బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను ఎందుకు తిరస్కరించారు?

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను సహాయకుడికి రెండో సారి కూడా బెయిల్ ఎందుకు రాలేదు?

Update: 2024-06-08 08:04 GMT

ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి  ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను న్యూ ఢిల్లీలోని కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయనకు బెయిల్ ఇవ్వలేదు. 

మే 13న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు వెళ్లిన తనపై బిభవ్ కుమార్ దాడి చేశారని మలివాల్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కుమార్ బెయిల్ కోసం కుమార్ కోర్టును ఆశ్రయించడం ఇది రెండోసారి. మే 27న ఆయన మొదటి బెయిల్ పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది.  

'బాధితురాకి నిరంతర బెదిరింపులు'

‘‘దర్యాప్తు ప్రారంభ దశలో ఉంది. నిరంతరం బెదిరింపులు వస్తుండడంతో బాధితురాలికి తన భద్రతతో పాటు తన కుటుంబ సభ్యులు అభద్రతలో ఉన్నారు. ఈ సమయంలో  నిందితుడు బిభవ్ కుమార్‌కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది.’’ అని పేర్కొంటూ జడ్జి ఏక్తా గాబా మాన్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను నిరాకరించారు.  

కోర్టులో వాదోపవాదాలు..

కాగా, కుమార్‌ను అరెస్టు చేసి 21 రోజులు గడిచిపోయాయని కుమార్ తరపు న్యాయవాది వాదించారు. కుమార్ కేవలం క్లర్క్ ర్యాంక్‌లో వ్యక్తిగత కార్యదర్శి మాత్రమేనని, సాక్ష్యాలను ప్రభావితం చేసే వ్యక్తి కాదని కోర్టుకు వివరించారు. 

అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కుమార్ "చాలా ప్రభావవంతమైన" వ్యక్తి అని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు, ఎమ్మెల్యేలు కూడా కుమార్ నుండి అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే ముఖ్యమంత్రిని కలస్తారని వాదించారు.    

 

Tags:    

Similar News