కేజ్రీవాల్ సహయకుడు బిభవ్ కుమార్‌కు కస్టడీ పొడిగింపు

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

Update: 2024-06-22 09:49 GMT

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని జూలై 6 వరకు పొడిగిస్తూ శనివారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో మే 13న తనపై కుమార్ దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుమార్ ముందస్తు బెయిల్‌ను కోర్టు తిరస్కరించడంతో మే 18న కుమార్‌ని అరెస్టు చేశారు. తరువాత ఆయనను ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది కోర్టు.

కాగా కేజ్రీవాల్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ను బీజేపీ అస్ర్తంగా వాడుకుంటోందని ఆప్ నేతలు గతంలో ఆరోపించారు. తమ పార్టీని తుడిచిపెట్టేందుకు కాషాయ పార్టీ 'ఆపరేషన్ ఝాడూ' ప్రారంభించిందని కేజ్రీవాల్ అన్న మాటలను కూడా వారు గుర్తు చేశారు. 

Tags:    

Similar News