పూణేలో 111 మంది పాకిస్తానీయులు
రెండ్రోజుల్లో భారత్‌ను వీడాలని చెప్పిన జిల్లా యంత్రాంగం..;
పూణే(Pune) జిల్లా యంత్రాంగం జిల్లాలో నివసిస్తున్న 111 మంది పాక్ (Pakistani Nationals) జాతీయులను గుర్తించింది. ఏప్రిల్ 27లోగా భారత్‌ను వీడాలని ఆదేశించింది. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో పాకిస్తాన్ దేశీయులను దేశం నుంచి బయటకు పంపడం ఒకటి. పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను నిలిపేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా పూణే జిల్లా కలెక్టర్ జితేంద్ర దుడి విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘వీసా జారీ చేసే అధికారులు, పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి పాకిస్తాన్ జాతీయుల డేటాను సేకరిస్తున్నాం. ఇప్పటివరకు 111 మంది పాకిస్తానీయులను గురించి తెలుసుకున్నాం. నిర్ణీత గడువులోపు భారత్‌ను విడిచి వెళ్లాలని వారికి చెప్పాం. 57 మంది పాకిస్తానీ జాతీయులు దీర్ఘకాలిక వీసాలపై నగరంలో ఉన్నట్లు ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులు గుర్తించారు. వైద్యం కోసం వచ్చిన వారికి మరో రెండు రోజులు (ఏప్రిల్ 29 వరకు) గడువు ఇచ్చారు.