అల్‌ఫలాహ్ గ్రూప్ చైర్మన్ సిద్ధిఖీ కస్టడీకి కోర్టు అనుమతి..
డిసెంబర్ 1 వరకు 13 వరకు కస్టడీలోకి తీసుకోనున్న ఈడీ..
అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జావాద్ అహ్మద్ సిద్ధిఖీ(Siddiqui)ని ఈడీ(ED) కస్టడీకి కోర్టు అనుమతించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సిద్ధిఖీని అదుపులోకి తీసుకున్న ఈడీ ..ఆయనను బుధవారం అదనపు సెషన్స్ జడ్జి శీతల్ చౌదరి ప్రధాన్ (సాకేత్ కోర్టు) నివాసంలో హాజరుపరిచి, 14 రోజుల కస్టడీకి కోరారు. న్యాయమూర్తి 13 రోజుల (డిసెంబర్ 1 వరకు 13 వరకు) కస్టడీకి అనుమతించారు.
అంతకుముందు ఢిల్లీ ఓఖ్లా ప్రాంతంలోని అల్ ఫలాహ్(Al Falah group) ట్రస్ట్ కార్యాలయంపై అలాగే విశ్వవిద్యాలయం ట్రస్టీలు, ప్రమోటర్ల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన కారు పేలుడులో 15 మంది మృతి చెందిన ఘటనకు అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది వైద్యుల హస్తం ఉందని ఈడీ అనుమానిస్తోంది. సిద్ధిఖీ వద్ద లెక్కలు చూపని రూ. 415 కోట్ల ఉన్నాయని ఈడీ చెబుతోంది. అయితే ఈ కేసులో తన క్లయింట్‌ను ఇరికించారని సిద్ధిఖీ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
షెల్ కంపెనీలు..
గ్రూప్‌తో తొమ్మిది షెల్ (డమ్మీ) కంపెనీలు ఒకే చిరునామాలో నమోదు చేయి ఉన్నట్లు ED పరిశీలనలో తేలింది. 1956 నాటి UGC చట్టంలోని సెక్షన్ 12(B) కింద అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం UGC గుర్తింపును తప్పుగా క్లెయిమ్ చేసిందని, విద్యార్థులు, తల్లిదండ్రులు, సంరక్షకులు, వాటాదారులు, సాధారణ ప్రజలను మోసం చేసి తప్పుడు లాభం పొందాలనే ఉద్దేశంతో ఉందని పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు.