రాహుల్‌కు ఈసీ డెడ్‌లైన్..

‘‘7 రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించకుంటే బీహార్‌లో 'ఓట్ల దొంగతనం', SIR డ్రైవ్‌పై రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా పరిగణిస్తాం’’ - ఈసీ సీఈసీ జ్ఞానేష్ కుమార్;

Update: 2025-08-17 12:14 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కేంద్ర ఎన్నికల కమిషన్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీ(BJP)తో కుమ్మకై EC ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని, ఆ పార్టీ ఆదేశాల మేరకే బీహార్ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) చేపట్టి ప్రతిపక్ష వ్యతిరేక ఓటర్లను తొలగించేందుకు కుట్ర జరిగిందని ఆరోపించారు. మరో అడుగు ముందుకేసి తర్వలో అసెంబ్లీ ఎన్నికలు జరగున్న బీహార్ రాష్ట్రంలో ఈనెల 17న ‘ఓట్ అధికార్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈసీ విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసింది. 7 రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించకుంటే బీహార్‌లో 'ఓట్ల దొంగతనం', SIR డ్రైవ్‌పై రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా పరిగణిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ చెప్పారు. ఈసీ దృష్టిలో అన్ని రాజకీయ పార్టీలను సమానమని, ప్రతిపక్షం, పాలకపక్షం అన్న భావన ఉండదని పేర్కొన్నారు.

బీహార్‌లో ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల పేర్లను ఏఏ కారణాలతో తొలగించారో చెప్పాలని సుప్రీంకోర్టు ECని కోరింది. SIR ప్రక్రియపై స్టే విధించాలని ఇప్పటికే పలు పార్టీలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News