు పెంచుతున్నారు. ’’ అంటారు జిల్లా డ్వామా ప్రతినిధులు.

పంట కుంటలు అభివృద్ధి చేసిన పలితంగా పచ్చని పైరులు

తిండి లేక పస్తులుండే వాళ్లం...

‘‘ అప్పట్లో పనులు లేక తిండి గింజలు దొరికేవి కాదు. ఆకలితో పస్తులున్న రోజులెన్నో... శుభకార్యాలకు వెళ్లాలంటే చెవులకు కమ్మలు ఉండేవి కాదు. ఈ పథకం వచ్చాక మా దరిద్రం తగ్గింది. కడుపునిండా బువ్వ తింటున్నాం. ఉపాధిహామీలో మాకిచ్చిన మొదటి పని కొండ వాలులో కందకాలు తవ్వడం. ఎందుకు ఆ పని చేపిస్తున్నరో అర్దమయ్యేది కాదు. వానలు పడినాక నీరు అక్కడ ఇంకి నేలలో తేమ పెరిగి పంటలు పండినాక తెలిసింది. అప్పట్లో రోజుకు 60 రూపాయల కూలీ ఇచ్చేవారు, అది ఇపుడు 230 అయింది. ఇద్దరు బిడ్డలను చదివించాను. ఒక కొడుకు ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయినా పిల్లలకు భారం కాకుండా ఇప్పటికీ కరవు పని చేస్తున్నాను. ఇప్పటికీ ఉపాధిహామీ పనులకు

వెళ్తున్నాను. ఇపుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పని ఎంత కాలం ఉంటుందో తెలీదు. నా కష్టంతో నా మనవరాలు బేబి ఇపుడు హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ చదువుతోంది’ అన్నారు, చెరువులో పూడికి తీస్తున్న65 ఏళ్ల చీమలపెద్దక్క. 20 ఏళ్ల క్రితం, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేతుల మీదుగా తొలి జాబ్‌ కార్డు అందుకున్నదామె. కూలీ పైసల్లో కొంత పొదుపు చేసి, రెండు ఎకరాల్లో ఇద్దరు కొడుకుల సాయం తో శెనిక్కాయలు పండిస్తోంది. ఖర్చులన్నీ పోనూ, దిగుబడి మీద ఏడాదికి లక్షకు పైగా ఆ కుటుంబం సంపాదిస్తున్నారు.


చిన్న కొడుకు రామాంజనేయులు ఏపీ కరవు నివారణ పథకంలో కమ్యూనిటీ ఆర్గనైజర్‌. ఉపాధి హామీ పథకం వల్ల, దళితుల 500 ఎకరాల బీడు భూములు సాగులోకి వచ్చాయని అతడు చెప్పాడు. ఫారంపాండ్స్‌ వల్ల భూగర్బ జలాలు పెరిగి వేసంగిలో కూడా పంటలకు ఇబ్బంది లేదన్నాడు. రైతులకు సేంద్రియ పంటల సాగు పై అవగాహన కల్పిస్తున్నాడు.

‘ ఒకపుడు మా ఎస్సీ కాలనీలో చాలా మంది పనికోసం కర్నాటక వైపు వలస పోయేవాళ్లు. భూస్వాముల దగ్గర పని కోసం తల వంచుకొని నిలబడాల్సి వచ్చేది.

ఉపాధి హామీ పథకం వల్ల పనికోసం వెతుక్కోవాల్సిన పరిస్ధితి లేదు. తలెత్తుకొని బతుకుతున్నాం. ’’ అంటాడు ఇదే గ్రామస్తుడు చీమల రామకృష్ణ.

భవిష్యత్‌కి భరోసా!!

‘‘ ఉపాధి హామీ పథకం లేని రోజుల్లో రోజు కూలి రూ.20 మించి వచ్చేది కాదు, ఇపుడు 200 పైగా వస్తుంది ’ అని అంటారు ఆకులేటి గంగమ్మ. పెద్దక్క తో పాటు ఈమె ప్రధాని నుండి జాబ్‌ కార్డు అందుకున్నారు. రోజు పని కెళితేగానీ, పూటగడవని కడు పేదరికం ఆమెది.

ఉపాధి హామీ పథకం వల్ల గంగమ్మ జీవితం పూర్తిగా మారిపోలేదు కానీ ఆకలితో పస్తులుండాల్సిన పరిస్ధితి నుండి తప్పించుకున్నారు. తాము చేసిన జలసంరక్షణ పనుల వల్ల చెరువుల్లొ నీరుంది. ఊరంతా పంటలు పండుతున్నాయి. ఆ తృప్తి చాలు అంటారామె. కొంత పొదుపు చేసి రెండు తులాల బంగారం కొనుక్కున్నట్టు చెప్పారు. వయసు పైబడిన వారికి చేయగలిగే పని పెడితే బాగుంటుందని ఆమె కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఇటీవల పెద్దక్కను కలిసి పలకరించగా,

పెద్దక్కతో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకుంటున్న 2021 నాటి అనంతపురం జిల్లా కలెక్టర్ జి.చంద్రుడు

‘‘ ఉపాధి పనుల వల్ల బిడ్డలను చదివించాను, మా బీడు నేలను సాగులోకి తెచ్చుకున్నాం ఇంతకంటే ఏంకావాలి సారు’’ అని ఆమె సంతోసంగా అన్నారు.

కరోనాతో ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే, మరో వైపు కూలీలకు ఉపాది పనులుó కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏ ఒక్కరికీ పనిలేదన్న భావన రాకుండా భరోసా కల్పిస్తున్నారు కలెక్టర్‌. మే నెలలో 28 రోజులలో కోటి పనిదినాలు కల్పించి, జాతీయ స్దాయిలో నెంబర్‌ వన్‌ స్దానంలో అనంత పురం జిల్లాను నిలిపారు.

‘‘మా గ్రామం కరువు శాపం నుండి తప్పించుకొని ఆకుపచ్చగా మారుతున్నది’’ అని బండ్లపల్లి రైతులు అంటున్నారు. ఒక్కొక్కరికి ఏడాదికి వంద రోజులే పని కల్పించినప్పటికీ , మిగతా రోజులంతా ఉపాధి దొరికేలా సహజవనరులను ఈ పథకంలో అభివృద్ది చేశారీ ప్రజలు.

Tags:    

Similar News