మావోయిస్టులతో శాంతి చర్చలు ఎందుకు సఫలం కాలేదు...

చర్చల్లో ప్రభుత్వం చేయగలిగే పనులను వారు కోరలేదు. ఉద్యమ కారులు చేయగలిగే పనులను ప్రభుత్వం చేయాలని అడగలేద అంటున్న బిఎస్ రాములు;

Update: 2025-03-26 06:41 GMT
మావోయిస్టులతో శాంతి చర్చలు ఎందుకు సఫలం కాలేదు...


మావోయిస్టులను ఎడా పెడా చంపేస్తుంటే, “కొన జీవనంతో కొట్టు మిట్టాడుతున్న ఉద్యమకారులకు కాస్త గుక్క తిప్పుకునే విశ్రాంతి కావాలి. రక్షణ కావాలి. యుద్ద విరమణ జరగాలి,” అనే లక్ష్యంతో ఇటీవల శాంతి చర్చల కమిటీలు తిరిగి ముందుకు వచ్చాయి. ఈ శాంతి చర్చలనేవి కొత్త కాదు. గతంలో 2004లో 20 ఏండ్ల కింద ఇలాంటి చర్చలు జరిగాయి. ఏం సాధించారు? ఏం మార్పు వచ్చింది. చర్చలయాక వెంటాడి వెంటాడి సెక్యూరిటీ దళాలు, పోలీసులు ఎందరినో చంపారు.

చర్చల్లో ప్రభుత్వం చేయగలిగే పనులను వారు కోరలేదు. ఉద్యమ కారులు చేయగలిగే పనులను ప్రభుత్వం చేయాలని అడగలేదు.

అవిద్య, సంఘ సణస్కరణలు మూఢ విశ్వాసాల నిర్మూలన, అందరికి నాణ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి కల్పన గురించి ఇరు పక్షాలు పట్టించుకోలేదు. ఒకరు ఆయుధాలు వదలాలి అన్నారు. మరో పక్షం భూములు పంచాలి , ఎన్ కౌంటర్లు ఆపాలి అన్నారు. వీల్లు చెప్పింది ప్రభుత్వం, పోలీసులు విన లేదు. వాల్లు చెప్పింది వీరు వినలేదు.

ప్రకృతి / సహజ వనరులు తీసుక పోయే పారిశ్రామిక వేత్తలు అక్కడి ఆది వాసులకు వాటా కేటాయించి వారి జీవన ప్రమాణాలు పెంచాలని స్థానిక ఆదివాసీలలో లోకల్ కాంట్రాక్టర్లను, పరిశ్రమాధిపతులను ఎదిగేలా చేయాలని అడుగ లేదు. అందువల్ల ఇపుడు మాత్రం ఇవి అడుగుతారా. ఆదివాసిలు అన్ని రంగాల్లో ఎదగడానికి వలంటీర్లుగా కృషి చేయండి అని ప్రభుత్వం అడగదు. వారు అలా సమగ్ర సమాజ వికాసం కోసం శంకర్ గుహ నియోగిలా కృషి చేయడానికి వీరి మనసు దృక్పథం అంగీకరించదు. అంతెందుకు సిపిఐ, సిపియం పార్టీలైనా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అంగీకరిస్తాయా? తమంతట తాము స్కూల్లు కాలేజీలు హాస్పటల్స్ పెట్టి పురుషాధిపత్యాన్ని హింసను అరికట్టే సాంస్కృతిక ఉద్యమం మద్యం సంపూర్ణ నిషేదం కోసం కృషి చేయగలరా? ఇవి ప్రధాన ఎజెండా ఐనపుడు చర్చలు ఫలవంతమవుతాయి. ఆదర్శ గ్రామాలు విస్తరిస్తాయి.




Tags:    

Similar News