కశ్మీర్ పండిట్ల కోసం కేంద్రం కీలక నిర్ణయం

Producer :  Chepyala Praveen
Update: 2023-12-06 13:00 GMT
జమ్మూకాశ్మీర్

జమ్ము కాశ్మీర్ లో అసెంబ్లీ ఏర్పాటు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. బుధవారం లోక్ సభలో జమ్ముకాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు-2023 ను అలాగే జమ్ముకాశ్మీర్ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లు 2023ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. రాజ్యసభ ఆమోదం తరువాత జమ్ము కాశ్మీర్ లో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు 83 నుంచి 90 కి పెరుగుతుంది. అలాగే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే స్థానిక పండిట్లకు శాసనసభలో రెండు సీట్లను కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ చేసే అవకాశం ఉంది. అలాగే ఇంతకు ముందు కాశ్మీర్ లోయలో 46 స్థానాలు ఉండగా, జమ్ములో 37 ఉండేవి. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బిల్లులో వాటి సంఖ్య కాశ్మీర్ లో 47, జమ్మూలో 43కు పెరుగుతాయి. అలాగే పాక్ అక్రమిత జమ్మూ కాశ్మీర్(పీఓజేకే) 24 స్థానాలు రిజర్వ్ చేసినట్లు హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ లకు ఇందులో 9 స్థానాలు రిజర్వ్ చేస్తారు.

జమ్మూ కాశ్మీర్ లో అధికరణ 370 తొలగించాక ప్రశాంత పరిస్థితులు వచ్చినట్లు అమిత్ షా అన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక 1947,1965,1971 యద్దాలు, 1990 పండిట్ల మారణహోమంతో కొన్నివేల మంది పండిట్లు జమ్మూకాశ్మీర్ ను వదిలి వెళ్లిపోయినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక సాధారణ ప్రజల మరణాల్లో 70 శాతం, సైనిక దళాల్లో 62 శాతం తగ్గాయని వివరించారు. గత డెబ్బై ఏళ్లలో అనేకమంది అన్యాయానికి గురైయ్యారని, వారికి ఈ బిల్లు న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేలకొద్ది పండిట్లు ఇప్పటికి శరణార్థి శిబిరాల్లో ఉన్నారని చెప్పారు. 2026 నాటికి ఉగ్రవాదాన్ని కాశ్మీర్ నుంచి రూపుమాపుతామని ఓ ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి వెల్లడించారు. 

Tags:    

Similar News