తెలంగాణ ఖజానా ఖాళీ భవిష్యత్తు ఎట్లా?
తెలంగాణ రాష్ట్రం అంటే అప్పులు, నిధుల దుర్వినియోగం, విదేశీపెట్టుబడులు నిల్, పథకాల భారం;
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన FRBM (Fiscal Responsibility and Budget Management) గణాంకాలు, CAG (Comptroller and Auditor General) నివేదికలు, రాష్ట్ర ఖజానా ఖాళీ అనే వాస్తవాన్ని బహిరంగంగా చాటుతున్నాయి.
2024-25లో తెలంగాణ బడ్జెట్ రూ. 2.75 లక్షల కోట్లుగా ప్రతిపాదించబడింది. కానీ అందులో ఉన్నత ఆదాయ వనరులు లేవు, ఖర్చులు మాత్రం పెరిగిపోతున్నాయి. రాష్ట్రం ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నప్పుడు ఖజానా ఖాళీ కావడం సహజమే.
అప్పుల భారం
తెలంగాణ రాష్ట్ర అప్పు 2014లో రూ. 70,000 కోట్లు మాత్రమే. కానీ 2024 నాటికి అది రూ. 5.3 లక్షల కోట్లు దాటింది. అంటే కేవలం 10 ఏళ్లలోనే ఏకంగా 650% వృద్ధి, అప్పుల నిర్మాణం,మార్కెట్ నుంచి లబ్ధి: రూ. 3.6 లక్షల కోట్లు, కేంద్ర బకాయిలు / పథకాల క్రెడిట్: రూ. 80,000 కోట్లు, ఇతర ప్రైవేట్ రుణాలు: రూ. 90,000 కోట్లు, రుణాలపై వార్షిక వడ్డీ: రూ. 45,000 కోట్లు, ఇన్ని అప్పులు తీసుకున్నా, వాటితో ఏర్పడిన ఆదాయ మార్గాలు తక్కువ. ఈ కారణంగా పెరిగిన ప్రభుత్వ జీతాలూ ఆలస్యమవుతున్నాయి.ఆదాయ మార్గాల వైఫల్యం, తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులు పరిమితమైనవి. ప్రధాన ఆదాయ మార్గాలు, వెట్ (VAT) – మద్యం మీద స్టాంప్ డ్యూటీ – భూముల రిజిస్ట్రేషన్ మీద, స్టాంప్ డ్యూటీ, వాణిజ్య పన్నులు, నిబంధనల ఫీజులు (యాజమాన్య, మైనింగ్), సమస్య ఏమిటంటే ? పన్నుల వసూలు లోపం – అధిక ఆదాయ వర్గాల నుంచి సమర్ధవంతమైన పన్ను వసూలు లేదు. MSME వృద్ధి లేకపోవడం.విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడం, నిధుల దుర్వినియోగం.
భారీ ప్రాజెక్టులు – కోత లేదా?
ప్రస్తుత ఖర్చుల్లో అత్యధిక వాటా అనవసర పథకాలకు వెళ్తోంది. ఉచిత పథకాలు, పాపులర్ పథకాల పేరుతో వృథా ఖర్చులు పెరిగిపోయాయి. దీని వల్ల అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ ఖర్చుల్లో కొంత మొత్తం నిజంగా అవసరం అయినా, చాలా భాగం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలు ఉన్నాయి.
కాలేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పెద్ద ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేశారు. కానీ అవి పూర్తిగా ఆదాయాన్ని తీసుకురాలేకపోయాయి. కాలేశ్వరం ప్రాజెక్ట్, అంచనా ఖర్చు: రూ. 40,000 కోట్లు, పూర్తయిన ఖర్చు: రూ. 1,20,000 కోట్లు, వరదల్లో ధ్వంసం: రూ. 30,000 కోట్ల విలువైన స్ట్రక్చర్లు, ఆదాయ పరిగణన: తక్కువ, ఈ దృక్పథంలో ఒక రూపాయికి లాభం రావడమే లేదు, తిరుగుబాటు జరగకపోతే వృద్ధి లక్ష్యాలు కోల్పోతాం.
రాజకీయ పాపులిజం ..
తెలంగాణలో పాలక వర్గాలు ఓట్ల కోసం ఊహా ప్రపంచంలోకి ప్రజలను తీసుకెళ్లి, వారికోసం తప్ప ఖజానాకోసం ఆలోచించలేదు. 2023 చివరలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, వారికి ముందున్న మొదటి సవాలు – ఖజానా ఖాళీ. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, పథకాల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. కొత్త ప్రభుత్వం చరిత్రలో తొలిసారి, మౌలిక సదుపాయాల కోసం కేంద్రం నుంచి సాయం అభ్యర్థన, Off-budget borrowings ఆడిట్ విచారణ , నూతన బడ్జెట్ కోతలతో తయారు చేయాల్సిన పరిస్థితి. తాత్కాలిక ప్రబంధాలతో ఓటర్లు పొందుపరిచినా, దీర్ఘకాలికంగా తీరని కష్టాలే మిగిలాయి. ఉదాహరణ, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓ పథకం, వర్గాల కోసం ప్రత్యేక బడ్జెట్ వాగ్దానాలు, ఆర్థిక స్థితిని పట్టించుకోని ఎలక్షన్ హామీలు.
పరిష్కార మార్గాల అధ్యయనం :
తెలంగాణ ఖజానా ఖాళీ ఒక ఆర్థిక సంకేతం మాత్రమే కాదు – అది గత పాలన వైఫల్యానికి సంకేతం. ఇది ప్రభుత్వానికి, ప్రజలకూ ఒక హెచ్చరిక. ఈ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలంటే…
1. ఉత్పత్తి రంగాలపై ప్రాధాన్యత – MSMEలకు ప్రోత్సాహం.
2. పన్నుల ఆధారిత ఆదాయాన్ని పెంచడం.
3. సబ్సిడీ బారాలు తగ్గించడం.
4. రుణాల పరిమితి – FRBM గరిష్టం (25% GSDP) లోపలే ఉంచడం.
5. ప్రైవేట్ భాగస్వామ్యాలతో మౌలిక వృద్ధి.
6. నవీకరించిన పాలనా పద్ధతులు – లిక్విడిటీ మేనేజ్‌మెంట్.
7. అత్యవసర ఆర్థిక నియంత్రణ.
8. సమర్థవంతమైన ఆదాయ వృద్ధి.
9. పరిశ్రమలకు సరైన వాతావరణం.
10. రాజకీయ పాపులిజం తగ్గింపు.
ఇవి పాటిస్తేనే తెలంగాణ మరోసారి ఆర్థిక పరంగా పునరుజ్జీవించగలదు.